వోల్వో కార్స్ ఇండియా అధికారిక సోషల్ మీడియా ఖాతా ద్వారా ఈ సమాచారాన్ని అందించింది అలాగే కారు డెలివరీ చేస్తున్న ఫోటో ని కూడా పోస్ట్ చేసింది. రాజమౌళి కొనుగోలు చేసిన వోల్వో XC40 వోల్వో ఎంట్రీ-లెవల్ SUV అలాగే భారతదేశంలో దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 44.50 లక్షలు.
భారతీయ సినిమాలో బాహుబలి, బాహుబలి 2 వంటి సూపర్ డూపర్ బ్లాక్‌బస్టర్ సౌత్ ఇండియన్ సినిమాలు అలాగే ఆర్‌ఆర్‌ఆర్ (RRR)వంటి హిట్‌లను అందించిన సినీ నిర్మాత, దర్శకుడు ఎస్‌ఎస్ రాజమౌళి (SS rajamouli- కోడూరి శ్రీశైల శ్రీ రాజమౌళి) కొత్త కారును కొనుగోలు చేశారు. రాజమౌళి గ్యారేజ్ లో ఇప్పుడు వోల్వో ఎక్స్‌సి40 (volvo xc40) కాంపాక్ట్ లగ్జరీ ఎస్‌యూవీ వచ్చి చేరింది. వోల్వో కార్స్ ఇండియా అధికారిక సోషల్ మీడియా ఖాతా ద్వారా ఈ సమాచారాన్ని అందించింది అలాగే కారు డెలివరీ చేస్తున్న ఫోటో ని కూడా పోస్ట్ చేసింది.
వోల్వో ఎక్స్‌సి40 ఇంజన్ అండ్ పవర్
ఈ SUV ఇంజిన్ గురించి మాట్లాడితే 2.0-లీటర్ డీజిల్ ఇంజన్ వోల్వో XC40లో ఉంటుంది. ఈ ఇంజన్ 187 బిహెచ్‌పి పవర్, 300 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌ట్రానిక్స్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. అంతేకాకుండా ఎలక్ట్రిక్ వెర్షన్ అయిన XC40 కూడా కంపెనీ కొన్ని నెలల్లో ఇండియాలో పరిచయం చేయనుంది. ఈ కార్ పూర్తిగా బ్యాటరీతో నడిచే వాహనం.
undefined
లుక్ కలర్ కలర్ ఆప్షన్స్
వోల్వో XC40 లూక్స్ అండ్ డిజైన్ గురించి మాట్లాడితే కంపెనీ సిగ్నేచర్ T-ఆకారపు DRL, గ్లోస్ బ్లాక్‌లో సింగిల్-ఫ్రేమ్ ఫ్రంట్ గ్రిల్ ఇచ్చారు. ఇంకా 18-అంగుళాల అల్లాయ్ వీల్స్‌పై ఉన్న మందపాటి ప్లాస్టిక్ క్లాడింగ్ XC40కి కఠినమైన రూపాన్ని ఇస్తుంది. రాజమౌళి కారు ఫ్యూజన్ రెడ్ కలర్ విత్ బ్లాక్‌లో పెయింట్ చేయబడింది, ఇది మంచి కాంట్రాస్ట్‌ని తెస్తుంది. అంతే కాకుండా, ఈ కారు నాలుగు ఇతర కలర్స్ ఆప్షన్స్ లో కూడా లభిస్తుంది - ఒనిక్స్ బ్లాక్, డెనిమ్ బ్లూ, గ్లేసియర్ సిల్వర్ అండ్ క్రిస్టల్ వైట్.
కారు ఇంటీరియర్ అండ్ ఫీచర్ల గురించి మాట్లాడితే 12.3-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, హర్మాన్ కార్డాన్ 14-స్పీకర్ 600W సౌండ్ సిస్టమ్‌తో వస్తుంది. ఇతర ముఖ్య ఫీచర్లలో పనోరమిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఛార్జింగ్, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ ఇంకా మరెన్నో ఫీచర్స్ ఉన్నాయి. ఇవి కాకుండా 7-ఎయిర్‌బ్యాగ్‌లు, డిస్టెన్స్ అలర్ట్, పార్క్ అసిస్ట్, రాడార్ ఆధారిత సిటీ సేఫ్టీ అండ్ స్టీరింగ్ అసిస్ట్‌తో డ్రైవర్-అసిస్ట్ సిస్టమ్‌తో సహా ఆక్టివ్ అండ్ పాసివ్ సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి.
ధర అండ్ పోటీ
రాజమౌళి కొనుగోలు చేసిన వోల్వో XC40 వోల్వో ఎంట్రీ-లెవల్ SUV అలాగే భారతదేశంలో దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 44.50 లక్షలు. భారతీయ మార్కెట్లో, ఈ లగ్జరీ SUV బిఎండబల్యూ ఎక్స్1 (BMW X1), ఆడి క్యూ3 (Audi Q3) SUV వంటి కార్లతో పోటీపడుతుంది.