Ola Electric Scooter: ఓలా స్కూట‌ర్‌కు నిప్పు.. అలా ఎందుకు చేశాడంటే..?

By team telugu  |  First Published Apr 27, 2022, 1:53 PM IST

ఓలా ఎల‌క్ట్రిక్‌ స్కూటర్, కస్టమర్ సర్వీస్‌తో వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యలకు సంబంధించిన వివాదాలతో చుట్టుముట్టింది. ఇటీవల ఓలా ఎస్1 ప్రో ఓనర్ తన స్కూటర్‌కు నిప్పంటించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారిన విష‌యం తెలిసిందే.
 


ఈ మధ్య కాలంలో ఎలక్ట్రిక్ వాహనాలు (Electric scooters) కాలిపోవటం, అమాంతం పేలిపోవటం వల్ల చాలా మంది ఈవీలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి ఘటనల వల్ల కంపెనీలు కూడా ఆందోళన చెందుతున్నాయి. కేంద్రం కూడా దీనిని సీరియస్ గా తీసుకుంది. ఇటీవల కాలంలో.. ఓలా స్కూటర్ తో పాటు కస్టమర్ సర్వీస్ వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యలకు సంబంధించి అనేక వివాదాలు చోటుచేసుకుంటున్నాయి. కంపెనీని వరుస సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఇటీవల తమిళనాడులో ఓలా ఎస్-1 ప్రో(Ola S1 Pro) ఓనర్ తన స్కూటర్‌కు నిష్పంటించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవ్వ‌డంతో ఈ ఘటన ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది.

నివేదికల ప్రకారం.. Ola S1 ప్రో యజమాని డాక్టర్ పృథ్వీరాజ్ స్కూటర్ పనితీరు, స్కూటర్ మైలేజ్ పట్ల అసంతృప్తిగా ఉన్నందున స్కూటర్‌ను తగులబెట్టారు. సంఘటనకు మూడు నెలల ముందు అతను ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కొనుగోలు చేశాడు. ఆయన స్కూటర్‌తో సమస్యలను ఎదుర్కొన్నారని వార్తా కథనాల ప్రకారం తెలుస్తోంది. అంతేకాకుండా.. సదరు డాక్టర్ ఇదే సమస్యపై గతంలో ఓలా ఎలక్ట్రికకు ఫిర్యాదు చేశాడు. ఓలా సపోర్టు ద్వారా స్కూటర్ని పరిశీలించి, మంచి వర్కింగ్ అర్జర్లో ఉన్నట్లు నిర్ధారించారు. మైలేజ్ సరిగా లేదని ఆయన తెలిపారు. 44 కిలోమీటర్ల ప్రయాణం తర్వాత అతని స్కూటర్ చెడిపోయింది. కోపంతో అతను స్కూటర్‌పై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటన తమిళనాడులోని అంబూర్ బైపాస్ రోడ్డు సమీపంలో చోటుచేసుకుంది.

Latest Videos

అదేవిధంగా మరో వివాదంలో ఓలా ఎస్1ప్రో యజమాని ద్విచక్ర వాహనాన్ని గాడిదకు కట్టి రోడ్డుపైకి లాగాడు. ఇది మాత్రమే కాదు.. ఓలా ఈ-స్కూటర్‌లను కొనుగోలు చేయకుండా ప్రజలను విజ్ఞప్తి చేసే బ్యానర్‌లను కూడా కట్టాడు. అంతకుముందు స్కూటర్లలో సమస్యలు, స్కూటర్లకు మంటలు అంటుకున్న సంఘటనను పరిగణనలోకి తీసుకుని ఓలా ఎలక్ట్రిక్ 1,441 యూనిట్ల ఓలా ఎస్1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్లకు రీకాల్ చేసిన విష‌యం తెలిసిందే.

click me!