లోకల్ మెకానిక్‌తో కార్ సర్వీసింగ్ చేయిస్తున్నారా.. అయితే ఈ విషయాలను గుర్తుంచుకోండి..

By asianet news telugu  |  First Published Oct 25, 2022, 2:53 PM IST

సాధారణంగా కారును షోరూంలో కాకుండా బయట మెకానిక్‌తో సర్వీసింగ్ చేసిన తర్వాత ఇంజిన్ ఆయిల్  సరైనది ఉపయోగించాడ లేదా అని అనుమానించవచ్చు. కొన్నిసార్లు మెకానిక్ డబ్బును ఆదా చేయడానికి కారులో తక్కువ క్వాలిటీ ఇంజిన్ ఆయిల్‌ను వాడతారు.


టైంకి కారు సర్వీసింగ్ చేయడం మీ కారుకి చాలా మంచిది. కానీ మీరు టైం ప్రకారం కారుని  సర్వీస్ సెంటర్‌కి కాకుండా మీ ఇంటికి లేదా ఆఫీసుకి దగ్గరలో ఉన్న మెకానిక్‌తో కార్ సర్వీస్ చేయిస్తే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అవసరం, లేదంటే భవిష్యత్తులో సమస్యలు ఎదురుకావచ్చు.

ఇంజిన్ ఆయిల్ గురించి జాగ్రత్త వహించండి 
సాధారణంగా కారును షోరూంలో కాకుండా బయట మెకానిక్‌తో సర్వీసింగ్ చేసిన తర్వాత ఇంజిన్ ఆయిల్  సరైనది ఉపయోగించాడ లేదా అని అనుమానించవచ్చు. కొన్నిసార్లు మెకానిక్ డబ్బును ఆదా చేయడానికి కారులో తక్కువ క్వాలిటీ ఇంజిన్ ఆయిల్‌ను వాడతారు, ఇది కారు ఇంజిన్ ను దెబ్బతీస్తుంది. అందువల్ల మీరు బయట సర్వీసింగ్ చేసినప్పుడల్ల మీరే వెళ్లి మీ కారుకి మంచి కంపెనీ ఇంజిన్ ఆయిల్‌ను కొనుగోలు చేసి మీ ముందే కారులో ఆయిల్ నింపమని చెప్పండి.

Latest Videos

undefined

బ్రేక్ ఆయిల్
ఇంజిన్ ఆయిల్ లాగానే బ్రేక్ ఆయిల్ కూడా కారులో వాడుతారు. మీరు కారును సర్వీస్ చేసినప్పుడల్ల బ్రేక్ ఆయిల్ లెవెల్ కూడా చెక్ చేయండి. ఆయిల్ లెవెల్ తక్కువగా ఉంటే దానిని టాప్ అప్ చేయండి. ఇంజన్ ఆయిల్ లాగా బ్రేక్ ఆయిల్ కూడా మంచి కంపెనీది వాడాలని గుర్తుంచుకోండి. మీరు ఇలా చేయకపోతే అవసరమైన సమయంలో బ్రేకింగ్ చేసేటప్పుడు సమస్య ఉండవచ్చు.

సస్పెన్షన్ విషయంలో  జాగ్రత్త వహించండి
బయట మెకానిక్‌తో కారును సర్వీస్ చేస్తున్నప్పుడు సస్పెన్షన్‌ను కూడా చెక్ చేయండి. కారు సస్పెన్షన్‌లో సమస్య ఉంటే కారు నడపడం కష్టం అవుతుంది. చాలా మంది కార్ సస్పెన్షన్‌ను చెక్ చేయరు, త్వరగా పాడయ్యే అవకాశం ఉన్న కూడా కారును డ్రైవ్ చేస్తారు. ఒకసారి సస్పెన్షన్ ఫెయిల్ అయితే దాన్ని రిపేర్ ఖర్చు మీకు పెద్ద భారం అవుతుంది.
 

click me!