మీరు కారు లేదా బైక్ కొనేటప్పుడు తప్పనిసరిగా సిసి అనే పదాన్ని వినే ఉంటారు. అసలు ఈ పదానికి పూర్తి అర్థం ఏంటి, వాహనంలో దాని ఉపయోగం ఏంటి..? ఇది చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు.
కారులో ఇంజన్ చాలా ముఖ్యమైన భాగం. చాలా మంది కార్ ఇంజన్ గురించి మాట్లాడుతుంటారు కానీ కొందరికి దీనిపై పూర్తి అవగాహన ఉండదు. కారు ఇంజన్‌లో సిసి, హార్స్పవర్, టార్క్ అండ్ ఆర్‌పిఎం అంటే ఏంటి.. దీని గురించి సమాచారం తెలుసుకోండి..
సిసి అర్థం ఏమిటి..?
మీరు కారు లేదా బైక్ కొనేటప్పుడు తప్పనిసరిగా సిసి అనే పదాన్ని వినే ఉంటారు. అసలు ఈ పదానికి పూర్తి అర్థం ఏంటి, వాహనంలో దాని ఉపయోగం ఏంటి..? ఇది చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. సిసి అంటే క్యూబిక్ సెంటీమీటర్. దీనిని క్యూబిక్ కెపాసిటీ అని కూడా అంటారు. సాధారణంగా వాహనం ఇంజిన్ లో సింగిల్ సిలిండర్ ఉంటుంది. ఇది ఆ సిలిండర్ లోపల మొత్తం వాల్యూమ్. తక్కువ సిసి ఉన్న వాహనంలో తక్కువ శక్తి ఉంటుంది, అయితే ఎక్కువ సిసి ఉన్న వాహనంలో ఎక్కువ శక్తి ఉంటుంది. వెయ్యి సీసీ అంటే ఒక లీటర్ అని కూడా అర్థం. ఈ రోజుల్లో చాలా కార్ కంపెనీలు వాహనాల ఇంజన్ సమాచారాన్ని 1.0 లీటర్, 1.2 లీటర్, 2.4 లీటర్‌లలో అందిస్తున్నాయి.
undefined
టార్క్ అంటే ఏమిటి..?
టార్క్ అనేది ఒక రకమైన శక్తి. ఇది వాహనాన్ని ముందుకు కదలడానికి సహాయపడుతుంది. ఆగి ఉన్న వాహనాన్ని ముందుకు కదలడానికి టార్క్ అవసరం. వాహనంకి ఎంత ఎక్కువ టార్క్ ఉంటే, అంతవేగంగా ముందుకు వెళ్తుంది. సాధారణంగా డీజిల్ ఇంజిన్ కి పెట్రోల్ ఇంజన్ కంటే ఎక్కువ టార్క్ ఉంటుంది.
హార్స్ పవర్ అంటే ఏమిటి..?
వాహనంలో ఇంజిన్ శక్తిని కొలవడానికి హార్స్ పవర్ ఉపయోగిస్తారు. దీనిని bhp, ps, fps అండ్ hpలలో కూడా పిలుస్తారు. వాహనంలో హార్స్‌పవర్ ఎంత ఎక్కువగా ఉంటే వీల్స్ కి అంత శక్తి వస్తుంది.
ఆర్‌పిఎం అంటే ఏమిటి
రొటేషన్ నిమిషాలను ఆర్‌పిఎం అంటారు. అంటే వాహనం ఇంజన్‌లో ఒక నిమిషంలో పిస్టన్ ఎన్నిసార్లు తిరుగుతుందో ఆర్‌పిఎం మీటర్‌లో చూపిస్తుంది. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు స్పీడోమీటర్‌లో ఆర్‌పిఎం ఎంత ఎక్కువగా ఉంటే, ఇంజిన్‌లో పిస్టన్ అంత ఎక్కువ తిరుగుతుంది ఇంకా వాహనం అంత ఎక్కువ శక్తిని పొందుతుంది.