కేవలం నెలలోనే టాప్-10లో మారుతి ఎస్-ప్రెస్సోకు చోటు

By Sandra Ashok KumarFirst Published Nov 21, 2019, 2:40 PM IST
Highlights

సెప్టెంబర్ 30వ తేదీన విపణిలో ఆవిష్కరించబడిన మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో మోడల్ బుల్లికారు టాప్ బెస్ట్ సెల్లింగ్ కార్లలో ఒకటిగా నిలిచింది. 

న్యూఢిల్లీ: నూతనంగా మార్కెట్లో ఆవిష్కరించిన మారుతి సుజుకి ఆధ్వర్యంలోని ఎస్-ప్రెస్సో బుల్లి కారు నెలలోపే దేశంలోనే అత్యధికంగా అమ్ముడు పోతున్న మోడల్‌గా రికార్డు సాధించింది. ఈ మినీ ఎస్‌యూవీ కారును మారుతి సుజుకి సెప్టెంబర్ 30వ తేదీన విపణిలోకి ఆవిష్కరించింది. కేవలం అక్టోబర్ నెలలో 10,634 యూనిట్లు అమ్ముడు పోయింది. ఆవిష్కరించిన 11 రోజుల్లోనే 10 వేలకు పైగా బుకింగ్స్ మోదు చేసుకున్నది.

also read  రాయల్ ఎన్ఫీల్డ్ ఆ మోడల్ బైకులను ఇక అమ్మకపోవచ్చు...

కంఫర్టబుల్, సేఫ్, తేలికైన ఓన్లీ ఎంట్రీ లెవెల్ కార్లలో మారుతి సుజుకి ఎస్ ప్రెస్సో కారు ఒకటిగా నిలిచిందని సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాత్సవ చెప్పారు. బీఫీ క్లాడింగ్, బాక్సీ ప్రొపార్షన్, స్క్వేర్డ్ వీల్ ఆర్చెస్, టాల్ బాయ్ స్టాన్స్ తదితర ఫీచర్లతో ఈ బుల్లికారును డిజైన్ చేశారు. ఎస్ ప్రెస్సో కార్ల పట్ల సానుకూల ప్రతిస్పందన కలిగి ఉన్నందుకు శశాంక్ శ్రీవాత్సవ తెలిపారు. ‘హార్ట్ టెక్ కీ’ ప్లాట్ ఫామ్ వేదికగా ఈ కారు రూపుదిద్దుకున్నది. 

డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‍తోపాటు స్మార్ట్ ప్లే టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం,  మల్టీ ఫంక్షనల్ స్టీరింగ్ వీల్, యూఎస్బీ, 12వీ చార్జర్లు, ఎయిర్ కండీషనింగ్ సిస్టం, స్టోరేజీ స్పేస్ కలిగి ఉంటుంది. ప్రమాణాలతో కూడిన డ్రైవర్ వైపు ఎయిర్ బ్యాగ్, ఏబీఎస్ విత్ ఈబీడీ, డ్రైవర్ అండ్ కో - డ్రైవర్ సీట్ బెల్ట్ రిమైండర్, రివర్స్ పార్కింగ్ సెన్సర్లు, స్పీడ్ అలర్ట్ సిస్టమ్, టాప్ ఎండ్ మోడల్ డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్, రేర్ పార్కింగ్ సెన్సర్లు, స్పీడ్ సెన్సింగ్ డోర్ లాక్స్ ఉన్నాయి. 

also read  మహీంద్రా అండ్ పినిన్ ఫరీనా నుంచి మరో స్పీడ్ కారు

బీఎస్-6 ప్రమాణాలతో రూపుదిద్దుకున్న ఈ కారులో 1.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్, ఆల్టో కే 10 హ్యాచ్ బ్యాక్ తదితర ఫీచర్లు ఉన్నాయి. 5,500 ఆర్పీఎం వద్ద 67 బీహెచ్పీ, 3500 ఆర్పీఎంతో 90ఎన్ఎం టార్చి శక్తిని ఇస్తుంది. 5-స్పీడ్ మాన్యువల్ గేర్ కూడా ఏర్పాటై ఉంది.

click me!