కారులో లాంగ్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా.. ప్రమాదాలను నివారించడానికి ఈ విషయాలను గుర్తుంచుకోండి..

By asianet news telugu  |  First Published Dec 21, 2022, 12:51 PM IST

కారులో లాంగ్ జర్నీకి వెళ్లే ముందు, కారు కండిషన్ సరిగ్గా ఉండటం అవసరం.  లేదంటే జర్నీ మధ్యలో కారు చెడిపోవడం మీకు  పెద్ద సమస్యగా  ఉంటుంది, ప్రమాదాలు జరుగే అవకాశం కూడా పెరుగుతుంది.


డిసెంబర్ నెల అంటే ఎక్కువగా చలి ఉంటుంది. ఈ నెలలోనే క్రిస్మస్, కొత్త సంవత్సరం కారణంగా ప్రజలు ఎక్కడికైనా టూర్ వెళ్లడానికి మంచి అవకాశం పొందుతారు. కొంతమంది ఫ్లయిట్‌లు, రైళ్లలో వెళతారు మరికొందరు సొంత కారులో వెళ్లడానికి ఇష్టపడతారు. అయితే కారులో విహారయాత్రకు వెళ్లే ముందు కొన్ని విషయాల గురించి సమాచారం మీకోసం. వీటిని జాగ్రత్తగా చూసుకుంటే జర్నీలో ప్రమాదాలను నివారించవచ్చు.

కారు కండిషన్ 
కారులో లాంగ్ జర్నీకి వెళ్లే ముందు, కారు కండిషన్ సరిగ్గా ఉండటం అవసరం.  లేదంటే జర్నీ మధ్యలో కారు చెడిపోవడం మీకు  పెద్ద సమస్యగా  ఉంటుంది, ప్రమాదాలు జరుగే అవకాశం కూడా పెరుగుతుంది.

Latest Videos

ఆయిల్ చెకింగ్ 
కారులో ఇంజన్ ఆయిల్ మాత్రమే కాదు ఇతర రకాల అయిల్స్ కూడా కారులో ఉపయోగిస్తారు. వీటిలో గేర్ ఆయిల్, బ్రేక్ ఆయిల్ ఇంకా కూలెంట్ కూడా ఉంటాయి. దూర ప్రయాణాలకి ముందు కారు ఇంజిన్ ఆయిల్, బ్రేక్ ఆయిల్, గేర్ ఆయిల్, కూలెంట్ చెక్ చేయడం చాలా అవసరం.

లైట్లను చెక్ చేయండి 
సిటీ ట్రాఫిక్‌లో నిర్లక్ష్యం కారణంగా చాలాసార్లు కారు లైట్లు విరిగిపోతాయి లేదా పాడైపోతాయి. కానీ మనం అలాగే వాటిని నడుపుతాం, కానీ దూర ప్రయాణలు చేయడానికి ముందు, కారు లైట్లు సరిగ్గా పనిచేస్తున్నాయో లేదో చెక్ చేయడం  అవసరం. ఎందుకంటే సిటీ ట్రాఫిక్‌లో డ్రైవింగ్‌తో పోలిస్తే హైవేపై కారు హై స్పీడ్ లో నడుపుతుంటాం. ఇలాంటి పరిస్థితుల్లో లైట్లు సరిగా వెలగకపోతే ఇతర వాహనాలకు మన ఉనికి గురించి సమాచారం అందక ప్రమాదం జరిగే అవకాశం పెరుగుతుంది.

ఫాగ్ లైట్లను కూడా అమర్చండి
చలికాలంలో పొగమంచు ఎక్కువగా ఉంటుంది. ఈ సందర్భంలో కారు సాధారణ లైట్లు పనిచేయవు. అందువల్ల, మీరు విపరీతమైన పొగమంచులో  ఎదురుగా వాహనాలు కూడా కనిపించని ప్రదేశానికి వెళుతున్నట్లయితే, కారులో ఫాగ్ లైట్లను అమర్చడం మంచిది. దీంతో రోడ్డుపై వాహనాలు నడపడం సులభం ఇంకా  ప్రమాదాలు జరిగే అవకాశాలు కూడా తగ్గుముఖం పడతాయి.

బ్రేక్‌లను జాగ్రత్తగా చూసుకోండి
హైవేపై హై స్పీడ్ తో వాహనాలు నడుపుతుంటారు. కొన్ని కారణాల వల్ల అకస్మాత్తుగా బ్రేకులు వేయాల్సి వచ్చినా బ్రేకులు సరిగా పనిచేయక పోయినా ప్రమాదం తప్పదు. అందుకే మీరు కారులో ట్రిప్ ప్లాన్ చేసినప్పుడల్లా కారు బ్రేక్‌లను చెక్ చేసుకోండి. బ్రేక్ ప్యాడ్‌లు చెడిపోతున్నట్లయితే, వాటిని వెంటనే మార్చండి.

టైర్లు కూడా ముఖ్యమైనవి
రోడ్డుపై కారు నడుపుతున్నప్పుడు ఎక్కువ ప్రభావం కారు టైర్లపై ఉంటుంది. కారు టైర్లు చాలా పాతవి కావడం వల్ల కట్ లేదా డ్రై ఉంటే, అలాంటి టైర్లను మార్చడం మంచిది. ఇలాంటి టైర్లతో దూర ప్రయాణాలకు వెళ్లడం ప్రమాదాన్ని ఆహ్వానించినట్లే. హై స్పీడ్ తో నడుస్తున్నప్పుడు పాత లేదా చెడిపోయిన టైర్లు పగిలిపోతాయి, ఈ కారణంగా ప్రమాదం జరిగే ఛాన్స్ ఉంది.

ఫస్ట్ అయిడ్ బాక్స్ 
కారులో లాంగ్ ప్రయాణాలకి ముందు కొన్ని మందులు తీసుకెల్లడం మంచిది. ప్రయాణంలో ఎవరైనా వాంతులు చేసుకుంటే లేదా ఇతర ప్రయాణికులు ఏదైనా కారణం వల్ల గాయపడినట్లయితే, వెంటనే ఫస్ట్ అయిడ్ బాక్స్ తో చికిత్స చేయవచ్చు.

click me!