టాటా మోటార్స్ కొత్త మోడల్‌ కార్.. ఎక్కువ మైలేజ్, బెస్ట్ ఫీచర్స్ బడ్జెట్ ధరకే..

By asianet news telugu  |  First Published Oct 29, 2022, 12:00 PM IST

టియాగో ఎన్‌ఆర్‌జి సిఎన్‌జి లాంచ్ గురించి టాటా మోటార్స్ డీలర్‌లకు సమాచారం అందించింది. టియాగో ఎన్‌ఆర్‌జిని దాని స్టైలింగ్ ఇంకా డిజైన్ కారణంగా కస్టమర్లు ఎంతో ఇష్టపడుతున్నారని టాటా మోటార్స్ వెల్లడించింది.2021లో ఫేస్‌లిఫ్ట్ అండ్ BS6 అప్‌గ్రేడ్ దీన్ని ప్రీమియం ఇంకా ఆకర్షణీయంగా చేసింది.  


ఇండియన్ కంపెనీ టాటా మోటార్స్ పోర్ట్‌ఫోలియోలో టియాగో కార్ ముఖ్యమైన పాత్ర పోషించింది. టియాగోతోనే టాటా కొత్త ఇన్నింగ్స్ కూడా మొదలైందని చెప్పవచ్చు. టాటా కార్ల సేల్స్ గ్రాఫ్‌ను పైకి తీసుకెళ్లింది టియాగోనే. టియాగో తర్వాత ప్రజలు టిగోర్, నెక్సన్, ఆల్ట్రోజ్ అండ్ పంచ్‌లను కూడా ఆదరించారు. కంపెనీ టియాగో NRG వేరియంట్‌ను లాంచ్ చేసిన సంగతి మీకు తెలిసిందే. ఈ కార్ టాప్-స్పెక్ XZ అండ్ XT ట్రిమ్‌లలో వస్తుంది. ఇప్పుడు కంపెనీ టియాగో NRG iCNG వేరియంట్‌ను కూడా లాంచ్ చేసింది. 

టియాగో ఎన్‌ఆర్‌జి సిఎన్‌జి లాంచ్ 
టియాగో ఎన్‌ఆర్‌జి సిఎన్‌జి లాంచ్ గురించి టాటా మోటార్స్ డీలర్‌లకు సమాచారం అందించింది. టియాగో ఎన్‌ఆర్‌జిని దాని స్టైలింగ్ ఇంకా డిజైన్ కారణంగా కస్టమర్లు ఎంతో ఇష్టపడుతున్నారని టాటా మోటార్స్ వెల్లడించింది.2021లో ఫేస్‌లిఫ్ట్ అండ్ BS6 అప్‌గ్రేడ్ దీన్ని ప్రీమియం ఇంకా ఆకర్షణీయంగా చేసింది.  బెస్ట్-ఇన్-క్లాస్ ఫీచర్‌లు, డ్రైవింగ్, సేఫ్టీ ఇంకా కంఫర్ట్‌తో దాని సెగ్మెంట్‌లో బెంచ్‌మార్క్‌లను సెట్ చేసింది. మేము గత 3 సంవత్సరాలలో CNG వాహనాల అమ్మకాల్లో భారీ డిమాండ్ ఇంకా వృద్ధిని చూశాము. దీనిలో వాల్యూమ్ మూడు రెట్లు పెరిగింది ఇంకా మొత్తం సేల్స్ వాటా 11%కి రెట్టింపు అయింది. పెరుగుతున్న CNG విభాగంలో మా ఉనికిని అలాగే వాల్యూమ్‌లను మెరుగుపరచడానికి మేము టియాగో NRG iCNG భారతదేశపు మొట్టమొదటి టఫ్‌రోడర్ CNGని లాంచ్ చేస్తున్నాము అని కంపెనీ తెలిపింది.

Latest Videos

undefined

టియాగో ఎన్‌ఆర్‌జి సిఎన్‌జి ధర
ప్రస్తుత టియాగో ఎన్‌ఆర్‌జి ఎక్స్‌టి ధర రూ. 6.42 లక్షలు, ఎక్స్‌జెడ్ ధర రూ. 6.83 లక్షలు. సాధారణ టియాగో CNG వేరియంట్ ధర  పెట్రోల్  కంటే రూ.91కే ఎక్కువ. టియాగో ఎన్‌ఆర్‌జి సిఎన్‌జి అదే ధర ఉండవచ్చని ఆశించవచ్చు. అలా అయితే టియాగో NRG XT CNG  ఎక్స్-షోరూమ్ ధర రూ. 7.33 లక్షలు అండ్ NRG XZ CNG ధర రూ. 7.74 లక్షలు కావచ్చు.

టియాగో NRG CNG ఇంజన్
టాటా టియాగో NRG CNG డీలర్‌షిప్‌లలో అందుబాటులో ఉంది. టియాగో ఎన్‌ఆర్‌జి సిఎన్‌జి 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో అందించబడుతుంది,  సిఎన్‌జిపై నడుస్తున్నప్పుడు 72 బిహెచ్‌పి, 95 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీని మైలేజ్ 26.4km/kg. నవంబర్ మొదటి వారంలో కంపెనీ ధరను అధికారికంగా ప్రకటించవచ్చు. గ్రే, వైట్, రెడ్ అండ్ ఫోలేజ్ గ్రీన్ కలర్స్‌లో లాంచ్ అవుతుంది.

click me!