భారత్‌లో వోల్వో ఎక్స్‌సి40 ఎస్‌యూవీ విడుదల, ధరెంతో తెలుసా?

First Published Jul 5, 2018, 11:49 AM IST
Highlights

దేశీయ విపణిలో వోల్వో ఎక్స్‌సి40 ప్రారంభ ధరను 39.90 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు. ఇది డీజిల్ ఇంజన్ ఆప్షన్‌తో లభ్యం కానుంది.

స్వీడన్‌కు చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ కంపెనీ వోల్వో, భారత మార్కెట్లో తమ సరికొత్త 2018 వెర్షన్ 'ఎక్స్‌సి40' (VOLVO XC40) మోడల్‌ను విడుదల చేసింది. దేశీయ విపణిలో వోల్వో ఎక్స్‌సి40 ప్రారంభ ధరను 39.90 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు. ఇది డీజిల్ ఇంజన్ ఆప్షన్‌తో లభ్యం కానుంది.

వోల్వో ఎక్స్‌సి40 ఎస్‌యూవీలో అమర్చిన 2.0-లీటర్ ఫోర్-సిలిండర్ డీజల్ ఇంజన్ గరిష్టంగా 190 బిహెచ్‌పిల శక్తిని, 400 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 8-స్పీడ్  ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ (గేర్‌బాక్స్)తో అనుసంధానం చేయబడి ఉంటుంది. ఈ కొత్త కారు ఆల్-వీల్ డ్రైవ్ (ఫోర్-వీల్ డ్రైవ్ అని కూడా పిలవొచ్చు) ఆప్షన్‌తో లభిస్తుంది.

ఆకర్షనీయమైన డిజైన్, అధునాతనమై సెక్యూరిటీ ఫీచర్స్, విలాసవంతమైన లగ్జరీ ఫీచర్స్ మరియు ఇంటీరియర్స్ ఈ కారు సొంతం. ఈ కారులో 9 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను అమర్చారు. ఇది ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో అప్లికేషన్లను సపోర్ట్ చేస్తుంది. ఈ అప్లికేషన్ల సాయంతో యూజర్లు తమ స్మార్ట్‌ఫోన్‌ని కారుతో అనుసంధానం చేసుకోవచ్చు. 

click me!