టి‌వి‌ఎస్ కి పోటీగా సుజుకి కొత్త స్కూటర్.. పెద్ద విల్స్, లేటెస్ట్ బెస్ట్ ఫీచర్స్ తో వచ్చేస్తుంది..

By asianet news teluguFirst Published Dec 7, 2022, 3:52 PM IST
Highlights

లుక్ మరియు డిజైన్ గురించి మాట్లాడితే బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ EX ఒక స్లీక్ బాడీ డిజైన్‌తో పాటు మెరుగైన విజిబిలిటీ కోసం ఎల్‌ఈ‌డి లైట్లతో ముందు అండ్ వెనుక లైట్ సిస్టమ్ ఉంది. 
 

జపనీస్ మల్టీనేషనల్ కార్పొరేషన్ సుజుకి మోటార్‌సైకిల్  ఇండియాలో  సరికొత్త బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ ఈ‌ఎక్స్ ను లాంచ్ చేసింది. దీని ధర ప్రస్తుత వేరియంట్ కంటే దాదాపు రూ. 19,000 ఎక్కువ, ప్రస్తుత వేరియంట్ ధర రూ.89,900. ఈ స్కూటర్  కొత్త  ఈ‌ఎక్స్ వేరియంట్ ప్రస్తుత మోడల్‌తో పాటు విక్రయిస్తున్నారు. ఈ ప్రీమియం స్కూటర్ మూడు కలర్ ఆప్షన్స్ లో వస్తుంది - మెటాలిక్ మ్యాట్ ప్లాటినం సిల్వర్, మెటాలిక్ రాయల్ బ్రాంజ్ అండ్ మెటాలిక్ మ్యాట్ బ్లాక్.  ఎకో పెర్ఫార్మెన్స్ ఆల్ఫా (SEP-α) ఇంజన్, ఇంజిన్ ఆటో స్టాప్-స్టార్ట్‌ (EASS) సిస్టమ్, సైలెంట్ స్టార్టర్ సిస్టమ్ ఇచ్చారు,

లుక్ అండ్ డిజైన్ 
లుక్ మరియు డిజైన్ గురించి మాట్లాడితే బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ EX ఒక స్లీక్ బాడీ డిజైన్‌తో పాటు మెరుగైన విజిబిలిటీ కోసం ఎల్‌ఈ‌డి లైట్లతో ముందు అండ్ వెనుక లైట్ సిస్టమ్ ఉంది. 

ఈ స్కూటర్ EASS ఫంక్షనాలిటీతో వస్తుంది, అంటే ఇంజిన్ ఐడీల్ లో ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా ఆఫ్ అవుతుంది, రైడర్ పైకి ఆక్సీలరేట్ చేసిన వెంటనే దాన్ని మళ్లీ స్టార్ట్ అవుతుంది. అంటే ఇంధన వినియోగంతో పాటు ఉద్గారాలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇటువంటి టెక్నాలజి ముఖ్యంగా ట్రాఫిక్ సిగ్నల్, స్టాప్ అండ్ గో ట్రాఫిక్ వద్ద ప్రయోజనకరంగా ఉంటుంది. 

సైలెంట్ స్టార్టర్
ఈ ప్రీమియం స్కూటర్  మరొక గొప్ప ఫీచర్ గురించి మాట్లాడితే  కొత్త సైలెంట్ స్టార్టర్ సిస్టమ్ ఇచ్చారు, అంటే స్కూటర్‌ను స్మూత్ గా స్టార్ట్ చేయడంలో సహాయపడుతుంది.  

అద్భుతమైన ఫీచర్లు
ఈ స్కూటర్‌లో 12 అంగుళాల బ్యాక్ టైర్ వీల్ ఉంది, అంటే వెడల్పుగా, పెద్దగా ఇంకా మరింత విలాసవంతంగా ఉంటుంది. దీని పెద్ద   విల్స్ సిటీ రైడింగ్ మెరుగుపరచడంలో సహాయపడుతుంది. బర్గ్‌మాన్ స్ట్రీట్ EX ఇతర ముఖ్యమైన ఫీచర్స్ లో సుజుకి రైడ్ కనెక్ట్ బ్లూటూత్‌కు సపోర్ట్ ఇచ్చే డిజిటల్ కన్సోల్‌తో వస్తుంది. ఈ టెక్నాలజి ద్వారా, రైడర్  మొబైల్ ఫోన్‌ను స్కూటర్‌తో సింక్ చేయవచ్చు. అంటే  టర్న్-బై-టర్న్ నావిగేషన్, ఇన్‌కమింగ్ కాల్, SMS అండ్ WhatsAp అలాగే మిస్డ్ కాల్ అలర్ట్‌లను చూడవచ్చు.

డిజిటల్ కన్సోల్‌లో కనిపించే ఇతర నోటిఫికేషన్‌లలో ఓవర్‌స్పీడ్ అలెర్ట్, ఫోన్ బ్యాటరీ లెవెల్  ఉన్నాయి. కన్సోల్‌కి ఫోన్‌ను కనెక్ట్ చేయడం చాలా ఈజీ ఇంకా Android అండ్ iOS ఫోన్‌లు రెండింటినీ కనెక్ట్ చేయవచ్చు. 

ఇంజిన్ అండ్ పవర
కొత్త సుజుకి బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ EX 124cc, సింగిల్-సిలిండర్ తో  శక్తిని పొందింది. ఇంకా ప్రస్తుత వేరియంట్ కంటే 0.1 PS తక్కువ శక్తిని ఇస్తుంది. ఈ ఇంజన్ 6,750 rpm వద్ద గరిష్టంగా 8.6 bhp శక్తిని,5,500 rpm వద్ద 10 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 
కొత్త సుజుకి బర్గ్‌మాన్ స్ట్రీట్ EX భారత మార్కెట్లో TVS NTorq 125, యమాహా ఎఫ్‌డి 125, Aprilia SXR 125 మరియు హోండా యాక్టివా 125 వంటి స్కూటర్‌లతో పోటీపడుతుంది .
                     

click me!