మారుతి సుజుకి నుండి 12 కొత్త మోడల్ కార్లు... 6 లక్షలకు పైగా సేల్స్...

By Sandra Ashok Kumar  |  First Published Dec 17, 2019, 10:57 AM IST

ప్రయాణికుల వాహనాల తయారీ సంస్థ మారుతి సుజుకి వినియోగదారులకు మూడు ఆటోమేటిక్ ఆప్షన్లలో 12 మోడల్ కార్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆటో గేర్ షిఫ్ట్ (ఏజీఎస్), ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ (ఏటీ), కంటిన్యూయస్ వ్యారియబుల్ ట్రాన్స్‌మిషన్ (సీవీటీ)లు మారుతి సుజుకి అందుబాటులోకి తెచ్చిన ఆటోమేటిక్ ఆప్షన్లు.


న్యూఢిల్లీ: మారుతీ సుజుకీ భారత్‌లో మరో కీలక మైలు రాయిని దాటింది. ఐదేళ్ల సమయంలోనే ఆరు లక్షలకు పైగా  ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మిషన్‌ కార్లను విక్రయించింది. ప్రస్తుతం మారుతీ సుజుకీ ఆటోషిఫ్ట్‌ గేర్‌, టార్క్‌ కన్వర్టర్‌, సీవీటీ ఆప్షన్లను అందజేస్తోంది. 

మారుతి సుజుకి ఆటోమేటిక్ కార్లకు వినియోగదారుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. ఇటీవల కాలంలో వీటి విక్రయాలు కూడా బాగా పెరిగాయి. తన పోర్టు ఫోలియోలోని అన్ని కార్లలో ఆటో గేరు అప్షన్‌ను అందజేస్తోంది. ఆల్టో కే10‌, ఎస్‌ -ప్రెస్సో, వ్యాగన్ ఆర్‌, సెలిరియో, ఇగ్నీస్‌, స్విఫ్ట్‌, డిజైర్‌, బ్రెజాల్లో ఏజీఎస్‌ ఆప్షన్‌ లభిస్తోంది. ఇక టార్క్‌ కన్వర్టర్‌ ఆప్షన్‌లో ఎర్టిగా, సియాజ్‌, ఎక్స్‌ఎల్‌6 లభిస్తున్నాయి. ఇక బాలెనో మాత్రం సీవీటీ ఆప్షన్‌లో లభిస్తోంది. 

Latest Videos

undefined

also read కొత్త సంవత్సరంలో బీఎస్‌-6 బైక్స్ అమ్మకాలపై ఆశలు

ప్రజాదరణ పొందిన ఏజీఎస్ ట్రాన్స్ మిషన్ టెక్నాలజీ కింద ఐదేళ్ల క్రితం అంటే 2014లో సెలిరియోను ఆవిష్కరించింది. కేవలం 2018-19 ఆర్థిక సంవత్సరంలోనే మారుతి సుజుకి ఆటోమేటిక్ వాహనాలు రెండు లక్షలకు పైగా అమ్ముడయ్యాయి. 

దీనిపై మారుతి సుజుకి మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ) కెన్చీ అయికవా మాట్లాడుతూ ‘‘కొత్త టెక్నాలజీని కస్టమర్లు ఆమోదిస్తున్నారన్ని విషయం తెలుస్తోంది. ఈ టెక్నాలజీలు సౌకర్యం, సులువైన డ్రైవింగ్‌ను అందిస్తున్నాయి. దీనికి తోడు మేము పలు రకాల ఆటోమేటిక్‌ రకాలు అందజేస్తుండటంతో వారి అవసరాలను తీరుస్తోంది’’ అని పేర్కొన్నారు. 

also read ఉద్యోగుల్లో తొలగింపు పై తేల్చి చెప్పిన టాటా మోటార్స్

మారుతి సుజుకి ఆటోమేటిక్ ఆప్షన్ కార్లు దేశవ్యాప్తంగా ఎంతో పాపులర్. ప్రత్యేకించి బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్, ముంబై, పుణె, చెన్నై వంటి మెట్రోపాలిటన్ నగరాల్లో ఆటోమేటిక్ కార్లంటే వినియోగదారులకు ఎంతో మోజు. 
 

click me!