కంపెనీ సిగ్నేచర్ స్టైల్ స్టేట్‌మెంట్‌తో ఈ బైక్ దేశంలోకి రానుంది. దీనికి ఎడ్జీ ఫాసియా అండ్ స్లిప్డ్ సీటింగ్ ఉంటుంది. ఇంకా కొత్త బ్లూటూత్-ఎనేబుల్డ్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్‌ను కూడా పొందవచ్చని భావిస్తున్నారు.
ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ బజాజ్ ఆటో భారతదేశంలో సరికొత్త 2024 పల్సర్ N250ని విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. అయితే ఏప్రిల్ 10ని లాంచ్ తేదీగా నిర్ణయించారు. ఈ బైక్ గొప్ప అప్‌గ్రేడ్‌లతో మార్కెట్లోకి రానుందని ఇంకా గతంలో కంటే ఎక్కువ ప్రీమియంను కమాండ్ చేస్తుందని నివేదించబడింది.
కంపెనీ సిగ్నేచర్ స్టైల్ స్టేట్‌మెంట్‌తో ఈ బైక్ దేశంలోకి రానుంది. దీనికి ఎడ్జీ ఫాసియా అండ్ స్లిప్డ్ సీటింగ్ ఉంటుంది. ఇంకా కొత్త బ్లూటూత్-ఎనేబుల్డ్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్‌ను కూడా పొందవచ్చని భావిస్తున్నారు.
undefined
డిస్క్ మ్యాగజైన్ టైప్ డిస్క్ బ్రేక్‌లతో ముందు భాగంలో ప్రీమియం ఇన్‌వర్టెడ్ ఫోర్క్స్ ఉంటుంది. ఈ అప్ డేటెడ్ మోడల్ 249 cc సింగిల్ సిలిండర్, ఎయిర్ అండ్ ఆయిల్-కూల్డ్ ఇంజన్‌తో అందించబడుతుంది.
ఈ బైక్ 8,750 rpm వద్ద గరిష్టంగా 24.1 bhp పవర్, 6,500 rpm వద్ద 21.5 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. పవర్ సోర్స్ 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో స్లిప్ అండ్ అసిస్ట్ క్లచ్‌ని అందిస్తోంది.
ఇక ధర విషయానికొస్తే, ప్రస్తుత మోడల్ ధర రూ. 1.50 లక్షలు (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) ప్రారంభ ధర అలాగే 2024 మోడల్ ధర రూ.10,000 నుంచి రూ.20,000 వరకు పెరుగుతుందని చెబుతున్నారు.