బ్రిటీష్ బ్రాండ్ ఆస్టన్ మార్టిన్ కొత్త లగ్జరీ కార్.. కేవలం 3 సెకండ్లలో దీని స్పీడ్ ఎంతో తెలుసా..?

By asianet news telugu  |  First Published Aug 22, 2022, 10:57 AM IST

ఆస్టన్ మార్టిన్ వాన్టేజ్ V12 ఇంజన్ 5.2 లీటర్ల సామర్థ్యం ఉంది ఇంకా ట్విన్-టర్బోచార్జ్ చేయబడింది. ఈ ఇంజన్ 6,500 rpm వద్ద 700 PS గరిష్ట శక్తిని, 5,500 rpm వద్ద 753 Nm గరిష్ట టార్క్ అవుట్‌పుట్‌ను ఉత్పత్తి చేస్తుంది. ZF నుండి తీసుకున్న 8-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్  గేర్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది. 
 


లగ్జరీ బ్రిటిష్ బ్రాండ్ ఆస్టన్ మార్టిన్ (Aston Martin) కొత్త V12 వాంటేజ్ రోడ్‌స్టర్ (V12 Vantage Roadster)ను పరిచయం చేసింది. ఈ కారు బేసిక్ గా వాంటేజ్ రోడ్‌స్టర్, కానీ ఈసారి కంపెనీ దీనిని V12 పవర్‌ట్రెయిన్‌తో అందిస్తున్నారు. రోడ్‌స్టర్ బాడీ స్టయిల్ అంటే రూఫ్‌లెస్ డిజైన్ కారణంగా రైడర్‌లు V12 ఇంజిన్ సౌండ్‌ని మరింత ఎక్కువగా వినగలుగుతారు. V12 Vantage Roadsterని మొత్తం 249 యూనిట్లను మాత్రమే ఉత్పత్తి చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. V12 వాంటేజ్ రోడ్‌స్టర్  ఉత్పత్తి 2022 మూడవ త్రైమాసికంలో ప్రారంభం కానుంది, మొదటి డెలివరీలు Q4 2022లో ప్రారంభం కానున్నాయి. 

ఆస్టన్ మార్టిన్ వాన్టేజ్ V12 ఇంజన్ 5.2 లీటర్ల సామర్థ్యం ఉంది ఇంకా ట్విన్-టర్బోచార్జ్ చేయబడింది. ఈ ఇంజన్ 6,500 rpm వద్ద 700 PS గరిష్ట శక్తిని, 5,500 rpm వద్ద 753 Nm గరిష్ట టార్క్ అవుట్‌పుట్‌ను ఉత్పత్తి చేస్తుంది. ZF నుండి తీసుకున్న 8-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్  గేర్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది. 

Latest Videos

ఇంజన్ ఫ్రంట్-మిడ్ మౌంట్ చేయబడింది అలాగే పవర్ వెనుక చక్రాలకు ట్రాన్సఫర్ చేయబడుతుంది. ఈ కారుకి సాధారణ వాంటేజ్ లో ఉపయోగించే అదే సస్పెన్షన్ హార్డ్‌వేర్‌ను పొందుతుంది, కానీ కంపెనీ రి-ట్యూన్ చేసింది. V12 Vantage  అల్లాయ్ వీల్స్ 21-అంగుళాలు, ఇంకా పైలట్ 4S హై-పర్ఫర్మెంస్ గల టైర్లను స్టాండర్డ్ గా పొందుతాయి. వీటి సైజ్ ముందు  టైర్ 275/35 R21 అండ్ వెనుక టైర్  315/30 R21. 

బ్రేకింగ్ కోసం ముందు భాగంలో 6 పిస్టన్ కాలిపర్స్, వెనుక భాగంలో 4 పిస్టన్ కాలిపర్స్ ఉపయోగించారు. ఆస్టన్ మార్టిన్ బ్రేక్ ఫేడ్‌ను తగ్గించడానికి కార్బన్ సిరామిక్ బ్రేక్‌లను ఉపయోగించారు. స్టీల్ డిస్క్‌లతో పోలిస్తే 23 కిలోల వరకు బరువు తగ్గించడానికి ఇవి సహాయపడతాయి. 

బరువును తగ్గించడానికి V12 Vantage Roadster ఫ్రంట్ బంపర్, క్లామ్‌షెల్ బానెట్, ఫ్రంట్ ఫెండర్లు, సైడ్ సిల్స్ కార్బన్ ఫైబర్‌తో తయారు చేయబడ్డాయి ఇంకా వెనుక బంపర్ అలాగే డెక్ మూత బరువు తగ్గించే మిశ్రమ పదార్థాలతో తయారు చేయబడ్డాయి. ఆస్టన్ మార్టిన్ లో లైట్ బ్యాటరీ, కొత్త సెంటర్-మౌంటెడ్ ట్విన్-ఎగ్జాస్ట్ సిస్టమ్‌ను ఉపయోగించారు. కొత్త ఎగ్జాస్ట్ సిస్టమ్ కారు బరువును 7.2 కిలోల వరకు తగ్గించడంలో సహాయపడుతుంది. ఇంకా 7.3 కిలోల బరువును తగ్గించడంలో సహాయపడే కొత్త సీట్లను కూడా పొందుతుంది.

click me!