స్పెషల్ లుక్ ఇంకా డిజైన్ తో మోడిఫైడ్ రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌ని చూసారా.. ఎప్పటికీ తుప్పు పట్టదు కూడా..

By asianet news teluguFirst Published Dec 5, 2022, 5:38 PM IST
Highlights

రాయల్ ఎన్‌ఫీల్డ్ ఎలక్ట్రా బైక్ ఇంజన్‌లో ఎలాంటి మార్పు చేయలేదు. దీనికి కాస్ట్ ఇనుముతో తయారు చేయబడిన 350 సిసి ఇంజన్ ఉంది. బైక్ ఓనర్ భార్య పేరు మీదుగా దీనికి "గూంజ్" అని పేరు పెట్టారు. 

 ఇండియాలో పెర్ఫామెన్స్ బైక్‌గా పేరుగాంచిన రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌ని కస్టమైజ్ చేయడం ద్వారా బైక్ లవర్స్  ప్రత్యేకమైన లుక్ ఇంకా డిజైన్ తీసుకొస్తుంటారు. ఇప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ ఎలక్ట్రా 350 CI బైక్ కస్టమైజ్ కూడా చేయబడింది, ఇంకా చాలా ప్రత్యేకమైన లుక్ కూడా అందించారు. దీనిని TNT మోటార్‌సైకిల్స్‌ తయారు చేసారు. ఒక కస్టమర్ తన ఎలక్ట్రాను గుర్తుండిపోయే మోడల్‌గా మార్చాలని కోరుకున్నాడు ఇంకా ఈ బైక్ ను తన కుటుంబంలో ఎప్పటికీ ఉండాలని కోరుకున్నాడు.  

అయితే రాయల్ ఎన్‌ఫీల్డ్ ఎలక్ట్రా బైక్ ఇంజన్‌లో ఎలాంటి మార్పు చేయలేదు. దీనికి కాస్ట్ ఇనుముతో తయారు చేయబడిన 350 సిసి ఇంజన్ ఉంది. బైక్ ఓనర్ భార్య పేరు మీదుగా దీనికి "గూంజ్" అని పేరు పెట్టారు. ఈ బైక్ ను ఇండియా బైక్ వీక్ 2022లో ప్రదర్శించారు, అంతేకాదు అక్కడ చూపరుల  దృష్టిని ఎంతో ఆకర్షించింది. 

సాధారణం గా బైక్స్  ఏళ్ల తరువాత తుప్పు పడుతుంటాయి అయితే ఈ బైక్ రూపొందించడానికి TNT చాలా కృషి  చేయాల్సి ఉంది. బైక్ స్టెయిన్‌లెస్ స్టీల్ (SS 304) అండ్ అల్యూమినియంతో తయారు చేయబడింది. కాబట్టి, సరిగ్గా మెయింటైన్స్ చేస్తే బైక్ చాలా కాలం పాటు ఉంటుందని సూచించారు.

బాడీ ప్యానెల్లు అల్యూమినియంతో తయారు చేసారు. చాసిస్ అల్ న్యూ ఆన్ కస్టమ్ మేడ్ ఇంకా ఫ్రంట్ గిర్డర్ కూడా పూర్తిగా కొత్తది, SS 304తో తయారు చేయబడింది. 

ఫ్యూయల్ ట్యాంక్ హ్యాంగర్లు, హబ్‌లు, డిస్క్ ప్లేట్ కవర్, స్ప్రాకెట్ కవర్, ఇంజిన్ పాయింట్ కవర్ అండ్ రియర్ యాక్సిల్ కవర్ వంటి భాగాలు అల్యూమినియంతో తయారు చేయబడ్డాయి. TNT బైక్స్ స్టెయిన్‌లెస్ స్టీల్‌లో గ్రిప్స్, హ్యాండిల్ బార్, ఫుట్ పెగ్‌లు, బ్రేక్ లివర్లు, గేర్ లివర్, కిక్, సైడ్ స్టాండ్, డిస్క్ ప్లేట్లు, స్ప్రాకెట్ అండ్ ఎగ్జాస్ట్ పైప్ వంటి ఇంటర్నల్ థొరెటల్ మెకానిజంతో కొన్ని కస్టమ్ పార్ట్శ్ కూడా తయారు చేసింది. కస్టమ్ బైక్ షాప్ ఇంజిన్, లోగో ఇంకా ఎగ్జాస్ట్ టిప్ పై ఇత్తడి డెకరేషన్ చేసింది. 

click me!