2020 సంవత్సరానికి సుజుకి నుండి ఎలక్ట్రికల్ వాహనాలు

First Published 6, Jul 2018, 2:48 PM IST
Highlights

పర్యావరణ పరిరక్షణను దృష్టిలో పెట్టకుని ఎలాంటి కాలుష్య కారకాలను వెదజల్లని ఎలక్ట్రికల్ వాహనాల తయారీని చేపడుతున్నట్లు జపాన్ కు చెందిన ప్రముఖ వాహన తయారీ సంస్థ సుజుకి వెల్లడించింది. ఈ సంస్థ 2020 సంవత్సరం  నాటికి పెట్రోల్ తో పనిలేకుండా కేవలం ఎలక్ట్రిసిటీ ఆధారంగా నడిచే స్కూటర్లను భారత మార్కెట్ లోకి తీసుకువస్తామని ప్రకటించింది. అదేవిధంగా ఇదే సంవత్సరంలో ఎలక్ట్రికల్ కార్ల ను కూడా మార్కెట్ లో విడుదల చేయడానికి నిర్ణయించినట్లు సుజుకి వెల్లడించింది.

 ఇప్పటికే సుజుకి సంస్థ వివిధ నగరాల్లోని తమ వాహన తయారీ కంపెనీలకు ఎలక్ట్రికల్ వాహనాలను తయారు చేయాలని ఆదేశించినట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్ పర్యవేక్షించడానికి ఐదుగురు సభ్యులతో కూడిన ఓ టీం పనిచేస్తున్నట్లు సమాచారం.  టీం ఎలక్ట్రికల్ వాహనాల తయారీ వేగంగా జరిగేలా చూసి అనుకున్న సమయానికి వాహనాలు మార్కెట్లోకి వచ్చేలా చూస్తుంది. ఇప్పటికే గుజరాత్ లో రూ.1700 కోట్లతో బ్యాటరీల తయారీ చేపడుతున్నట్లు సుజుకి సంస్థ వెల్లడించింది.

ఈ ఎలక్ట్రికల్ వాహనాల తయారీ గురించి సుజుకి మోటార్ సైకిల్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సతోషి ఉచిడ మాట్లాడుతూ... ప్రస్తుతం మార్కెట్లో సాధారణ వాహనాల ఖరీదుతో పోలిస్తే ఎలక్ట్రికల్ వాహనాల తయారీ ఖరీదు చాలా ఎక్కువగా ఉందని అన్నారు. ఈ వ్యత్యాసాన్ని తగ్గిస్తూ చౌక ధరలకు ఎలక్ట్రికల్ వాహనాలను వినియోగదారులకు ఎలా అందించాలన్న దానిపై సమాలోచనలు జరుపుతున్నట్లు ఆయన తెలిపారు. ఇలా తక్కువ ధరకు మంచి కండీషన్ తో కూడిన వాహనాలను 2020 నాటికి మార్కెట్లో విడుదల చేస్తామని సతోషి తెలిపారు.

Last Updated 6, Jul 2018, 2:48 PM IST