కారు ఇంజిన్ ఫెయిల్ అయితే...!: మారుతీ సుజుకీ సరికొత్త ప్యాకేజీ.. కస్టమర్లకు ఫుల్ సాటిస్ఫై..

Ashok Kumar   | Asianet News
Published : Mar 16, 2022, 04:12 PM ISTUpdated : Mar 16, 2022, 04:14 PM IST
కారు ఇంజిన్ ఫెయిల్ అయితే...!: మారుతీ సుజుకీ సరికొత్త ప్యాకేజీ.. కస్టమర్లకు ఫుల్ సాటిస్ఫై..

సారాంశం

ఈ ప్యాకేజీ కింద, భవిష్యత్తులో కారు ఇంజిన్‌లో ఏదైనా సమస్య తలెత్తితే, ఆ వాహనాలకు కంపెనీ కవరేజ్ ని అందిస్తుంది. ఓనర్షిప్ మేనేజ్మెంట్ అనుభవాన్ని మరింత సులభతరం చేసేందుకు కంపెనీ నిబద్ధతను వ్యక్తం చేస్తూ ఆఫ్టర్ సేల్స్ సర్వీస్ ను బలోపేతం చేయడానికి సి‌సి‌పి సహాయపడుతుందని మారుతీ సుజుకి తెలిపింది. 

దేశంలోని అతిపెద్ద వాహన తయారీ సంస్థ మారుతీ సుజుకీ (maruti suzuki) బుధవారం కొత్తగా 'కస్టమర్ కన్వీనియన్స్ ప్యాకేజీ (సి‌సి‌పి) (customer convenience package)ని ప్రారంభించినట్లు ప్రకటించింది. ఈ ప్యాకేజీ కింద, భవిష్యత్తులో కారు ఇంజిన్‌లో ఏదైనా సమస్య తలెత్తితే, ఆ వాహనాలకు కంపెనీ కవరేజ్ ని అందిస్తుంది. ఓనర్షిప్ మేనేజ్మెంట్ అనుభవాన్ని మరింత సులభతరం చేసేందుకు కంపెనీ నిబద్ధతను వ్యక్తం చేస్తూ ఆఫ్టర్ సేల్స్ సర్వీస్ ను బలోపేతం చేయడానికి సి‌సి‌పి సహాయపడుతుందని మారుతీ సుజుకి తెలిపింది. 

ఈ ప్యాకేజీ ఏంటి 
కస్టమర్‌లు ఏదైనా పెద్ద మెకానికల్ వైఫల్యం సంభవించినప్పుడు వేగమైన, పూర్తి పరిష్కారాలను అందించే విశ్వసనీయ బ్రాండ్‌ల నుండి కార్ మోడళ్లను ఎక్కువగా ఇష్టపడుతున్నందున, మారుతి సుజుకి  సి‌సి‌పి ఇంజిన్‌లో హైడ్రోస్టాటిక్ లాక్‌లు, ఇంధన కాలుష్యాన్ని నిరోధించడం లక్ష్యంగా పెట్టుకుంది. 

మారుతీ సుజుకి ఇండియా లిమిటెడ్ సర్వీస్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పార్థో బెనర్జీ మాట్లాడుతూ, "హైడ్రోస్టాటిక్ లాక్ లేదా ఇంధన కల్తీ కారణంగా వాహనం ఇంజిన్‌లో అనవసరమైన లేదా ఊహించని లోపాలు ఏర్పడినప్పుడు వినియోగదారులకు భరోసా ఇవ్వడానికి సి‌సి‌పి ప్రత్యేకంగా రూపొందించబడింది. ఈ ప్యాకేజీలలో దేనికైనా కస్టమర్లు సైన్ అప్ చేయవచ్చు ఇంకా దేశవ్యాప్తంగా ఏదైనా మారుతి సుజుకి ఆథరైజేడ్ వర్క్‌షాప్‌లో బెనెఫిట్స్ పొందండి." అని తెలిపారు.

కస్టమర్‌లకు సర్వీస్ అవసరం
కస్టమర్ నమ్మకాన్ని పెంపొందించడానికి సేల్స్ తర్వాత బలమైన అవసరాన్ని గురించి మాట్లాడుతూ, బెనర్జీ మరింత వివరిస్తూ, “మా కస్టమర్ పరిశోధనలో ఈ రోజు కస్టమర్‌లు తమ కార్ల గురించి ఎక్కువ రిస్క్‌తో విముఖంగా ఉన్నారని మేము కనుగొన్నాము అలాగే వాహనానికి సంబంధించి ఎటువంటి సంఘటనకైనా సిద్ధంగా ఉన్నామని మేము విశ్వసిస్తున్నాము.  అలాగే, వారు తమ కార్ల నిర్వహణ కోసం తయారీదారుల నుండి హామీ, సర్వీస్ ఫెసిలిటీస్ కోసం చూస్తారు." అని అన్నారు.

మూడు ప్యాకేజీ ఆప్షన్లు : సి‌సి‌పి మూడు ప్యాకేజీ ఆప్షన్లను అందిస్తుంది. ఇంజిన్‌లోకి నీరు చేరితే మరమ్మతుల కోసం సి‌సి‌పి హైడ్రో కవరేజీని అందిస్తుంది.  ఇంధన నాణ్యత కారణంగా అవసరమైన మరమ్మతులను కూడా  సి‌సి‌పి  కవర్ చేస్తుంది. అయితే సి‌సి‌పి ప్లస్ మాత్రం ఈ రెండింటినీ కవర్ చేస్తుంది. 

సి‌సి‌పి కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హత పొందాలంటే, కస్టమర్ తప్పనిసరిగా యాక్టివ్ ప్రైమరీ వారంటీని ఇంకా ఎక్స్టెంటెడ్ వారంటీ ఉండాలి. అలాగే డీలర్‌షిప్ వద్ద ప్యాకేజీని పొందడమే కాకుండా, కంపెనీ వెబ్‌సైట్‌ను కూడా సందర్శించవచ్చు.
 

PREV
click me!

Recommended Stories

తక్కువ ధర, ఎక్కువ మైలేజ్.. అదిరిపోయే ఫీచర్లతో చిన్న ఫ్యామిలీకి బెస్ట్ కారు
తక్కువ ధరలో అద్భుత ఫీచర్లతో యమహా కొత్త బైక్‌లు లాంచ్