బ్రేకింగ్ సిస్టంలో లోపం : 4 లక్షల వాహనాల రికాల్

By Sandra Ashok KumarFirst Published Nov 18, 2019, 12:36 PM IST
Highlights

ఇంటర్నల్ సర్క్యూట్ బోర్డులలో బ్రేక్ ఫ్లూయిడ్  లీక్ కారణంగ నిసాన్ కార్ డ్రైవర్లకు హెచ్చరిక చేస్తుంది, ఈ సమస్యని నిర్లక్ష్యం చేస్తే  అరుదైన సందర్భాలలో అగ్ని ప్రమాదం సంభవించవచ్చు అని నిస్సాన్ కంపెనీ తెలిపింది.

జపాన్‌కు చెందిన నిస్సాన్ మోటార్ కో లిమిటెడ్ బ్రేకింగ్ సిస్టమ్ లోపంపై అమెరికాలో 394,025 కార్లను రీకాల్ చేస్తుంది. బ్రేక్ ఫ్లూయిడ్ లీక్ వల్ల అగ్ని ప్రమాదం సంభవిస్తుందని హెచ్చరిక చేశారు. ఇంటర్నల్ సర్క్యూట్ బోర్డులలో బ్రేక్ ఫ్లూయిడ్ లీక్ వల్ల డ్రైవర్లకు హెచ్చరిక వస్తుంది.

ఈ హెచ్చరిక నిర్లక్ష్యం చేస్తే అరుదైన సందర్భాల్లో అగ్ని ప్రమాదం సంభవించవచ్చు అని నిస్సాన్ తెలిపింది. నవంబర్ 8 నాటి ఫైలింగ్‌లో నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ (ఎన్‌హెచ్‌టిఎస్‌ఎ) తో రీకాల్ నంబర్ 18 వి-601 కింద ఈ విష్యాన్ని పేర్కొంది.

also read  వైండ్ షీల్డ్, రూఫ్, విండోస్ లేని మైక్ లారెన్స్ సూపర్ కారు

"హెచ్చరికను నిర్లక్ష్యం చేసి వాహనాన్ని అదే స్థితిలో  నడపడం కొనసాగిస్తే, బ్రేక్ ఫ్లూయిడ్ లీక్ అయి యాక్యుయేటర్ సర్క్యూట్లో ఎలక్ట్రికల్ షార్ట్‌ను సృష్టించగలదు. ఇది చాలా  అరుదైన సందర్భాల్లో అగ్నిప్రమాదానికి దారితీయవచ్చు" అని జపనీస్ వాహన తయారీ సంస్థ అన్నారు.

యుఎస్ మీడియా శుక్రవారం నివేదించిన రీకాల్‌లో 2016 నుండి 2018 వరకు మాగ్జిమా సెడాన్లు, 2017 నుండి 2019 వరకు ఇన్ఫినిటీ క్యూఎక్స్ 60 లగ్జరీ క్రాస్‌ఓవర్లు, 2015 నుండి 2018 వరకు మురానో ఎస్‌యూవీలు ఇంకా 2017 నుండి 2019 వరకు పాత్‌ఫైండర్ ఎస్‌యూవీలు ఉన్నాయి.

బ్రేక్ సిస్టమ్ లోపం వల్ల  మంటలు లేదా అగ్ని ప్రమాదానికి కారణం అవుతుందా లేదా అనేది పత్రంలో పేర్కొనబడలేదు.ఈ సమస్యను పరిష్కరించడానికి తాము కృషి చేస్తున్నామని, వచ్చే నెల మొదట్లో బాధిత కార్ల యజమానులకు తెలియజేస్తామని కంపెనీ తెలిపింది.

also read వడివడిగా విస్తరణ : 300 పాయింట్లకు పైగా నెట్‌వర్క్ ఏర్పాటుకు కియా రెడీ

సమస్యకి పరిష్కారం కోసం యజమానులు తమ వాహనాన్ని  నిస్సాన్ డీలర్ లేదా ఇన్ఫినిటీ రటైలర్ వద్దకు తీసుకురావాలని కోరుతూ ఫైనల్ నోటిఫికేషన్ లేఖను అందుకుంటారు. .బ్రేక్‌లు, స్టీరింగ్ వీల్స్, స్పీడ్  మరియు వాహన స్తబిలిటీ యొక్క తనిఖీలు కూడా గత ఏడాది చివర్లో జపాన్‌లో అనేక వేల వాహనాలను రీకాల్ జారీ చేయడానికి కారణమయ్యాయి. ప్టెంబరులో సంస్థ తన బ్యాకప్ కెమెరా డిస్ ప్లేలతో ఒక సమస్య  పరిష్కరించడానికి 1.3 మిలియన్ వాహనాలను రీకాల్ చేసింది.

click me!