లెక్సస్ కంపెనీ ఎలక్ట్రిక్ కారు..ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే చాలు...

By Sandra Ashok KumarFirst Published Nov 23, 2019, 12:40 PM IST
Highlights

లెక్సస్ ఎలక్ట్రిఫైడ్ బ్యానర్ కింద తమ కంపెనీ మొదటి ఉత్పత్తిగా ఆల్-ఎలక్ట్రిక్ యుఎక్స్ 300e కారును ప్రవేశపెట్టింది. ఈ కారు అధిక-అవుట్పుట్ మోటారుతో, అధిక సామర్థ్యం గల బ్యాటరీతో రాబోతుంది. ఇవి క్యాబిన్ ఫ్లోర్ క్రింద అమర్చారు.
 

లెక్సస్ కంపెనీ యొక్క మొట్టమొదటి ఎలక్ట్రిక్ బ్యాటరీ వాహనం(BEV) UX 300e 2019 గువాంగ్‌జౌ ఇంటర్నేషనల్ ఆటోమొబైల్ ఎగ్జిబిషన్‌లో ప్రవేశపెట్టింది. లెక్సస్ కంపెనీ దీనిని ఎలక్ట్రిఫైడ్ బ్యానర్ కింద మొదటి ఉత్పత్తిగా పేర్కొంది.

also read ఎలక్ట్రిక్ కార్ల తయారీలో టెస్ల...కారు సంచలనం

ఆల్-ఎలక్ట్రిక్ యుఎక్స్ 300e అధిక-అవుట్పుట్ మోటారుతో, అధిక సామర్థ్యం గల బ్యాటరీతో వస్తుంది. వీటిని క్యాబిన్ ఫ్లోర్ క్రింద అమర్చారు. ఇక దీని మైలేజ్ పరిధిని 402 కి.మీ. ఉంటుందని పేర్కొన్నారు.లెక్సస్ యుఎక్స్ 300e వివరాలు చూస్తే  ఇది 201 బిహెచ్‌పి, 300nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 

లెక్సస్ యుఎక్స్ 300e యుఎక్స్ కంటే భిన్నంగా కనిపించదు కాని ఇది ఆల్-ఎలక్ట్రిక్. యుఎక్స్ 300e సైలెంట్ క్యాబిన్లలో ఒకటిగా ఉంటుందని కంపెనీ చెబుతోంది. వాహనం నడుపుతున్నపుడు  వచ్చే  సౌండ్ ని ఇంజనీర్లు గమనించారు. యాక్టివ్ సౌండ్ కంట్రోల్ (ASC) డ్రైవింగ్ సిస్టమ్ ద్వారా సహజమైన, పరిసర సౌండ్లను, పరిస్థితులను డ్రైవర్ మరియు ప్రయాణీకులకు తెలియజేస్తుంది.

also read  బీఎస్-6 పెట్రోల్ వెర్షన్‌లో బ్రెజ్జా, ఎస్-క్రాస్ కొత్త మోడళ్లు

డ్రైవ్ మోడ్ సెలెక్ట్ ఫంక్షన్ ఫీచర్  డ్రైవర్ కి అనుగుణంగా సున్నితమైన ఆక్సీలరేషన్ చేయడానికి అనువుగా ఉంటుంది.  ఆక్సీలరేటర్ పెడల్ను నొక్కినప్పుడు ఇన్స్టంట్  టార్క్ అందిస్తుంది. ఇంకా శక్తివంతమైన బ్రేకింగ్ కూడా ఉంది - అన్ని రోడ్లపై సహజమైన ఆన్-రోడ్ అనుభూతిని పొందుతారు. 

యుఎక్స్ 300e కార్ అత్యధునిక కనెక్ట్  టెక్నాలజీతో  రాబోతుంది. లెక్సస్ లింక్ యాప్ ఉపయోగించి స్మార్ట్‌ఫోన్‌కు లింక్ చేయడం ద్వారా బ్యాటరీ ఛార్జ్ మరియు డ్రైవింగ్ మైలేజ్ చెక్ చూసుకోవచ్చు. టైమర్ వంటివి ఛార్జింగ్ ఎప్పుడు చేయాలో కూడా సూచిస్తుంది.  

click me!