సుజుకి జిక్సర్ నుండి రెండు సూఫర్ బైక్స్ విడుదల

First Published Jul 9, 2018, 3:27 PM IST
Highlights

సుజుకి మోటార్ సైకిల్ ఇండియా నుండి జిక్స్ర్ సీరీస్ లో మరో రెండు ద్విచక్ర వాహనాలు భారత మార్కెట్ లోకి ప్రవేశించాయి. జిక్సర్ ఎస్పీ మరియు జిక్సర్ ఎస్ఎఫ్ ఎస్పీ పేరుతో నూతన మోడళ్లను ఆ సంస్థ విడుదల చేసింది. ఈ రెండు నూతన మోడల్స్ సరికొత్త సదుపాయాలతో ఆకర్షణీయమైన గోల్డెన్ మరియు బ్లాక్ కలర్ లో అందుబాటులో ఉన్నాయి.
 
ఈ మోడళ్ల లో కొత్తగా ఆకట్టుకునేలా రూపొందించిన ఎస్పీ ఎంబ్లంను వాడారు.అలాగే గ్రాఫికల్ గా అత్యంత ఆకర్షనీయంగా రూపొందించిన ఫ్రంట్ కౌల్ తో పాటు పెట్రోల్ ట్యాంకు ను ఈ రెండు మోడళ్లలో అందించినట్లు సంస్థ తెలిపింది.

ఈ జిక్సర్ మరియు జిక్సర్ ఎస్ఎఫ్ మోడళ్లలో 155సిసి సింగిల్ సిలిండర్ ఇంజన్ ను వాడటం తో SEP( Suzuki’s Eco Performance)టెక్నాలజీ ఉపయోగించారు. ఈ వాహనాలు మెటాలిక్ మెజెస్టిక్ గోల్డ్ / గ్లాస్ స్పార్క్ బ్లాక్ రంగుల్లో అన్ని నగరాల్లోని సుజుకి డీలర్ షిప్ షోరూంలలో అందుబాటులో ఉండనున్నాయని సుజుకి సంస్థ ప్రకటించింది.

వీటి ధరలు ఈ కింది విధంగా ఉన్నాయి. 

జిక్సర్ ఎస్పీ ధర రూ.87,250(  ఎక్స్ షోరూం డిల్లీ)
జిక్సర్ ఎస్ఎఫ్ ఎస్పీ ధర 1,00,630  ( ఎక్స్ షోరూం డిల్లీ) 

ఈ వాహనాల  విడుధల సందర్భంగా సుజుకి ఇండియా ఎక్సిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ సంజీవ్ రాజశేఖరన్ మాట్లాడుతూ...2014 లో జిక్సర్ బ్రాండ్ ని మార్కెట్ లోకి విడుదల చేసినప్పటి నుండి నాణ్యత, స్టైలింగ్ మరియు పనితీరు విషయంలో ఇవి  సుజుకి సంస్థకు మారుపేరులా మారాయని కొనియాడారు. ఈ పేరును ఇప్పుడు విడుదల చేసిన మోడల్స్ మరింత పెంచుతాయని నమ్ముతున్నట్లు సంజీవ్ వివరించారు.
  
click me!