Mercedes-AMG EQE SUV:ఈ కొత్త కార్ సింగిల్ ఫుల్ ఛార్జ్‌ మైలేజ్ ఎంతో తెలుసా.. టీజర్ వీడియో ఔట్..

Ashok Kumar   | Asianet News
Published : Feb 14, 2022, 05:52 PM IST
Mercedes-AMG EQE SUV:ఈ కొత్త కార్ సింగిల్ ఫుల్ ఛార్జ్‌  మైలేజ్ ఎంతో తెలుసా.. టీజర్ వీడియో ఔట్..

సారాంశం

మెర్సిడెస్-బెంజ్ ఎలక్ట్రిక్ ఎస్‌యూ‌వి ఈ‌క్యూ‌ఈకి మరింత శక్తిని అందించడానికి సిద్ధంగా ఉంది, జర్మన్ కార్ల తయారీ సంస్థ అధికారికంగా కారు ఏఎంజి వెర్షన్‌ను ఫిబ్రవరి 16న ఆవిష్కరించనుంది. అయితే లాంచ్ కి ముందు మెర్సిడెస్ సోషల్ మీడియాలో ఏ‌ఎం‌జి ఈ‌క్యూ‌ఈ ఎస్‌యూ‌వి టిజర్ విడుదల చేసింది.  

జర్మన్ లగ్జరీ కార్ బ్రాండ్ మెర్సిడెస్-బెంజ్  ఎలక్ట్రిక్ ఎస్‌యూ‌వి ఈ‌క్యూ‌ఈ (EQE)ని ఏ‌ఎం‌జి వెర్షన్ ని ఫిబ్రవరి 16న అధికారికంగా పరిచయం చేయనుంది. అయితే లాంచ్ ముందు మెర్సిడెస్  సోషల్ మీడియా హ్యాండిల్‌లో అంగ్ ఈ‌క్యూ‌ఈ  ఎస్‌యూ‌వి  టీజర్‌ను విడుదల చేసింది. ఈ టిజర్ వీడియొలో కొన్ని ఫీచర్స్ వెళ్లడయ్యాయి.

మెర్సిడెస్-ఏ‌ఎం‌జి  ఈ‌క్యూ‌ఈ (mercedes-AMG EQE) ఈ సంవత్సరం పర్ఫార్మేన్స్ ఎలక్ట్రిక్ కార్ల సిరీస్‌లో భాగం. 2022లో వచ్చే ఆరు మోడళ్లలో ఈ కార్ రెండవది. ఈ సంవత్సరం ప్రారంభం జనవరిలో మెర్సిడెస్ ఈ‌క్యూ‌ఏ  ఏ‌ఎం‌జి వెర్షన్‌ను పరిచయం చేసింది. ఇతర ఫీచర్లని  సిగ్నేచర్ ఎల్‌ఈ‌డి టైల్‌లైట్లు కాకుండా టీజర్ వీడియోలో ఈఎం‌జి బ్యాడ్జింగ్  పక్కన  క్రోమ్ స్లాట్‌లతో  బ్లాక్ గ్రిల్‌పై ఏ‌ఎం‌జి  బ్యాడ్జింగ్  కనిపిస్తుంది. మిడ్-సైజ్ ఎస్‌యూ‌వి మెర్సిడెస్ బెంజ్  ఈ‌వి‌ఏ 2 (ఎలక్ట్రిక్ వెహికల్ ఆర్కిటెక్చర్) ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉంటుంది. 

ఈ‌క్యూ‌ఈ యొక్క ఎం‌ఏ‌జి వెర్షన్ ఈ‌క్యూ‌ఎస్ ఎస్‌యూ‌వి పోలి ఉండవచ్చు, దీనిని గత సంవత్సరం మేబ్యాక్-లేబుల్ కాన్సెప్ట్ కారుగా పరిచయం చేసింది. దీని బోనెట్, స్క్వేర్ వీల్ ఆర్చ్‌ల డిజైన్ వంటిని  ఈ‌క్యూ‌ఈ సెడాన్‌తో పోలికగా ఉంటాయి.  లోవర్ గ్రౌండ్ రైడ్ హైట్, ఏ‌ఎం‌జి -బ్రాండెడ్ బ్రేక్ కాలిపర్‌ల కోసం ప్రత్యేక రిమ్‌లు, అలాగే మొదటి సారిగా ముందు భాగంలో చిన్న రెక్కలతో కూడిన కొత్త బంపర్‌లను పొందే అవకాశం ఉంది.

మెర్సిడెస్ ఈ‌క్యూ‌ఈ ఎక్స్‌ఎక్స్‌ఎక్స్ కోసం మూడు-అంకెల ఆల్ఫాన్యూమరిక్ ట్రేడ్‌మార్క్ కోసం దాఖలు చేసింది, వీటి మైలేజ్ 250 నుండి 600 వరకు ఉంటుంది, మరోవైపు ఇంజిన్‌ల కోసం మల్టీ ఆప్షన్స్ సూచిస్తుంది. ఏ‌ఎం‌జి బ్యాడ్జ్‌తో రానున్న స్పోర్ట్స్ వెర్షన్ విషయానికొస్తేEQE 43, EQE 53, EQE 55, EQE 63 పేర్లతో నాలుగు వేరియంట్‌లు వచ్చే అవకాశం ఉంది.

ఇంజన్ అండ్ రేంజ్ 
ఏ‌ఎం‌జి ఈ‌క్యూ‌ఈని ఈ‌క్యూ‌ఎస్ 53 వంటి పవర్‌ట్రెయిన్‌తో అందించవచ్చు. ఇది 649హెచ్‌పి శక్తిని, 948 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేసే డ్యూయల్-మోటార్ ఏ‌డబల్యూ‌డి వెర్షన్‌ను పొందే అవకాశం ఉంది. ఓవర్‌బూస్ట్ మోడ్‌లో ఇంజన్ 751 hp శక్తిని, 1,018 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. డ్రైవింగ్ రేంజ్ విషయానికొస్తే  ఒక్కసారి పూర్తి ఛార్జింగ్‌తో దాదాపు 600 కి.మీల దూరాన్ని ప్రయాణించగలదు. 

PREV
click me!

Recommended Stories

Ather Rizta: 20 నెలల్లో 2 లక్ష‌ల స్కూటీలు అమ్ముడ‌య్యాయి.. ఏంటా స్కూటీ, అంతలా ఏముంది
Swivel Seat: ఇక వృద్ధులకు కారెక్క‌డం ఇబ్బంది కాదు.. అద్భుత ఆలోచ‌న చేసిన మారుతి