ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ మైక్ లారెన్స్ విపణిలోకి అత్యాధునిక నూతన మోడల్ కారును ఆవిష్కరించింది. కేవలం 399 యూనిట్లు మాత్రమే తయారైన మైక్ లారెన్స్ ఎల్వా కారు ధర 1.5 మిలియన్ల యూరోలు.
ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ మైక్ లారెన్స్ అత్యాధునిక స్పోర్ట్స్ కారు ‘ఎల్వా’ విపణిలోకి విండోస్, రూఫ్, వైండ్ స్క్రీన్ లేని నూతన మోడల్ కారును ఆవిష్కరించింది. అయితే ఇది వచ్చే ఏడాది చివరి నాటికి మార్కెట్లోకి ప్రవేశించనున్నది. ఇది ‘రిలేటివ్ బబుల్ ఆఫ్ కామ్’ను క్రియేట్ చేస్తుంది.
గ్లాస్‌తో కారు చుట్టూ వైండ్ షేప్ రూపొందిస్తారు. రేర్ వీల్ డ్రైవ్ ఎల్వా అత్యంత తేలికైన వేరియంట్. కేవలం 399 కార్లు మాత్రమే రూపొందిస్తున్న మైక్ లారెన్స్ సంస్థ దీని ధర 1.5 మిలియన్ల యూరోలుగా నిర్ణయించింది. ఎక్స్ ట్రీమ్ పెర్ఫార్మెన్స్ అందిస్తున్న ఎల్వా మైక్ లారెన్స్ కారు వాతావరణాన్ని నియంత్రించేందుకు కొనుగోలు చేయాలన్నా విండోస్ మార్కెట్లో లభించవు.
Also Read:ఫెరారీ నుండి సరికొత్త రోమా గ్రాండ్ టూరర్ (జిటి)...
815 పీఎస్, ట్విన్ టర్బో చార్జ్‌డ్ వీ 8 వల్ల కేవలం మూడు సెకన్లలోపే 62 కిలోమీటర్ల వేగాన్ని అందుకోనున్నది ఈ కారు. ఇందులో ఏర్పాటు చేసే నూతన లైట్ వెయిట్ కార్బన్ షెల్ తలకు, భుజాలకు వెన్నముకకు సపోర్ట్‌గా నిలుస్తుంది.
కార్బన్ ఫైబర్‌తో రూపొందించిన ఈ కారు లైట్ వెయిట్ నాన్ స్లిప్ మ్యాట్స్ అమర్చారు. ఎల్వా వివిధ రకాల ట్రిమ్స్ తో రూపొందించబడింది. వర్షాల నుంచి, సూర్యరశ్మి నుంచి ఎక్స్ పోజర్ కోసం ఈ డిజైన్లు రూపొందించారు. స్మాల్ స్టోరేజీ కంపార్ట్ మెంట్లు కూడా ఉన్నాయి. హౌజ్ హెల్మెట్లకు నిలయంగా ఉంది.
Also Read:MG మోటర్స్ ఎలక్ట్రిక్ కార్ లాంచ్...త్వరలో