New BMW F 900 XR Pro: ర‌య్‌.. మ‌ని దూసుకెళ్లే BMW F 900 XR Pro స్పోర్ట్స్ బైక్ ధరెంతో తెలుసా..?

By team telugu  |  First Published Apr 15, 2022, 1:51 PM IST

BMW నుంచి అడ్వెంచర్ స్పోర్ట్స్ బైక్ BMW F 900 XR Pro భారత్ మార్కెట్లో లాంచ్ అయింది. ఇది సింగిల్ వేరియంట్‌లో మాత్రమే లభ్యమవుతోంది. బుకింగ్స్ ప్రారంభమ‌య్యాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
 


ప్రముఖ ఆటోమొబైల్ మేకర్ BMW తమ బ్రాండ్ నుంచి భారత మార్కెట్లో BMW F 900 XR Pro అనే అడ్వెంచర్ స్పోర్ట్స్ బైక్ ను విడుదల చేసింది. పూర్తిగా బిల్ట్-అప్ యూనిట్లుగా (CBU) అందుబాటులోకి రానున్న ఈ అడ్వెంచర్ స్పోర్ట్స్ టూరర్ ఎక్స్-షోరూమ్ వద్ద ధర రూ. 12.30 లక్షలుగా నిర్ణయించారు. ఇప్పటికే ఈ మోటార్‌సైకిల్ బుకింగ్‌లు BMW మోటోరాడ్ డీలర్‌షిప్‌లలో ప్రారంభమయ్యాయి. ఇప్పుడు బుక్ చేసుకున్నవారికి జూన్ 2022లో డెలివరీ చేయనున్నారు. ఈ బైక్ కొనుగోలు చేయాలనుకునే వారికోసం BMW ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇండియా ద్వారా ఈఎంఐ ఆప్షన్స్ కూడా అందిస్తున్నారు.

BMW F 900 XR Pro ఫీచర్లు

Latest Videos

undefined

సరికొత్త 2022 మోడల్ BMW F 900 XR Pro ఫీచర్లను పరిశీలిస్తే.. దీని డిజైన్ స్టైలింగ్ పూర్తిగా గత మోడెల్స్ నుంచే తీసుకున్నట్లుగా ఉంది. ముందుభాగంలో ట్విన్-పాడ్ హెడ్‌లైట్, సెమీ-ఫెయిరింగ్ డిజైన్, లేతరంగు గల విండ్‌స్క్రీన్ ఉన్నాయి. మిగతా ఫీచర్లు చూస్తే ఇంజిన్ కౌల్, స్టెప్-అప్ సీట్ ఇంకా సైడ్-స్లంగ్ ఎగ్జాస్ట్‌ను కలిగి ఉంది.

ఎలక్ట్రానిక్ విభాగాలను పరిశీలిస్తే.. పూర్తిగా LED లైటింగ్ సిస్టమ్, బ్లూటూత్ కనెక్టివిటీ కలిగిన 6.5-అంగుళాల కలర్ TFT స్క్రీన్, ABS, ట్రాక్షన్ కంట్రోల్, అడాప్టివ్ కార్నరింగ్ లైట్లు, హీటెడ్ గ్రిప్‌లు, ఇంజిన్ బ్రేక్ కంట్రోల్, ప్రో రైడింగ్ మోడ్‌, కీలెస్ రైడ్ తదితర ఫీచర్లు ఉన్నాయి. 

ఇంజన్ కెపాసిటీ
ఈ మోటార్‌సైకిల్ BS6- ప్రమాణాలు కలిగి 895cc లిక్విడ్-కూల్డ్ ట్విన్ సిలిండర్ ఇంజన్‌తో వచ్చింది. ఇది 8,500rpm వద్ద 103.2bhp శక్తిని విడుదల చేస్తుంది. అలాగే 6,500rpm వద్ద 92Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కేవలం 3.6 సెకన్లలోనే 0-100kmph వేగాన్ని అందుకోగలదు. ఈ బైక్ గరిష్టంగా గంటకు 200 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుంది.

click me!