హీరో మోటోకార్ప్ కొత్త వేరియంట్ బైక్.. ఎక్కువ దూరం ప్రయాణించినా ఆలసిపోని విధంగా డిజైన్..

By asianet news telugu  |  First Published Dec 20, 2022, 8:30 PM IST

ఈ బైక్ డిజైన్ కూడా అప్‌డేట్ చేసారు. క్రోమ్ ఉపయోగించిన బైక్‌లో ఫుల్ ఎల్‌ఈ‌డి హెడ్‌ల్యాంప్‌లు ఇచ్చారు. దీనితో పాటు బైక్‌లో కలర్ వైజర్, ఫ్రంట్ ఫోర్క్ స్లీవ్‌లు, కలర్ సిలిండర్ హెడ్ కూడా ఇచ్చారు.


 భారతదేశపు ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ 200సి‌సి సెగ్మెంట్ టూర్ బైక్‌ను లాంచ్ చేసింది.

ఇంజిన్ 
కొత్త హీరో ఎక్స్ పల్స్ 200టి 4విలో కంపెనీ 200cc ఫోర్ వాల్వ్ ఆయిల్ కూల్డ్ ఇంజన్‌ను అందించింది. దీంతో ఈ బైక్ 19.1 PS అండ్ 17.3 న్యూటన్ మీటర్ల శక్తిని అందిస్తుంది. బైక్‌కు ఎక్కువ టార్క్ ఇవ్వడంలో ఉద్దేశ్యం ఏంటంటే  సౌకర్యవంతమైన టూర్ బైక్ అనుభూతిని ఇవ్వడం కోసం. ఇంజిన్ కి 5 -స్పీడ్ గేర్‌బాక్స్ ఇచ్చారు. హై స్పీడ్ తో సాఫీగా నడపగలిగే విధంగా బైక్‌ను రూపొందించారు.  

Latest Videos

undefined

డిజైన్ ఎలా ఉంటుందంటే 
ఈ బైక్ డిజైన్ కూడా అప్‌డేట్ చేసారు. క్రోమ్ ఉపయోగించిన బైక్‌లో ఫుల్ ఎల్‌ఈ‌డి హెడ్‌ల్యాంప్‌లు ఇచ్చారు. దీనితో పాటు బైక్‌లో కలర్ వైజర్, ఫ్రంట్ ఫోర్క్ స్లీవ్‌లు, కలర్ సిలిండర్ హెడ్ కూడా ఇచ్చారు. డ్రైవరు, ప్యాసెంజర్ ఎక్కువ దూరం ప్రయాణించినా పెద్దగా అలసిపోని విధంగా బైక్ సీటు డిజైన్ చేయబడింది.

కొత్త కలర్స్ 
ఈ బైక్‌ కోసం కొత్త కలర్స్ కూడా జోడించారు. దీని కారణంగా డిజైన్ మరింత విలాసవంతంగా కనిపిస్తుంది. Hero X పల్స్ 200T స్పోర్ట్స్ రెడ్, మ్యాట్ ఫంక్ లైమ్ ఎల్లో, మ్యాట్ షీట్ గోల్డ్ కలర్స్ కూడా లభిస్తుంది.

టెక్నాలజి 
టూరింగ్ బైక్ కావడంతో టెక్నాలజీ పై కూడా కంపెనీ శ్రద్ద వహించింది. కంపెనీ ఈ బైక్‌లో ఫుల్ డిజిటల్ ఎల్‌సిడి క్లస్టర్‌ అందించింది, ఇంకా స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ కూడా అందించింది, తద్వారా ఎక్కువ దూరం ప్రయాణించేటప్పుడు రైడర్‌కు మొబైల్ చార్జింగ్ తో ఎటువంటి సమస్య ఎదురుకాదు. ఈ ఫీచర్ కారణంగా స్మార్ట్‌ఫోన్‌కు కనెక్ట్ అయినప్పుడు కాల్ అలర్ట్, నావిగేషన్ సౌకర్యం ఉంటుంది. అండర్ సీట్ ఛార్జర్ ద్వారా ఫోన్‌ను ఛార్జ్ చేయవచ్చు. బైక్‌కి గేర్ ఇండికేటర్ అండ్ సైడ్ స్టాండ్ ఇంజన్ కట్-ఆఫ్ కూడా ఇచ్చారు.

ధర ఎంతంటే 
బైక్ ధర గురించి మాట్లాడితే ముంబైలో ఈ బైక్ ఎక్స్-షోరూమ్ ధర రూ.1,25,726గా ఉంది. అయితే ఇంతకు ముందున్న X పల్స్ 200T ఎక్స్-షోరూమ్ ధర రూ. 1.24 లక్షలు.
 

click me!