Nexon EV price hike: నెక్సాన్​ ఈవీ ధర రూ.25,000 వేల వరకు పెంపు..!

By team telugu  |  First Published Mar 18, 2022, 2:03 PM IST

టాటా మోటార్స్‌కు చెందిన ఎల‌క్ట్రిక్ వాహ‌నం నెక్సాన్ ధ‌ర పెరిగింది. ఈ మోడ‌ల్‌పై రూ. 25 వేల వ‌ర‌కు పెంచుతూ  టాటా మోటార్స్ సంస్థ తాజాగా ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. దీంతో వెరియంట్ల వారీగా ఈ మోడ‌ల్ ధ‌ర‌లు పెర‌గ‌నున్నాయి.
 


టాటా మోటార్స్​కు చెందిన బెస్ట్ సెల్లింగ్​ ఎలక్ట్రిక్​ వెహికిల్​ నెక్సాన్​ ఈవీ మరింత ప్రియవనుంది. ఈ మోడల్ ధరను రూ.25,000 వేల వరకు పెంచుతూ టాటా మోటార్స్ తాజాగా నిర్ణయం తీసుకుంది. దీనితో వేరియంట్ల వారీగా ఈ మోడల్​ ధరలు రూ.14.54 లక్షల నుంచి రూ.17.15 లక్షల వరకు (ఎక్స్​ షోరూం) పెరగనున్నట్లు సమాచారం. దేశీయంగా అందుబాటులో ఉన్న ఈవీల్లో.. నెక్సాన్​ బెస్ట్ సెల్లర్​గా నిలిచేందుకు దీని ధర కూడా ఒక కారణమని చెబుతుంటారు విశ్లేషకులు. ఇతర కంపెనీలైన ఎంజీ జెడ్​ఎస్​ ఈవీ, హ్యూందాయ్​ కోనా ఎలక్ట్రిక్​ వంటి వాటితో దీని ధర తక్కువగా ఉండటం.. ఫీచర్లు అధికంగా ఉండటం వంటివి నెక్సాన్ ప్రత్యేకతలు. మరి ధరల పెంపు ప్రభావం దీనిపై ఎలా ఉంటుందో వేచి చూడాలని చెబుతున్నారు విశ్లేషకులు.

నెక్సాన్​లో కొన్ని ప్రత్యేకతలు

Latest Videos

undefined

ఇందులో 127 హార్స్​పవర్​, 245 ఎన్​ఎం ఇంజిన్​ ఉంటుంది. 30.2కిలో వాట్​ లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్​ ఉంటుంది. ఒక్కసారి ఫుల్ ఛార్జ్​ చేస్తే ఈ కారు 312 కిలోమీటర్ల వెళ్లగలదని కంపెనీ వర్గాల ద్వారా తెలిసింది. ప్రస్తుతం నెక్సాన్​ ఈవీ మూడు వేరియంట్లలో లభిస్తుంది. ఎక్స్​ఎం, ఎక్స్​జెడ్​ ప్లస్​, ఎక్స్​జెడ్​ ప్లస్​ ఎల్​యూఎక్స్​ వంటి వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. డార్క్ ఎడిషన్​లో కూడా రెండు వేరియంట్లలో ఈ మోడల్ అందుబాటులో ఉంది. ఈ కార్​లో టైయర్​ ప్రెషర్ మానిటర్​ వంటి అధునాతన ఫీచర్లు ఉన్నాయి.

టాటా కసరత్తు

టాటా మోటార్స్​ ప్రస్తుతం నెక్సాన్​ ఈవీ మోడల్​లో కొత్త వేరియంట్​పై కసరత్తు చేస్తోందని సమాచారం. 40 కిలో వాట్స్ బ్యాటరీతో ఈ వేరియంట్ అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న వేరియంట్లతో పోలిస్తే దీని ధర రూ.3 నుంచి రూ.4 లక్షల వరకు అధికంగా ఉండొచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుతం వేరియంట్లతో పోలిస్తే.. కొత్త వేరియంట్ ఒక్కసారి ఫుల్​ ఛార్జ్​ చేస్తే 400కిలో మీటర్ల వరకు ప్రయాణించే వీలుందని టెస్టింగ్ దశలో తేలింది. వినియోగంలోకి వస్తే కనీసం 300-320 కిలో మీటర్లు ప్రయాణించే వీలుందని అంచనాలు వస్తున్నాయి.

click me!