ప్రణయ్ పటోల్ కూడా ఎలోన్ మస్క్‌తో దిగిన ఫోటోలను ట్విట్టర్‌లో షేర్ చేశారు. అంతకుముందు ప్రణయ్ పటోల్, ఎలాన్ మస్క్ ఈ ఏడాది మే నెలలో పూణెలో కలుసుకున్నారు. ప్రణయ్ పటోల్ అండ్ ఎలోన్ మస్క్ 2018 నుండి సోషల్ మీడియా స్నేహితులు.
బిలియనీర్ అండ్ టెస్లా సిఈఓ ఎలోన్ మస్క్ తాజాగా అతని ప్లాంట్‌లో 23 ఏళ్ల భారతీయ స్నేహితుడు ప్రణయ్ పటోల్‌ను కలిశారు. టెస్లాకు చెందిన టెక్సాస్ ప్లాంట్‌లో ప్రణయ్ పటోల్ ఎలోన్ మస్క్ ని కలుసుకున్నట్లు ప్రణయ్ పటోల్ కూడా ట్వీట్ చేశారు.
ప్రణయ్ పటోల్ కూడా ఎలోన్ మస్క్‌తో దిగిన ఫోటోలను ట్విట్టర్‌లో షేర్ చేశారు. అంతకుముందు ప్రణయ్ పటోల్, ఎలాన్ మస్క్ ఈ ఏడాది మే నెలలో పూణెలో కలుసుకున్నారు. ప్రణయ్ పటోల్ అండ్ ఎలోన్ మస్క్ 2018 నుండి సోషల్ మీడియా స్నేహితులు.
undefined
ప్రణయ్ పటోల్ ఒక ట్వీట్‌లో 'టెక్సాస్‌లోని గిగాఫ్యాక్టరీలో ఎలోన్ మస్క్‌ని కలవడం చాలా గొప్ప విషయం. ఇంత నిరాడంబరమైన, సాదాసీదా వ్యక్తిని ఎప్పుడూ చూడలేదు. మీరు లక్షలాది మందికి స్ఫూర్తి. అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కి 1,675 పైగా రీట్వీట్ లు, 48వేలకు పైగా లైక్‌లు వచ్చాయి.
టెస్లా కారు ఆటోమేటిక్ విండ్‌స్క్రీన్ వైపర్‌పై ప్రణయ్ చేసిన ట్వీట్‌తో ఎలాన్ మస్క్ అండ్ ప్రణయ్ స్నేహం మొదలైంది. ఎలోన్ మస్క్ ప్రణయ్ ఆలోచనను అద్భుతంగా పేర్కొన్నాడు. అప్పటి నుండి ఎలోన్ మస్క్ ఇంకా ప్రణయ్ ఇద్దరూ ట్విట్టర్‌లో నిరంతరం సంభాషణలో ఉంటున్నారు.
ప్రణయ్ పటోల్ 2018లో పూణేలో ఇంజినీరింగ్ చేసి ప్రస్తుతం TCSలో సాఫ్ట్‌వేర్ డెవలపర్‌గా పనిచేస్తున్నారు. ట్విట్టర్‌లో ప్రణయ్ అక్కౌంట్ వేరిఫైడ్ కాకపోయిన ఫాలోవర్లు మాత్రం 1 లక్షా 80 వేలకు పైగా ఉన్నారు.