ఈ నెలలో రానున్న రెండు లేటెస్ట్ బైక్‌లు ఇవే.. స్పోర్టీ లుక్, రేసింగ్ డిజైన్ అదిరిపోయాయి...

By asianet news telugu  |  First Published Dec 2, 2022, 10:06 PM IST

డిసెంబర్ నెలలో భారతీయ మార్కెట్లోకి  లగ్జరీ కార్ కంపెనీ బి‌ఎం‌డబల్యూ ఒక కొత్త సూపర్ బైక్‌ తీసుకురానుంది. ఈ బైక్ ధర చాలా ఎక్కువగా ఉండవచ్చు, ఒక విధంగా చెప్పాలంటే ఈ ధరకు ఒక గొప్ప ఎస్‌యూ‌విని కొనుగోలు చేయవచ్చు.
 


భారత మార్కెట్లో లగ్జరీ కార్లను ప్రవేశపెట్టే నెలలో రెండు పవర్ ఫుల్ బైక్‌లు కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నాయి. వీటిలో ఒకటి 200 సీసీ, మరో బైక్ 1000 సీసీ.  ఈ రెండు బైక్‌ల ప్రత్యేకత, ధర గురించి తెలుసుకొండి...

బి‌ఎం‌డబల్యూ స్పోర్ట్స్ బైక్ 
డిసెంబర్ నెలలో భారతీయ మార్కెట్లోకి  లగ్జరీ కార్ కంపెనీ బి‌ఎం‌డబల్యూ ఒక కొత్త సూపర్ బైక్‌ తీసుకురానుంది. ఈ బైక్ ధర చాలా ఎక్కువగా ఉండవచ్చు, ఒక విధంగా చెప్పాలంటే ఈ ధరకు ఒక గొప్ప ఎస్‌యూ‌విని కొనుగోలు చేయవచ్చు.

Latest Videos

undefined

ఏ ఫీచర్స్ ఉండొచ్చంటే
ఎస్1000 RRని బెస్ట్  బైక్‌లలో ఒకటిగా చేయడానికి కంపెనీ సరికొత్త ఛాసిస్‌ను ఉపయోగించింది. ట్రాక్షన్ కంట్రోల్, స్లైడ్ కంట్రోల్, బై-డైరెక్షనల్ క్విక్ షిఫ్టర్, సిక్స్-స్పీడ్ గేర్ ట్రాన్స్‌మిషన్ ఇందులో ఇచ్చారు. ఈ బైక్ యూరోపియన్ వెర్షన్‌ను కంపెనీ ఇండియాలో CBUగా మాత్రమే విక్రయానికి తీసుకువస్తుందని భావిస్తున్నారు. దీంతో గతంలో కంటే మెరుగైన ఏరోడైనమిక్స్, అప్ డేట్ చేసిన గ్రాఫిక్స్ ఇందులో ఇవ్వవచ్చు.

ఇంజిన్ ఎలా ఉంటుందంటే 
బైక్ ఇంజన్ గురించి చెప్పాలంటే, ఇందులో 999 సిసి ఇన్‌లైన్ ఫోర్ మోటార్ ఇంజన్ ఇచ్చారు. ఈ బైక్‌ 210 హార్స్‌పవర్, 113 న్యూటన్ మీటర్ల టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

ధర ఎంత ఉంటుందంటే 
బి‌ఎం‌డబల్యూ S 1000 RR ప్రస్తుత వేరియంట్ ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధర రూ. 19.75 లక్షలు, అయితే కొత్త వెర్షన్ ధర దాదాపు రూ. 30 లక్షల వరకు ఉండవచ్చు.

హీరో 200 సీసీ బైక్‌
బి‌ఎం‌డబల్యూ కాకుండా 200cc పవర్ ఫుల్ బైక్  200T 4Vని కూడా భారతీయ ద్విచక్ర వాహన తయారీ సంస్థ Hero ద్వారా భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టబడుతుంది. గత కొంతకాలంగా ఈ బైక్‌ను భారతీయ రోడ్లపై పరీక్షిస్తున్నారు.

ఫీచర్లు ఎలా ఉంటాయి
బైక్‌లోని ఫీచర్లు చూస్తే  కొత్త ఫోర్క్ గెటర్స్, కొత్త కలర్, కొత్త గ్రాఫిక్స్ గురించి ఇందులో ఇవ్వనున్నారు. ఇంకా రోడ్డు పై మెరుగైన పనితీరును ఇస్తుంది.

ఇంజిన్ ఎలా ఉంటుందంటే 
బైక్ ఇంజన్ గురించి చెప్పాలంటే, ఇందులో 200 సిసి ఇంజన్ ఉంటుంది. ఈ ఇంజన్ ఎయిర్-కూల్డ్ టెక్నాలజీతో తీసుకువస్తున్నారు, తద్వారా బైక్ 19.1 PS, 17.35 న్యూటన్ మీటర్ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ధర ఎంత ఉంటుందంటే
200సీసీ ఇంజన్ తో వస్తున్న ఈ బైక్ ఎక్స్ షోరూమ్ ధర ప్రస్తుత మోడల్ కంటే దాదాపు ఐదు నుంచి ఏడు వేల రూపాయలు ఎక్కువగా ఉండొచ్చు. ప్రస్తుతం దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.1.24 లక్షలు.
 

click me!