లగ్జరీ కార్ బ్రాండ్ లెక్సస్ అత్యంత కాస్ట్లీ ఎస్‌యూ‌వి.. దీని ధరకి ఎనిమిది ఫార్చ్యూనర్ కార్లు వస్తాయి.

By asianet news telugu  |  First Published Dec 24, 2022, 10:02 AM IST

దీని ధర గురించి మాట్లాడితే  లెక్సస్ ఎల్‌ఎక్స్ 500 పాత జనరేషన్  ఎల్‌ఎక్స్ 570 మోడల్ కంటే దాదాపు రూ. 50 లక్షలు ఎక్కువ. భారత మార్కెట్లో టయోటా ఫార్చ్యూనర్ ఎస్‌యూ‌వి ధర రూ.32.58 లక్షల నుండి ప్రారంభమవుతుంది. 


జపనీస్ ఆటోమోబైల్ కంపెనీ లెక్సస్ ఇండియాలో అత్యంత ఖరీదైన ఎస్‌యూ‌వి లెక్సస్ ఎల్‌ఎక్స్ 500ని లాంచ్ చేసింది. లెక్సస్ ఎల్‌ఎక్స్ 500 ఎస్‌యూ‌వి ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధర రూ. 2.82 కోట్లు. మూడు వేరియంట్‌లలో వస్తున్న లెక్సస్ ఎల్‌ఎక్స్ 500 ధర రూ. 2.83 కోట్లు (ఎక్స్-షోరూమ్). లెక్సస్ ఎల్‌ఎక్స్  500 ఇప్పుడు భారతదేశంలోని లగ్జరీ కార్‌ కంపెనీ ఎస్‌యూ‌వి లైనప్‌లో NX అండ్ RX వేరియంట్‌ల కంటే పైన ఉంటుంది. పాత LX మోడల్‌లా కాకుండా, LX 500 డీజిల్ పవర్‌ట్రెయిన్‌తో మాత్రమే లభిస్తుంది. 

అత్యంత ఖరీదైన ఎస్‌యూ‌వి
దీని ధర గురించి మాట్లాడితే  లెక్సస్ ఎల్‌ఎక్స్ 500 పాత జనరేషన్  ఎల్‌ఎక్స్ 570 మోడల్ కంటే దాదాపు రూ. 50 లక్షలు ఎక్కువ. భారత మార్కెట్లో టయోటా ఫార్చ్యూనర్ ఎస్‌యూ‌వి ధర రూ.32.58 లక్షల నుండి ప్రారంభమవుతుంది. 

Latest Videos

undefined

ఇంజిన్ పవర్ 
ఎల్‌ఎక్స్ 570 పెట్రోల్ ఇంజన్‌తో అందుబాటులో ఉండగా, కొత్త ఎల్‌ఎక్స్ 500 ఎస్‌యూ‌వి 3.3-లీటర్ ట్విన్-టర్బోచార్జ్డ్ V6 డీజిల్ ఇంజన్‌తో వస్తుంది. 10-స్పీడ్ ఆటోమేటిక్  గేర్ ట్రాన్స్‌మిషన్ యూనిట్‌తో లభిస్తుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 304 Bhp శక్తిని, 700 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. ఇంకా గరిష్టంగా 210 kmph స్పీడ్  ప్రయాణిస్తుంది. కేవలం 8 సెకన్లలో 0 నుండి 100 kmph వరకు స్పీడ్ అందుకోగలదు.

ఇంటీరియర్ అండ్ ఫీచర్లు
లెక్సస్ ఎల్‌ఎక్స్ 500లో లుక్స్ ఇంకా ఫీచర్లను అప్‌గ్రేడ్ చేసింది. ఇప్పుడు కొత్త స్పిండిల్ గ్రిల్‌  పొందుతుంది. 22-అంగుళాల అల్లాయ్ వీల్స్‌తో కూడిన కొత్త సెట్‌,2,850ఎం‌ఎం వీల్‌బేస్ కనీసం ఐదుగురు పెద్దలకు ఇంకా వారి లగేజీకి తగినంత స్థలాన్ని అందించే అవుట్‌గోయింగ్ మోడల్‌కు సమానంగా ఉంటుంది.

లెక్సస్ ఎల్‌ఎక్స్ 500 ఎస్‌యూ‌వి లోపలి భాగం కూడా రిడిజైన్ చేయబడింది. 64-రంగు యాంబియంట్ లైటింగ్ సిస్టమ్, రెండు వరుసలలో సీట్ల కోసం ఎలక్ట్రానిక్ అడ్జస్ట్, కొత్త డ్యూయల్-టోన్ ఇంటీరియర్‌ను పొందుతుంది. డాష్‌బోర్డ్‌లో 12.3-అంగుళాల డిజిటల్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ ఉంది, Apple CarPlay అండ్ Android Auto ఫంక్షన్‌లకు కూడా సపోర్ట్ చేస్తుంది. ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ క్రింద మరొక 7-అంగుళాల డిస్‌ప్లే ఉంది, దీని ద్వారా ఉష్ణోగ్రత అలాగే ఇతర కంట్రోల్స్ అడ్జస్ట్ చేయవచ్చు. 

ఈ SUV కొత్త ఎలక్ట్రానిక్ పవర్ స్టీరింగ్ సిస్టమ్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్‌తో కూడిన మల్టీ-ఫంక్షన్ స్టీరింగ్ వీల్, 360-డిగ్రీ కెమెరా, పనోరమిక్ సన్‌రూఫ్, ఇతర ఫీచర్లను కూడా పొందుతుంది. SUV మల్టీ-టెర్రైన్ మోడ్‌లను కూడా పొందుతుంది, ఇందులో డర్ట్, సాండ్, మడ్, డీప్ స్నో, రాక్ ఇంకా  ఆటో మోడ్ ఉన్నాయి, ఈ ఫీచర్స్ లెక్సస్ కారులో మొదటిది. దీనితో పాటు 7 డ్రైవ్ మోడ్‌లను కూడా పొందుతుంది - జనరల్, ఎకో, కంఫర్ట్, స్పోర్ట్, స్పోర్ట్ ఎస్, స్పోర్ట్ S+ ఇంకా కస్టమ్ ఉన్నాయి.

సేఫ్టీ పరంగా, కొత్త Lexus LX 500 ఎలక్ట్రానిక్ కంట్రోల్డ్ బ్రేక్‌లు (ECB), అడాప్టివ్ వేరియబుల్ సస్పెన్షన్, యాక్టివ్ హైట్ కంట్రోల్ సస్పెన్షన్, ఫింగర్ ప్రింట్ అథెంటికేషన్, రియర్ క్రాస్ ట్రాఫిక్ అలర్ట్, క్లియరెన్స్ సోనార్‌తో పాటు మీ మార్గంలోని వస్తువులను గుర్తించడానికి ఇతర ఫీచర్లను పొందుతుంది. 

click me!