బైక్ పై వాటికీ చెక్: ఇప్పుడు పాటలు, మాటలు అన్ని ఈ స్మార్ట్ హెల్మెట్తో..

By Ashok kumar Sandra  |  First Published Apr 9, 2024, 5:53 PM IST

హై-క్వాలిటీ ఆడియోతో రైడ్ అనుభవాన్ని మెరుగుపరచడానికి హర్మాన్ కార్డాన్‌తో ఈథర్ పార్ట్నర్ షిప్ కుదుర్చుకుంది. మ్యూజిక్  కాకూండా  రైడర్ ముఖ్యమైన సౌండ్స్  వినగలిగేలా  హెల్మెట్ ని ఈథర్ రూపొందించింది. 
 


బెంగళూరు: ఏథర్ ఎనర్జీ రిజ్టా(Rizta) ఎలక్ట్రిక్ స్కూటర్‌ను లాంచ్  చేసింది. దీనితో పాటు హాలో స్మార్ట్ అనే హెల్మెట్ కూడా ప్రవేశపెట్టింది. దింతో భారతదేశపు మొట్టమొదటి లేటెస్ట్  టెక్నాలజీ, హై సెక్యూరిటీ స్మార్ట్ హెల్మెట్‌ను తీసుకొచ్చిన  ఘనత ఏథర్‌కు దక్కింది. ఏథర్ హాలో స్మార్ట్ హెల్మెట్ ప్రస్తుతం సెన్సేషన్ గా మారింది. 

ఏథర్ కంపెనీ  ఏథర్ హాలో ప్రొడక్ట్ సిరీస్‌తో స్మార్ట్ హెల్మెట్ విభాగంలోకి ప్రవేశిస్తున్నట్లు ప్రకటించింది. ఏథర్ హాలో అనేది ఫుల్ ఫెస్, టాప్-ఆఫ్-ది-లైన్ ఇంటిగ్రేటెడ్ స్మార్ట్ హెల్మెట్. దీనిలో హర్మాన్ కార్డాన్  హై  క్వాలిటీ  ఆడియో అందించారు. ఈ హెల్మెట్ రైడర్‌కు ఆటో వేర్ డిటెక్ట్ టెక్నాలజీ, వైర్‌లెస్ ఛార్జింగ్‌తో ఇంకా అతుకులు లేని ఎక్స్పీరియన్స్  అందిస్తుంది. బైక్ హ్యాండిల్‌బార్ ద్వారా మ్యూజిక్  ఇంకా కాల్స్  కంట్రోల్  చేయవచ్చు. హాలో ఈథర్ ఇంకా చిట్ చాట్‌తో వస్తుంది, అంటే రైడర్ అలాగే  పిలియన్ మధ్య హెల్మెట్-టు-హెల్మెట్ కమ్యూనికేషన్‌ కల్పిస్తుంది. దీనికి  క్లీన్ అలాగే ఫ్యూచరిస్టిక్ డిజైన్‌  ఉంది ఇంకా  రెండు కలర్  అప్షన్స్ లో లభిస్తుంది.

Latest Videos

undefined

హై-క్వాలిటీ ఆడియోతో రైడ్ అనుభవాన్ని మెరుగుపరచడానికి హర్మాన్ కార్డాన్‌తో ఈథర్ పార్ట్నర్ షిప్ కుదుర్చుకుంది. మ్యూజిక్  కాకూండా  రైడర్ ముఖ్యమైన సౌండ్స్  వినగలిగేలా  హెల్మెట్ ని ఈథర్ రూపొందించింది. 

 హాలో వేర్ డిటెక్ట్ టెక్నాలజీ హెల్మెట్ ధరించినప్పుడు హెల్మెట్, ఫోన్ ఇంకా బైక్  3-వే పేరింగ్  ఉంటుంది. ఇవన్నీ హాలోతో ఆకర్షణీయమైన, ఆనందించే ఇంకా  సురక్షితమైన ప్రయాణాన్ని అందిస్తుందని  ఏథర్ నమ్మకంగా ఉంది. 

 ఏథర్ హాలో బిట్ అనే మోడల్‌ను ఈథర్ హాఫ్ ఫేస్ హెల్మెట్‌తో తీసుకొచ్చింది. ఏథర్ ISI ఇంకా DOT సర్టిఫైడ్ హాఫ్-ఫేస్ హెల్మెట్‌ను అభివృద్ధి చేసింది, ఈ హెల్మెట్   త్వరలో ప్రజలకి  అందుబాటులోకి వస్తుంది ఇంకా Halobitకి అనుకూలంగా ఉంటుంది. హాలో హెల్మెట్ ప్రారంభ ధర రూ.12,999, హలోబిట్ ధర రూ. 4,999 ఉంది.

"మేము హెల్మెట్‌లను తప్పనిసరి కంటే ముఖ్యమైన, ఆహ్లాదకరమైన, ఆకర్షణీయమైన రైడ్‌గా మార్చాలనుకుంటున్నాము" అని ఏథర్ ఎనర్జీ సహ వ్యవస్థాపకుడు స్వప్నిల్ జైన్ అన్నారు. 

click me!