మహీంద్ర కార్లపై కళ్ళు చెదిరే ఆఫర్.. ఏకంగా 3 లక్షల వరకు తగ్గింపు.. కొద్దిరోజులే అవకాశం

By S Ashok Kumar  |  First Published Apr 23, 2021, 12:24 PM IST

మహీంద్రా అండ్‌  మహీంద్రా  ఇటీవల లాంచ్‌ చేసిను థార్‌ మినహా అన్ని కార్లపై భారీ తగ్గింపు ప్రకటించింది. ఇప్పుడు బీఎస్-6 కార్లను భారీ డిస్కౌంట్‌ ధరకే వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. 
 


కొత్త కొనుగోలుదారులను ఆకర్షించడానికి దేశీయ వాహన తయారీ సంస్థ మహీంద్రా  బిఎస్ 6-కంప్లైంట్ కార్లపై ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రకటించింది. కంపెనీ అధికారిక వెబ్‌సైట్ ప్రకారం సరికొత్త మహీంద్ర థార్ మినహా మిగతా అన్నీ మోడల్స్ పై 3.06 లక్షల వరకు తగ్గింపు ఆఫర్ అందిస్తుంది.

వాహన కొనుగోలుదారులు  ఇప్పుడు మహీంద్ర కెయువి 100 ఎన్‌ఎక్స్‌టి నుండి అల్టురాస్ జి4 ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీ వరకు అన్నీ కార్లపై క్యాష్ బ్యాక్ ఆఫర్, ఎక్స్ఛేంజ్ బోనస్, కార్పొరేట్ డిస్కౌంట్ వంటి బెనెఫిట్స్ పొందవచ్చు.

Latest Videos

ఈ ఆఫర్ 30 ఏప్రిల్ 2021 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.  అలాగే ఈ ఆఫర్ ఒక డీలర్ నుండి మరో డీలర్ కు  మారే అవకాశం ఉంది.

 మహీంద్రా కే‌యూ‌వి100 ఎన్‌ఎక్స్‌టి పై  రూ.62,055 వరకు, మహీంద్ర  ఎక్స్‌యూ‌వి 300 సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీపై  రూ.44,500 వరకు  బెనెఫిట్స్ లభిస్తాయి.

also read ఇండియాలోకి మరో రెండు సూపర్ ఫాస్ట్ బైక్స్.. లిమిటెడ్ ఎడిషన్ తో 775 యూనిట్లు మాత్రమే లాంచ్.. ...

అత్యధికంగా మహీంద్ర  అల్టురాస్ జి 4 ఎస్‌యూవీపై రూ.3.06 లక్షల వరకు  బెనెఫిట్స్ అందిస్తోంది. ఇందులో 2.2 లక్షల వరకు క్యాష్ ఆఫర్, రూ.50వేల  వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్ ఉన్నాయి.  

మహీంద్ర మరాజో ఎమ్‌పివిపై గరిష్టంగా రూ.41,000 వరకు తగ్గింపు అందిస్తుంది. ఇందులో రూ.20వేల  వరకు నగదు ప్రయోజనాలు,  రూ.15,000 వరకుఎక్స్ఛేంజ్ బోనస్, కార్పొరేట్ డిస్కౌంట్ రూ.6,000 వరకు ఉన్నాయి.

మహీంద్రా స్కార్పియో పై మొత్తం  రూ.36,542 వరకు ప్రయోజనాలను ఇస్తుంది. ఇందులో  బోనస్ రూ.7,042, ఎక్స్ఛేంజ్ బోనస్ రూ.15,000 ఉన్నాయి. ఈ ప్రయోజనాలు కాకుండా కార్పొరేట్ ఆఫర్  రూ.4,500తో  అదనపు ప్రయోజనాలు కూడా ఉన్నాయి.

మహీంద్రా ఎక్స్‌యువి 500 పై గరిష్టంగా రూ.85,800 వరకు బెనెఫిట్స్ లభిస్తాయి. ఇందులో రూ.36,800 వరకు నగదు తగ్గింపు, 25,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్, 9,000 వరకు కార్పొరేట్ డిస్కౌంట్, 15,000 వరకు అదనపు ఆఫర్లు పొందవచ్చు

చివరగా మహీంద్ర బొలెరో పై మొత్తం రూ.17,500 తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. ఇందులో 3,500 వరకు క్యాష్ ఆఫర్, 10,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్, 4,000 వరకు కార్పొరేట్ డిస్కౌంట్  ఉన్నాయి.
 

click me!