6 కోట్ల లేటెస్ట్ కారు కొన్న స్టార్ హీరో.. కానీ రోడ్డు మధ్యలో ఎం జరిగిందంటే..?

Published : Apr 04, 2024, 11:56 PM ISTUpdated : Apr 04, 2024, 11:58 PM IST
6 కోట్ల లేటెస్ట్  కారు కొన్న స్టార్ హీరో..  కానీ రోడ్డు మధ్యలో ఎం జరిగిందంటే..?

సారాంశం

యానిమల్ సినిమా సక్సెస్ని ఎంజాయ్ చేస్తున్న రణబీర్ కపూర్ ఇప్పుడు ఖరీదైన బెంట్లీ కారును కొన్నారు. ఈ లేటెస్ట్ కారు ధర దాదాపు రూ.6 కోట్లు. ఆంతేకాదు స్వయంగా కార్ డ్రైవ్ చేసిన రణబీర్ కపూర్.. యాచకుడు దగ్గర కారు ఆపి డబ్బులు ఇచ్చారు.  

ముంబయి: బాలీవుడ్ హీరో  రణబీర్ కపూర్ నటించిన ఆనిమల్ సినిమా ఘనవిజయం సాధించింది. ఈ విజయాల ఊబిలో దూసుకుపోతున్న రణబీర్ కపూర్ ఇప్పుడు విలాసవంతమైన అండ్   ఖరీదైన బెంట్లీ కారును సొంతం చేసుకున్నారు. ఈ బెంట్లీ కాంటినెంటల్ జీటీ వీ8 కారును రూ.6 కోట్లతో కొనుగోలు చేశాడు. అయితే ఈ ధర ఎక్స్-షోరూమ్ ధర. దీని ఆన్-రోడ్ ధరతో మరో కోటి పెరగనుంది.ఈ బ్లూ కలర్ కారు చాలా ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా సౌకర్యవంతమైన ప్రయాణాన్ని కూడా అందిస్తుంది.

కారు కొన్న రణ్‌బీర్‌ కపూర్‌ తానే స్వయంగా డ్రైవ్ చేస్తూ ఇంటికి వెళ్లాడు. బెంట్లీ కాంటినెంటల్ జీటీ వీ8 కారులో ప్రయాణిస్తున్న రణబీర్ కపూర్‌కి ఓ యాచకుడు  ఎదురయ్యాడు. ఇంతలో కారు ఆపిన రణబీర్ కపూర్ డబ్బులు ఇచ్చి వెళ్లిపోయాడు. అయితే ఈ వీడియో వైరల్‌గా మారింది.

 

బెంట్లీ ఒక బ్రిటిష్ లగ్జరీ కార్ బ్రాండ్. ఈ స్పోర్ట్స్ కారులో 3996 సీసీ ఇంజన్ ఉంది. ఈ కారు 542bhp పవర్, 770Nm టార్క్ అందిస్తుంది. ఈ కారు లేటెస్ట్ టెక్నాలజీ, హై  సెక్యూరిటీతో  ఎనో ఫీచర్స్ ఉన్నాయి. బాలీవుడ్ సూపర్ స్టార్లు, వ్యాపారవేత్తలు, ధనవంతులు బెంట్లీ కారును ఎక్కువగా ఇష్టపడతారు. ముఖేష్ అంబానీకి కూడా బెంట్లీ కాంటినెంటల్ జిటి కారు  ఉంది. 

ఈ లగ్జరీ కారు కొనుగోలు చేసి వార్తల్లో నిలిచిన రణబీర్ ఇటీవల తన కూతురు రాహా కపూర్‌కు రూ.250 కోట్ల విలువైన బంగ్లాను బహుమతిగా ఇచ్చాడు. ముంబైలోని బాంద్రాలో రణబీర్ అండ్  అలియా భట్ ఈ ఇంటిని కొనుగోలు చేసి తమ కుమార్తెకు బహుమతిగా ఇచ్చారు. కుమార్తెకు ఏడాది నిండిన నేపథ్యంలో ఈ ఖరీదైన బహుమతిని అందించారు. దీని తరువాత, అతను ఇప్పుడు ఖరీదైన కారును కొన్నారు.

2024 ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్‌లో యానిమల్‌ సినిమాలో తన నటనకు రణబీర్ కపూర్ ఉత్తమ నటుడు అవార్డును గెలుచుకున్నారు.

 

PREV
click me!

Recommended Stories

Maruti Grand Vitara : ఈ స్టైలిష్ కారును ఇప్పుడే కొంటే.. ఏకంగా రూ.2.19 లక్షల డిస్కౌంట్
MG hector facelift: మ‌ధ్య‌త‌ర‌గ‌తి వారికి ల‌గ్జ‌రీ కారు.. అందుబాటు ధ‌ర‌లో MG హెక్ట‌ర్ కొత్త కారు