Renault cars in India: రెనాల్ట్ కార్లపై భారీ డిస్కౌంట్లు..ఈ నెల‌లో కొత్త కారు కొంటే బంపర్ ఆఫర్స్..!

By team telugu  |  First Published Apr 14, 2022, 3:08 PM IST

ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం రెనాల్ట్ ఇండియా.. కస్టమర్స్ కోసం దాదాపు ప్రతీ నెలా డిస్కౌంట్ ఆఫర్స్‌ను ప్రకటిస్తోంది. ప్రస్తుత ఏప్రిల్ నెలలోనూ డిస్కౌంట్ ఆఫర్స్ ప్రకటించింది. తమ కంపెనీ కార్లపై రూ. 55,000 వరకు డిస్కౌంట్ అందిస్తోంది.


ఫ్రెంచ్ కార్ బ్రాండ్ రెనాల్ట్ ప్రస్తుతం దేశీయ విపణిలో క్విడ్, ట్రైబర్, డస్టర్, కైగర్ మోడళ్లను విక్రయిస్తోంది. ఈ మోడళ్లపై ఏప్రిల్‌ నెలంతా ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. ఈ నెలలో రెనో కార్లను సొంతం చేసుకునే వినియోగదార్లు, మోడల్ ,వేరియంట్‌ను బట్టి రూ.55,000 వరకూ డిస్కౌంట్లు పొందవచ్చు. ఈ ఆఫర్లలో క్యాష్ డిస్కౌంట్స్, ఎక్సేంజ్ బోనస్ , లాయల్టీ బెనిఫిట్స్ వంటివి ఉన్నాయి. ఈ ఆఫర్లు ఏప్రిల్ 30వ తేదీ వరకూ అందుబాటులో ఉంటాయి. ఏయే కార్లపై ఎంతవరకు డిస్కౌంట్ ఆఫర్ ఉందో ఇప్పుడు తెలుసుకుందాం..!

రెనాల్ట్ క్విడ్

Latest Videos

undefined

రెనాల్ట్ క్విడ్‌పై ఎక్స్‌చేంజ్ బెనిఫిట్ రూ. 10,000 వరకు అందుబాటులో ఉంది.  1.0-లీటర్ మోడల్‌పై రూ. 15,000 వరకు ఎక్స్‌ఛేంజ్ బోనస్, 0.8-లీటర్ మోడల్‌పై రూ. 10,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్‌తో కలిపి మొత్తం రూ. 35,000 వరకు బెనిఫిట్స్ అందుబాటులో ఉన్నాయి.  అలాగే స్పెషల్ లాయల్టీ బెనిఫిట్స్ రూ.37 వేల వరకు అందుబాటులో ఉన్నాయి.

రెనాల్ట్ కిగర్

Renault India Kygar SUVపై స్పెషల్ లాయల్టీ బెనిఫిట్ కింద రూ. 55,000 వరకు బెనిఫిట్ ఆఫర్ అందుబాటులో ఉంది. అలాగే కార్పోరేట్ డిస్కౌంట్ కింద రూ.10వేల వరకు డిస్కౌంట్ పొందవచ్చు.  ఎక్స్‌చేంజ్ బెనిఫిట్స్ ద్వారా స్క్రాప్ రాంపేజ్ కింద రూ.10వేలు వరకు పొందవచ్చు.

రెనాల్ట్ ట్రైబర్

రెనాల్ట్ ట్రైబర్‌పై రూ. 40,000 వరకు బెనిఫిట్స్ పొందవచ్చు. అలాగే స్పెషల్ లాయల్టీ బెనిఫిట్స్ రూ.44 వేల వరకు, స్క్రాప్ రాంపేజ్ కింద ఎక్స్‌చేంజ్ బెనిఫిట్ రూ.10వేల వరకు పొందవచ్చు. ఇందులో RXE వేరియంట్ మినహా అన్నింటికీ రూ. 10,000 వరకు నగదు తగ్గింపు ఆఫర్ అందుబాటులో ఉంది. 2022 మోడల్‌కు అన్ని వేరియంట్‌లపై డిస్కౌంట్ ఆఫర్ అందిస్తున్నారు. 

click me!