మార్కెట్లోకి ‘బజాజ్’ కేటీఎం 125 డ్యూక్‌ @ రూ.1.18 లక్షలే

By sivanagaprasad kodati  |  First Published Nov 27, 2018, 8:52 AM IST

బజాజ్ అనుబంధ ఆస్ట్రియా సంస్థ కేటీఎం డిజైన్ చేసిన సరికొత్త మోటార్ బైక్ ‘కేటీఎం డ్యూక్ 125’ భారత మార్కెట్లోకి అడుగు పెట్టింది. కాస్త ఖరీదైన బైక్ అయినప్పటికీ బజాజ్ పల్సర్, యమహా ఆర్‌15 వీ3.0, టీవీఎస్‌ అపాచీ ఆర్‌టీఆర్‌ 200లతోనూ ఢీ కొట్టే సామర్థ్యం గలది. 


భారత్‌లో కేటీఎం 125 డ్యూక్‌ మోటార్‌సైకిల్‌ను బజాజ్‌ ఆటో విడుదల చేసింది. దీని ధర రూ.1,18,163గా నిర్ణయించారు. ఆస్ట్రియా కంపెనీ కేటీఎంలో బజాజ్‌ ఆటోకు 49 శాతం వాటా ఉంది. బజాజ్‌కు చెందిన చకన్‌ ప్లాంట్‌లోనే కేటీఎం బైక్‌లు తయారవుతున్నాయి.

6- స్పీడ్‌ ట్రాన్స్‌మిషన్‌, సింగిల్‌ సిలిండర్‌ 124.7 సీసీ ఇంజిన్‌ కలిగిన ఈ బైక్ గరిష్ఠంగా 14.5 పాస్కల్స్‌ శక్తిని అందించగలదు. ప్రమాణాల్లో ఎబీఎస్ స్థాయితో కూడిన కేటీఎం డ్యూక్ 125 భారతదేశంలోనే అత్యంత ఖరీదైన మోటార్ బైక్‌గా నిలువనున్నది.

Latest Videos

undefined

125 డ్యూక్‌ మోడల్‌తో కేటీఎం బ్రాండ్‌ మరింత దూసుకెళ్తుందని బజాజ్‌ ఆటో అధ్యక్షుడు (ప్రోబైకింగ్‌) అమిత్‌ నంది పేర్కొన్నారు. యమహా ఆర్‌15 వీ3.0, టీవీఎస్‌ అపాచీ ఆర్‌టీఆర్‌ 200, బజాజ్‌ పల్సర్‌ ఎన్‌200లతో 125 డ్యూక్‌ పోటీపడే అవకాశం ఉంది.

ఆరెంజ్, వైట్, బ్లాక్ వేరియంట్లలో కేటీఎం 125 డ్యూక్ వినియోగదారులకు అందుబాటులోకి రానున్నది. 17 అంగుళాల అల్లాయ్ వీల్స్ ప్లస్ 110/70 , 150/60 ఎంఆర్ఎఫ్ ఆర్ఈజడ్- ఎఫ్ సీ టైర్స్ కూడా అదనపు ఆకర్షణ కానున్నాయి. 10.2 లీటర్ల నిల్వ సామర్థ్యం గల ఫ్యూయల్ ట్యాంక్ కూడా ఇందులో ఏర్పాటు చేశారు. 

బజాజ్ పల్సర్ మోడల్ బైక్‌తోనే కేటీఎం డ్యూక్ 125 పోటీ పడుతున్న ఖరీదు ఎక్కువ. బజాజ్ పల్సర్ ధర కేవలం రూ.65 వేలు మాత్రమే కాదు సిటీ కస్టమర్లను లక్ష్యంగా తయారు చేసిన మోడల్. ఒకవేళ కేటీఎం 125 డ్యూక్ సక్సెస్ అయితే 125 సీసీ సామర్థ్యం గల దాని అనుబంధ మోడల్స్ డ్యూక్ 200, డ్యూక్ 390 మోటార్ బైక్‌లు కూడా త్వరలో మార్కెట్లోకి రానున్నాయి.

జనరల్‌ మోటార్స్‌లో 14,700 మంది తొలగింపు!
అమెరికాలో అతిపెద్ద ఆటోమొబైల్‌ కంపెనీ జనరల్‌ మోటార్స్‌ (జీఎం) భారీ ఎత్తున వ్యయాలను తగ్గించుకోవాలని నిర్ణయించింది. ఈ ఏడాది చివరినాటికి 600 కోట్ల డాలర్లు పొదుపు చేసే చర్యల్లో భాగంగా ఉత్తర అమెరికాలో 14,700 మందిని కంపెనీ తొలగించనుంది.

వీరిలో 8,100 మంది వైట్‌ కాలర్‌ వర్కర్లు కూడా ఉన్నారు. ఐదు ప్లాంట్లను కూడా మూసివేసే అవకాశం ఉన్నట్టు కంపెనీ చెబుతోంది. వ్యయాలను తగ్గించుకోవడమేకాకుండా అటానమస్‌, ఎలక్ర్టిక్‌ వాహనాల తయారీపై కంపెనీ దృష్టిసారిస్తోంది.
 

click me!