గ్లోబల్ మార్కెట్లలో స్విఫ్ట్ స్పోర్ట్ వచ్చే ఏడాది జనరేషన్ అప్‌డేట్‌ను పొందే అవకాశం ఉంది. కొత్త మోడల్ 1.4-లీటర్, 4-సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది, 48V మైల్డ్ హైబ్రిడ్ టెక్నాలజీతో ఉంటుంది.
సుజుకి స్విఫ్ట్ స్పోర్ట్ (Suzuki Swift Sport) తాజాగా ముంబై విమానాశ్రయంలో కనిపించింది. ఇది ఒక ప్రైవేట్ దిగుమతి సంస్థ అయి ఉండవచ్చు లేదా మరొక మార్కెట్‌కు రవాణా చేసే ప్రక్రియలో ఉండొచ్చు. ఇప్పుడు సుజుకి స్విఫ్ట్ స్పోర్ట్ స్పై ఫోటోలు బయటకు వచ్చాయి, ఈ కారణంగా ఈ కారు గురించి మరోసారి చర్చ మొదలైంది.
మైల్డ్ హైబ్రిడ్ టెక్నాలజీ
నివేదికల ప్రకారం మారుతి సుజుకి ఈ హాట్-హ్యాచ్‌బ్యాక్ కారుని దేశంలోకి తీసుకురావడానికి ప్రస్తుతానికి ప్రణాళికలు లేవు. అయితే, గ్లోబల్ మార్కెట్లలో స్విఫ్ట్ స్పోర్ట్ వచ్చే ఏడాది జనరేషన్ అప్‌డేట్‌ను పొందే అవకాశం ఉంది. కొత్త మోడల్ 1.4-లీటర్, 4-సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది, 48V మైల్డ్ హైబ్రిడ్ టెక్నాలజీతో ఉంటుంది. గేర్ ట్రాన్స్‌మిషన్ కోసం 6-స్పీడ్ మాన్యువల్ అండ్ 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఇచ్చారు.
undefined
ఇంజిన్ పవర్
జపనీస్ కార్‌మేకర్ కార్ బరువును తగ్గించడానికి హార్ట్‌టెక్ ప్లాట్‌ఫారమ్ మోడిఫైడ్ వెర్షన్ ఉపయోగించవచ్చు. ప్రస్తుత జనరేషన్‌తో పోలిస్తే, కొత్త మోడల్ మరింత టార్క్, ఆక్సీలరేషన్ అందిస్తుంది. అయితే కంపెనీ ఇంకా అధికారికంగా కారు వివరాలను వెల్లడించలేదు. జపాన్-స్పెక్ 2023 సుజుకి స్విఫ్ట్ స్పోర్ట్ (2023 suzuki swift sport) ఇంజన్ 160 PS శక్తిని ఉత్పత్తి చేయగలదు. హాట్-హ్యాచ్‌బ్యాక్ లోపల, బయట ఎన్నో ముఖ్యమైన మార్పులు ఆశించవచ్చు.
మారుతి సుజుకి
ఇండో-జపనీస్ ఆటోమేకర్ నుండి కొత్త ఎస్‌యూవిలతో దాని ఉత్పత్తి పోర్ట్‌ఫోలియోను విస్తరించాలని యోచిస్తోంది. వచ్చే నెలలో రానున్న సెకండ్ జనరేషన్ బ్రెజ్జాతో కంపెనీ అరంగేట్రం చేయనుంది. దీని తరువాత, కంపెనీ మిడ్-సైజ్ ఎస్‌యూవిని తీసుకువస్తుంది, దీనిని సుజుకి అండ్ టయోటా కలిసి అభివృద్ధి చేయనుంది. నివేదికల ప్రకారం కర్ణాటకలోని టయోటా బిడాడి ప్లాంట్‌లో కంపెనీ ట్రయల్ ఉత్పత్తిని ప్రారంభించింది. రాబోయే SUV టయోటా TNGA-B ప్లాట్‌ఫారమ్ అడ్జస్ట్ వెర్షన్‌లో నిర్మించవచ్చు.