ఇండియాలో లగ్జరీ కార్ బ్రాండ్ ఈ కార్ల ధరల పెంపు.. 3.2 శాతం వరకు ప్రకటన..

By asianet news telugu  |  First Published Jan 3, 2023, 11:05 PM IST

లెక్సస్ ఉత్పత్తి ఖర్చులు పెరగడం ఇంకా కరెన్సీ హెచ్చుతగ్గులు వంటి కారణాల వల్ల 500h, ఎల్‌ఎస్ 500h, ఎన్‌ఎక్స్ 350h, ఎస్ 300h వంటి హైబ్రిడ్ మోడల్‌ల ధరల పెంపుకు దారితీసిందని కంపెనీ తెలిపింది. 


జపనీస్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ లెక్సస్ అనుబంధ సంస్థ లెక్సస్ ఇండియా  కార్ల ధరలను 3.2 శాతం వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఉత్పత్తి ఖర్చులు పెరగడం ఇంకా కరెన్సీ హెచ్చుతగ్గులు వంటి కారణాల వల్ల 500h, ఎల్‌ఎస్ 500h, ఎన్‌ఎక్స్ 350h, ఎస్ 300h వంటి హైబ్రిడ్ మోడల్‌ల ధరల పెంపుకు దారితీసిందని కంపెనీ తెలిపింది. 

ఇప్పటికే వాహనాల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించిన ఇతర వాహన తయారీ కంపెనీలతో ఇప్పుడు లెక్సస్ కంపెనీ వచ్చి చేరింది. 

Latest Videos

undefined

లెక్సస్ ఇండియా ప్రెసిడెంట్ నవీన్ సోనీ మాట్లాడుతూ “మేము మా కస్టమర్లకు అద్భుతమైన లెక్సస్ కార్ల అనుభవాల ద్వారా ఇంకా మెరుగైన రేపటిని నిర్మించాలనే మా అంకితభావంతో వారికి వాల్యు అందించడం కొనసాగిస్తాము. కరెన్సీ హెచ్చుతగ్గుల కారణంగా ఈ ధరల పెంపు ప్రభావం చూపింది. లెక్సస్ ఇండియా లెక్సస్ లైఫ్ ప్రోగ్రామ్ ద్వారా సాటిలేని అనుభవాలను అందించడం కొనసాగిస్తుంది" అని అన్నారు.

ప్రస్తుతం, కార్‌ కంపెనీ ఎల్‌సి 500h, ఎల్‌ఎస్ 500h, ఎన్‌ఎక్స్ 350h, ఈ‌ఎస్ 300h అండ్ సరికొత్త ఆర్‌ఎక్స్ వంటి అనేక రకాల హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వాహనాలను అందిస్తోంది, వీటిని ఆటో ఎక్స్‌పో 2023లో భారత మార్కెట్‌లో పరిచయం చేస్తారు. 

మారుతీ సుజుకి, హ్యుందాయ్ ఇంకా టాటా మోటార్స్  సహా చాలా OEMలు వాహనాల ధరలను జనవరి 2023 నుండి పెంపుతున్నట్లు తాజాగా ప్రకటించాయి.

click me!