Electric Car: ఎలక్ట్రిక్ కారు రూ.4.5 లక్షలు మాత్రమే.. నమ్మబుద్ధి కావడం లేదా..!

Sreeharsha Gopagani   | Asianet News
Published : Apr 17, 2022, 04:23 PM IST
Electric Car: ఎలక్ట్రిక్ కారు రూ.4.5 లక్షలు మాత్రమే.. నమ్మబుద్ధి కావడం లేదా..!

సారాంశం

ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల హవా నడుస్తోంది. ఆటోమేకర్లు నిరంతరం కొత్త కార్లను విడుదల చేస్తున్నారు. ఇది కాకుండా, కొన్ని కంపెనీలు కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టడానికి ప్రకటనలు కూడా చేస్తున్నాయి. 

ముంబైకి చెందిన ఆటోమొబైల్‌ సంస్థ గతేడాది స్ట్రోమ్‌ మోటార్స్‌ ‘స్టోమ్‌ ఆర్‌3’ పేరుతో ఎలక్ట్రిక్‌ కారును ఆవిష్కరించింది. ప్రస్తుతం దీనికి వాహనదారుల నుంచి డిమాండ్ భారీగా పెరిగిపోయింది. ఆటో తరహాలో ఉన్న ఈ కారుకు ముందు రెండు టైర్లు.. వెనుక ఒక టైరు ఉండగా.. సీట్లు రెండే ఉన్నాయి. దీని 2వేల 915 మిల్లీమీటర్లు, వెయ్యి 519 మిల్లీమీటర్లు వెడల్పు, వెయ్యి 545మిల్లీమీటర్లు ఎత్తు ఉంటుంది. అచ్చం స్టోమ్‌ ఆర్‌3 కారు ముందు భాగం ‘మహీంద్రా ఈ2ఓ’ను పోలి ఉంది. ఈ కారుకు టెక్నాలజీని జోడిస్తూ గ్రిల్‌ ఎలిమెంట్‌ను కారు ఎడమవైపు, కుడివైపు ఇలా బ్యానెట్‌ వరకు డిజైన్‌ చేశారు. ఇరువైపులా హెక్సాగోనల్(షడ్కోణం)లో డోర్స్‌ ఏర్పాటుచేశారు.

లగ్జరీ కార్లు ఫీచర్లు

1990లలో మెర్సిడెజ్‌ బెంజ్‌ కార్లలో ఉండే ఈ లగ్జరీ స్క్రీన్‌ ఫీచర్లు.. అన్నీ ఎలక్ట్రిక్‌ కార్లలో వస్తున్నాయి. 3స్క్రీన్‌లు ఉండగా ఇన్ఫోటైన్‌మెంట్, ఇన్‌స్ట్రుమెంట్, క్లైమేట్ కంట్రోల్ స్క్రీన్‌లుగా ఉపయోగించుకోవచ్చు. అందులో ఒక స్క్రీన్‌ ఏడు అంగుళాలు, మిగిలిన 2 స్క్రీన్‌లలో ఒకటి 4.3 అంగుళాలు, మరో స్క్రీన్‌ 2.4 అంగుళాలుగా ఉంది. సెంట్రల్ కన్సోల్‌లో ఏసీ లోపలి గాలి బయటకు బయట గాలి లోపలికి వచ్చేందుకు 2 ఎయిర్‌కాన్ వెంట్స్ ఉన్నాయి.

4జీ కనెక్టివిటీతో నావిగేషన్, వాయిస్ కంట్రోల్, సిగ్నల్‌ కంట్రోలింగ్‌ సపోర్ట్‌ సిస్టమ్‌ అందుబాటులో ఉంది. స్టీల్ స్పేస్ ఫ్రేమ్ ఆధారంగా కారు 550 కిలోల బరువును తక్కువగా ఉండేలా డిజైన్‌ చేశారు. 15కేడబ్ల్యూ, 90ఎన్‌ఎం టార్క్‌తో ఎలక్ట్రిక్ మోటార్, సింగిల్ రిడక్షన్ గేర్‌బాక్స్‌, స్ట్రోమ్ టాప్ స్పీడ్ 80కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేయొచ్చని సంస్థ ప్రతినిధులు తెలిపారు. 3వేర్వేరు లి-అయాన్‌ బ్యాటరీ కాన్ఫిగరేషన్‌లు 12కోట్లా లక్షా 60వేల 200 కిలోమీటర్ల రేంజ్‌తో ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. ఈ కారు ఎక్స్‌ షోరూమ్‌ ధర రూ.4.5లక్షలుగా ఉండగా..కారును మార్కెట్‌లో విడుదలైన 4రోజుల్లో సుమారు 160 కార్లు బుక్ అయినట్లు కంపెనీ అధికార ప్రతినిధులు వెల్లడించారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Maruti Invicto : ఈ కారుపై డిస్కౌంటే రూ.2,15,000 .. అదిరిపోయే ఇయర్ ఎండ్ ఆఫర్
Tata Tiago EV : ఈ కారుపై డిస్కౌంటే రూ.1,65,000 .. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే సొంతం చేసుకొండి