ఆనంద్‌ మహీంద్రాకు ఇండియన్ క్రికెటర్ నటరాజన్ రిటర్న్‌ గిఫ్ట్‌.. సోషల్ మీడియాలో వైరల్ ఫోటోలు ఇవే..

By S Ashok Kumar  |  First Published Apr 2, 2021, 4:15 PM IST

ఆనంద్ మహీంద్రా తాను చెప్పిన మాట ప్రకారం క్రికెటర్ క్రికెటర్ మహీంద్ర థార్ ఎస్‌యూవీని గురువారం బహుమతిగా ఇచ్చారు.  ఆ బహుమతికి గుర్తుగా  ఆనంద్ మహీంద్రాకు తాను సంతకం చేసిన గబ్బా టెస్ట్ జెర్సీని రిటర్న్‌ గిఫ్ట్‌ పంపించాడు.
 


ప్రముఖ  పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా  తాను చెప్పిన మాట ప్రకారం భారత పేసర్ టి నటరాజన్‌కు  మహీంద్ర థార్ ఎస్‌యూవీని గురువారం బహుమతిగా ఇచ్చారు. లెఫ్ట్ ఆర్మ్ పేసర్ టి నటరాజన్‌ మహీంద్ర షోరూమ్ నుండి అందుకున్న థార్ ఎస్‌యూవీ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.  

విరాట్ కోహ్లీ, మహ్మద్ షమీ, రవీంద్ర జడేజా వంటి స్టార్ క్రికెటర్లు ఆశించినంతగా ప్రదర్శన కనబరచనప్పటికీ భారత్ ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్‌లో   2-1 తేడాతో గెలిచిన సంగతి మీకు తెలిసిందే. అయితే  ఈ సిరీస్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచిన టీమ్‌ఇండియా యువ ఆటగాళ్లకు ఆనంద్‌ మహీంద్రా అప్పట్లో థార్‌ ఎస్‌యూవీ కార్లను బహుమతులుగా ప్రకటించిన సంగతి తెలిసిందే.

Latest Videos

also read డ్రైవరు లేకుండా హెలికాప్టర్ లాగా గాలిలోకి ఎగిరే కార్ ఎప్పుడైనా చూసారా.. ?

ఈ క్రమంలో యువ ఆటగాళ్లు శార్దూల్ ఠాకూర్‌‌, నవ్‌దీప్‌ సైని, నటరాజన్‌, మహ్మద్‌ సిరాజ్‌, శుభ్‌మన్‌గిల్‌, వాషింగ్టన్‌ సుందర్‌ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించారు. దాంతో వీరి ప్రదర్శనకు మెచ్చిన మహీంద్రా తన కంపెనీ నుంచి థార్ ఎస్‌యూవీ కారును బహుమతిగా ఇస్తానని చెప్పారు.

ఈ నేపథ్యంలోనే నటరాజన్  తాజాగా మహీంద్ర థార్  కారును అందుకున్నాడు. అయితే, ఆ బహుమతికి గుర్తుగా అతడు కూడా మహీంద్రాకు రిటర్న్‌ గిఫ్ట్‌ ఇవ్వడం ఇప్పుడు విశేషం.  30 ఏళ్ల నటరాజన్‌ తాను సంతకం చేసిన గబ్బా టెస్ట్ జెర్సీని  బహుమతిగా ఆనంద్ మహీంద్రకు పంపించాడు.

also read 

Playing cricket for India is the biggest privilege of my life. My has been on an unusual path. Along the way, the love and affection, I have received has overwhelmed me. The support and encouragement from wonderful people, helps me find ways to ..1/2 pic.twitter.com/FvuPKljjtu

— Natarajan (@Natarajan_91)

"భారతదేశం కోసం క్రికెట్ ఆడటం నా జీవితంలో అతిపెద్ద గర్వకారణం. నా ఎదుగుదల అనూహ్యంగా జరిగింది. అలాగే, నాకు లభించిన ప్రేమ, ఆప్యాయత నన్ను మైమరపించాయి. అద్భుతమైన వ్యక్తులు వెంట ఉంటే అసాధ్యాలను కూడా సుసాధ్యం చేసుకునే మార్గాలు నా ముందుకు వస్తాయి.

నా ప్రయాణాన్ని గుర్తించినందుకు ఆనంద్ మహీంద్రకు  ఎంతో కృతజ్ఞతలు అని అన్నారు.  క్రికెట్ పట్ల  మహీంద్రకు అమితమైన ప్రేమకు గుర్తుగా  నేను సంతకం చేసిన నా గబ్బా టెస్టు జెర్సీని అందజేస్తా”అని నటరాజన్ ట్వీట్ చేశారు.

click me!