రాయల్ ఎన్‌ఫీల్డ్ భారతదేశం, విదేశీ మార్కెట్లలో కూడా మార్కెట్ వాటాను పెంచుకునే ప్రయత్నంలో ఉత్పత్తులను దూకుడుగా విడుదల చేస్తోంది. ఆ వ్యూహంలో సరికొత్త స్క్రామ్ 411 కీలక పాత్ర పోషిస్తుందని కంపెనీ భావిస్తోంది.
పెర్ఫామెన్స్ బైక్‌ల తయారీలో ప్రసిద్ధి చెందిన రాయల్ ఎన్‌ఫీల్డ్ తాజాగా విడుదల చేసిన అడ్వెంచర్ బైక్ స్క్రామ్ 411 ధరలను పెంచింది. అయితే కంపెనీ కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ స్క్రామ్ 411 బైక్‌ను మార్చి 2022లో విడుదల చేసింది. కొత్త స్క్రామ్ 411 హిమాలయన్ ఏడివి మరింత బడ్జెట్ వెర్షన్‌గా తీసుకొచ్చింది. భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన అడ్వెంచర్ బైక్‌లలో హిమాలయన్ ఒకటి. రాయల్ ఎన్‌ఫీల్డ్ భారతదేశం, విదేశీ మార్కెట్లలో కూడా మార్కెట్ వాటాను పెంచుకునే ప్రయత్నంలో ఉత్పత్తులను దూకుడుగా విడుదల చేస్తోంది. ఆ వ్యూహంలో సరికొత్త స్క్రామ్ 411 కీలక పాత్ర పోషిస్తుందని కంపెనీ భావిస్తోంది.
కొత్త ధర ఎంత
ఇప్పుడు ఈ బైక్ గ్రాఫైట్-రెడ్, ఎల్లో ఇంకా బ్లూ షేడ్ మోడల్ రూ. 2.05 లక్షలకు పెరిగింది అలాగే స్కైలైన్ బ్లూ, బ్లేజింగ్ బ్లాక్ వేరియంట్ ధర రూ. 2.07 లక్షలకు పెరిగింది. వైట్ ఫ్లేమ్, సిల్వర్ స్పిరిట్ పెయింట్ ఉన్న మోడల్ ధర రూ.2.11 లక్షలు. ఇంతకుముందు ఈ బైక్ ధర రూ. 2.03 లక్షల నుంచి రూ. 2.08 లక్షలకు లభించింది. ఈ ధరలన్నీ ఎక్స్-షోరూమ్ చెందినవి.
undefined
కలర్ ఆప్షన్స్
రాయల్ ఎన్‌ఫీల్డ్ స్క్రామ్ 411 బైక్ వైట్, సిల్వర్, బ్లాక్, బ్లూ, గ్రాఫైట్ రెడ్, ఎల్లో వంటి ఎన్నో కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంది.
లుక్ అండ్ డిజైన్
కొత్త స్టాండర్డ్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, చిన్న ఫ్రంట్ వీల్, బేసిక్ బాడీ ప్యానెల్‌లతో సహా బేసిక్ ఎక్విప్మెంట్ తో స్క్రమ్ 411 మరింత బడ్జెట్ గా చేయబడింది. దీనికి గుండ్రని పాత స్టైల్ హెడ్‌ల్యాంప్, ఫుల్ డిజిటల్ సర్క్యులర్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, సౌకర్యవంతమైన సీట్లతో కూడిన ఎర్గోనామిక్ డిజైన్, ఎల్‌ఈడి టైల్‌లైట్‌ని పొందుతుంది. మల్టీపర్పస్ బైక్ 19-అంగుళాల ఫ్రంట్ వీల్, 17-అంగుళాల బ్యాక్ వీల్ తో వస్తుంది, ఇది డ్యూయల్-పర్పస్ రబ్బర్ పొందుతుంది.
ఇంజిన్ అండ్ గేర్‌బాక్స్
దీనికి 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో హిమాలయన్ లాగానే పవర్‌ట్రెయిన్ ఉంది. ఈ ఇంజన్ 24.3 బిహెచ్‌పి పవర్, 32 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ స్క్రమ్ ప్రత్యేక పాత్రకు సరిపోయేలా ట్యూన్ చేయబడిందని కంపెనీ పేర్కొంది. అయితే ట్రాన్స్మిషన్ హిమాలయన్ లాగానే ఉంటుంది.
వీల్‌బేస్ అండ్ సస్పెన్షన్
సైజ్ పరంగా, స్క్రమ్ చిన్న ఫ్రంట్ వీల్ కారణంగా 1,455ఎంఎం కొంచెం తక్కువ వీల్‌బేస్‌ను పొందుతుంది. గ్రౌండ్ క్లియరెన్స్ స్వల్పంగా 200 ఎంఎంకి తగ్గించబడింది. చిన్న రైడర్‌లకు అనుగుణంగా సీటు ఎత్తు ఇప్పుడు 795ఎంఎంగా చేశారు. ఇంకా 190 ఎంఎం ఫ్రంట్ ట్రావెల్ అలాగే 180 ఎంఎం బ్యాక్ ట్రావెలింగ్ సస్పెన్షన్‌ను పొందుతుంది.
ట్రిప్పర్ నావిగేషన్ సిస్టమ్
బైక్‌కు ఆప్షనల్ ట్రిప్పర్ నావిగేషన్ సిస్టమ్ కూడా ఉంది, దీనిని మొదట మీటోర్ 350 లాంచ్‌తో పరిచయం చేసారు. తరువాత హిమాలయన్‌లో ఇచ్చారు. అలాగే, ఆప్షనల్ కిట్‌లో బైక్ సెంటర్ స్టాండ్ ఉంటుంది, అయితే స్టాండర్డ్ కిట్‌లో భాగం కాదు.
కాంపిటీషన్
కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ స్క్రామ్ 411 బైక్ ఇండియన్ మార్కెట్లో యెజ్డీ స్క్రాంబ్లర్, హోండా CB350RS వంటి బైక్‌లతో పోటీపడుతుంది. కంపెనీ హిమాలయన్ అడ్వెంచర్ బైక్ తో విజయాన్ని రుచి చూసింది. హిమాలయన్ విజయంతో రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇప్పుడు భారతదేశంలో మరింత అడ్వెంచర్ సెంట్రిక్ మోడల్‌ను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది. స్క్రామ్ 411 కూడా అదే వ్యూహాన్ని అనుసరిస్తుంది.
చెన్నైకి చెందిన బైక్ తయారీ సంస్థ మూడు కొత్త 650cc బైక్‌లు, RE హిమాలయన్ 450, కొత్త జనరేషన్ RE బుల్లెట్ 350లతో సహా కొత్త ఉత్పత్తులపై పని చేస్తోంది . రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ 450 విషయానికి వస్తే బైక్ కొత్త 450cc, సింగిల్-సిలిండర్, లిక్విడ్, -కూల్డ్ ఇంజన్‌తో 40bhp శక్తిని, 45Nm గరిష్ట టార్క్‌ను విడుదల చేస్తుంది. దీనికి 6-స్పీడ్ గేర్‌బాక్స్ ఇచ్చారు. ఈ బైక్ మూడు రైడింగ్ మోడ్‌లు ఇంకా రైడ్-బై-వైర్ సిస్టమ్‌తో రానుంది.