సిటీ అంతర్గత అవసరాలకు మహీంద్రా కొత్త బొలెరొ సిటీ పికప్

By rajesh yFirst Published Aug 30, 2019, 4:15 PM IST
Highlights

నగరాలు, పట్టణాల పరిధిలో అంతర్గత రవాణాకు అనువుగా మహీంద్రా అండ్ మహీంద్రా నూతన ‘బొలెరో పికప్’నూ విపణిలోకి ఆవిష్కరించింది. 

బెంగళూరు: ప్రముఖ వాహన తయారీ కంపెనీ ‘మహీంద్రా అండ్‌ మహీంద్రా’ (ఎం అండ్‌ ఎం) నగరాల అవసరాలకు అనుగునంగా తీర్చిదిద్దిన ‘బొలెరొ సిటీ పిక్‌–అప్‌’ వాహనాన్ని గురువారం మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఈ అధునాతన పిక్‌–అప్‌ వాహన ధర రూ.6.25 లక్షలుగా నిర్ణయించింది. 


4‌–సిలెండర్, 2,523 సీసీ డిజిల్‌ ఇంజిన్‌ కలిగిన ఈ నూతన వాహనానికి 1.4 టన్నుల పేలోడ్‌ సామర్థ్యం ఉన్నదని వెల్లడించింది.  నగరాల మధ్య అవసరాలు తీర్చడానికి బొలెరొ మ్యాక్సిట్రక్‌ ప్లస్‌ ఉండగా.. నూతన సిటీ పిక్‌–అప్‌ నగర అవసరాలకు సరిపోతుంది.

మహీంద్రా బొలెరో సిటీ పికప్ వెహికిల్‍లో క్యాబిన్ ఎర్గోనోమిక్స్ మార్చేశారు. వాహనాన్ని హాయిగా నడిపేందుకు వీలుగా కో-డ్రైవర్ సీట్ విస్త్రుత పరిచారు. సిటీలో అంతర్గతంగా తిరుగడానికి ఇది ఉపకరిస్తుంది. రాప్ అరౌండ్ హెడ్ ల్యాంప్స్, స్టైలిష్ క్రమ్ గ్రిల్లె ఎట్ ఫ్రంట్, డ్యూయల్ టోన్ ఇంటీరియర్స్, కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ అప్ హోల్ స్టర్డ్ సీట్లు, మ్యాచింగ్ డోర్ ట్రిమ్స్ లభిస్తాయి.  

మహీంద్రా అండ్ మహీంద్రా ఆటోమోటివ్ మార్కెటింగ్ డివిజన్ వైస్ ప్రెసిడెంట్ విక్రం గార్గ స్పందిస్తూ సిటీ పికప్, న్యూ బొలెరో పికప్ వెహికల్ విభిన్న అవసరాల కోసం నిర్దేశించింది. ఇంట్రాసిటీ అప్లికేషన్ల కోసం రూపొందించిందే బొలెరో సిటీ పికప్ అండ్ బొలెరో మ్యాక్టీ ట్రక్ గా ఉంటుంది’ అని తెలిపారు. 

కస్టమర్ సెంట్రిక్‌గా ట్రాఫిక్ సమస్యల నుంచి తేలిగ్గా బయటపడేందుకు వీలుగా రూపుదిద్దుకున్నది మహీంద్రా బొలెరో పికప్. దీనికి మూడేళ్లు లేదా లక్ష కిలోమీటర్ల ప్రయాణానికి వారంటీ ఇంది. కస్టమర్‌ను సంత్రుప్తి పరిచేలా చూస్తారు. 1.4 టన్నుల సరుకు తీసుకెళ్లగల సామర్థ్యం బొలెరో సిటీ పికప్‌కు ఉంది. 

click me!