మెర్సిడెస్ బెంజ్ జిఎల్‌బి అనేది 7-సీటర్ ఎస్‌యూవి, అంటే మూడవ వరుసలో రెండు అదనపు సీట్లను అందిస్తుంది.ఈ కారు రెండు ఇంజన్ ఆప్షన్‌లతో మూడు వేరియంట్‌లలో లభిస్తుంది.
లగ్జరీ కార్ బ్రాండ్ మెర్సిడెస్ బెంజ్ జిఎల్‌బి అండ్ ఆల్-ఎలక్ట్రిక్ ఈక్యూబి అనే రెండు కొత్త మోడళ్లను లాంచ్ చేస్తూ భారతీయ మార్కెట్లో 7-సీటర్ ఎస్‌యూవి లైనప్‌ను విస్తరించింది. మెర్సిడెస్ జిఎల్‌బి ఎస్‌యూవి మూడు వేరియంట్లలో వస్తుంది, దీని ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధర రూ. 63.80 లక్షలు. అలాగే మెర్సిడెస్ ఎలక్ట్రిక్ కారు EQB 300 4మ్యాటిక్ ట్రిమ్‌లో మాత్రమే వస్తుంది, దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 74.50 లక్షలు.
మెర్సిడెస్ బెంజ్ జిఎల్‌బి
మెర్సిడెస్ బెంజ్ జిఎల్‌బి అనేది 7-సీటర్ ఎస్‌యూవి, అంటే మూడవ వరుసలో రెండు అదనపు సీట్లను అందిస్తుంది. దీనిని "మినీ GLS"గా సూచిస్తారు. ఈ కారు రెండు ఇంజన్ ఆప్షన్‌లతో మూడు వేరియంట్‌లలో లభిస్తుంది.
undefined
జిఎల్‌బి 220d వేరియంట్ 2.0-లీటర్, 4-సిలిండర్ డీజిల్ ఇంజన్‌తో 3,800 rpm వద్ద 188 bhp ఇంకా 1,600-2,600 rpm వద్ద 400 Nm శక్తిని ఉత్పత్తి చేస్తుంది. జిఎల్‌బి 200 1.3-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో 5,500 rpm వద్ద 161 bhp, 1,620-4,000 rpm వద్ద 250 Nm శక్తిని ఉత్పత్తి చేస్తుంది.
పెట్రోల్ ఇంజన్ 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ గేర్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది, అయితే డీజిల్ ఇంజన్ 8-స్పీడ్ డ్యూయల్-క్లచ్ యూనిట్, ఆప్షనల్ గా ఆల్-వీల్ డ్రైవ్‌ను పొందుతుంది.
ఈక్యూబి 300 4మాటిక్
ఈక్యూబి కారు జిఎల్‌బికి ఫుల్-ఎలక్ట్రిక్ వెర్షన్. దీనిలో కూడా ఒకే బాడీ షెల్ ఉపయోగించారు.
ఈక్యూబి 300 4మ్యాటిక్ 225 BHP, 390 Nm గరిష్ట అవుట్‌పుట్‌తో డ్యూయల్-మోటార్ సెటప్ లభిస్తుంది. ఈ ఎస్‌యూవి 8 సెకన్లలో 0 నుండి 100 kmph స్పీడ్ అందుకోగలదని ఇంకా దీని టాప్ స్పీడ్ గంటకు 160 km అని మెర్సిడెస్ పేర్కొంది.
ఈక్యూబి 66.5 kWh బ్యాటరీ ప్యాక్ పొందుతుంది, దీనిని ఒక్కసారి ఛార్జ్‌పై 388 నుండి 423km పరిధిని అందిస్తుంది. ఈ కారు 11 kW AC ఛార్జర్‌తో వస్తుంది. కానీ 100 kW DC ఫాస్ట్ ఛార్జర్‌ని ఉపయోగించి బ్యాటరీని 32 నిమిషాల్లో 10 నుండి 80 శాతం వరకు రీఛార్జ్ చేయవచ్చు.
మెర్సిడెస్ బెంజ్ జిఎల్‌బి అండ్ ఈక్యూబి ఎక్స్-షోరూమ్ ధరలు :
జిఎల్‌బి 200 – రూ 63.80 లక్షలు
జిఎల్‌బి 220d - రూ. 66.80 లక్షలు
జిఎల్‌బి 220d 4Matic - రూ. 69.80 లక్షలు
ఈక్యూబి 300 4మ్యాటిక్ - రూ. 74.50 లక్షలు
వారంటీ
ఈ రెండు SUVలు 7-సీటర్లు ఇంకా మూడవ వరుస, రెండవ వరుస ఫోల్డబుల్ సీట్లతో ఉంటాయి. మూడవ వరుస సీట్లు పిల్లలు ఇంకా పెంపుడు జంతువులకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. జిఎల్‌బి ఎస్‌యూవి 8 సంవత్సరాల వారంటీతో వస్తుంది. ఈక్యూబి ఎలక్ట్రిక్ SUV 8 సంవత్సరాల బ్యాటరీ వారంటీతో వస్తుంది.