విటారా బ్రిజా సంచలనం, కేవలం 28 నెలల్లోనే 3 లక్షల కార్ల అమ్మకం

First Published Jul 4, 2018, 1:29 PM IST
Highlights

ప్రముఖ కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకి ఇండియ లిమిటెడ్(ఎమ్ఎస్ఐఎల్) కార్ల అమ్మకాల్లో సంచలనం సృష్టించింది. నుండి వచ్చిన విటారా బ్రిజా SUV మోడల్ అతి తక్కువ కాలంలోనే అత్యధిక సేల్స్ సాధించింది. ఈ మోడల్ 2016 మార్చ్ లో మార్కెట్ లోకి విడుదలైంది. అప్పటినుండి ఇప్పటివరకు అంటే కేవలం 28 నెలల్లోనే 3 లక్షల కార్లు అమ్ముడైనట్లు సంస్థ ప్రకటించింది. విటారా బ్రిజా మోడల్ ఈ SUV విభాగంలో అత్యంత వేగంగా అమ్ముడవుతోందని మారుతీ సుజుకి ప్రకటించింది. 

ప్రభుత్వ నిబంధలను లోబడి విటారా బ్రిజా కారును ప్రయాణికుల సేప్టీ కోసం అత్యంత పకడ్బందీగా, సాంకేతికతను ఉపయోగించి రూపొందించినట్లు సంస్థ తెలియజేసింది. ఇందులో చిన్న పిల్లలను నియంత్రిచడానికి ప్రత్యేక వ్యవస్థ, హైస్పీడ్ వార్నింగ్ అలెర్ట్, రెండు ఎయిర్ బ్యాగ్, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ లతో పాటు అత్యంత సాంకేతికతా ప్రమాణాలతో కూడిన సైకర్యవంతమైన సదుపాయాలను విటారా బ్రిజా లో కల్పించినట్లు తెలిపారు.  ఈ సదుపాయాలు అన్ని రకాల విటారా బ్రిజా కార్లలో ఉన్నాయని తెలిపారు. అలాగే మొదటిసారిగా మారుతీ సుజుకీ  డ్యుయల్ టోన్ కలర్ కార్లను మొదటిసారిగా విటారా బ్రిజా లో ప్రవేశపెట్టినట్లు   కంపెనీ అధికారులు తెలిపారు.
 
ఈ బ్రాండ్ కార్ల అమ్మకాలను ఇంత పెద్ద ఎత్తున చేపట్టి ప్రోత్సహిస్తున్న వినియోగదారులకు మారుతీ సుజుకి సీనియర్ ఎక్సిక్యూటివ్ డైరెక్టర్ ఆర్.ఎస్ కల్సీ కృతజ్ఞతలు తెలిపారు.  విటారా బ్రిజా సేల్స్ విభాగంలో సంచలనం సృష్టించిందని ఆయన తెలిపారు. ఈ కార్ల అమ్మకాలను మరింతగా పెంచడానికి ప్రయత్నిస్తున్నట్లు ఆయన తెలిపారు.వినియోగదారుల అభిరుచికి తగ్గట్లుగా దీన్ని రూపొందించడం వల్లే ఇంత పెద్ద ఎత్తున సక్సెస్ అయ్యిందని కల్సీ తెలిపారు.  

click me!