హైదరాబాద్ మార్కెట్లోకి హీరో ‘డెస్టినీ స్కూటర్’

By sivanagaprasad kodati  |  First Published Nov 17, 2018, 10:18 AM IST

స్కూటర్ల పరిధిని మరింత పెంచుకోవాలనే ఉద్దేశంతో ప్రముఖ మోటార్ సైకిళ్ల తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ మార్కెట్లోకి నూతన డెస్టినీని అందుబాటులోకి తెచ్చింది. 125 సీసీ సామర్థ్యంతో రూపొందించిన ఈ స్కూటర్ రెండు రకాల్లో లభించనున్నది.


స్కూటర్ల పరిధిని మరింత పెంచుకోవాలనే ఉద్దేశంతో ప్రముఖ మోటార్ సైకిళ్ల తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ మార్కెట్లోకి నూతన డెస్టినీని అందుబాటులోకి తెచ్చింది. 125 సీసీ సామర్థ్యంతో రూపొందించిన ఈ స్కూటర్ రెండు రకాల్లో లభించనున్నది. వీటిలో ఎల్‌ఎక్స్ రకం రూ.56,250, వీఎక్స్ మోడల్ రూ.59,500లకు లభించనున్నది. 

ఐ3ఎస్ టెక్నాలజీతో ట్రాఫిక్ సమయంలో నిలిచిపోనున్న డెస్టినీఐ3ఎస్ టెక్నాలజీతో రూపొందించిన ఈ స్కూటర్ ట్రాఫిక్ సమయంలో దానంతటదే ఆగిపోనున్నది. దీంతో పది శాతం వరకు ఇంధనం ఆదా కానున్నది.

Latest Videos

undefined

సైడ్ స్టాండ్‌ను అలాగే ఉంచి వాహనాలు నడుపుతూ ప్రమాదాల బారీన పడుతున్న వారికి ప్రయోజనం కల్గించేలా అలర్ట్ హారన్ వచ్చే విధంగా దీంట్లో నూతన టెక్నాలజీని పొందుపరిచినట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి.

కాలుష్యానికి నష్టంతో వోక్స్‌ వ్యాగన్‌కు రూ.100 కోట్ల జరిమానా
ఉద్ఘారాల మోసంలో జర్మనీ కార్‌ మేకర్ వోక్స్‌ వ్యాగన్‌కు జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ) రూ.100 కోట్ల జరిమానా విధించింది. వెంటనే ఆ మొత్తాన్ని కాలుష్య నియంత్రణ మండలి వద్ద డిపాజిట్ చేయాలని ఆదేశించింది.

డీజిల్ కార్ల ఉద్ఘార పరీక్షల సమయంలో మోసపూరిత పరికరాన్ని ఉపయోగించిందని ఎన్‌జీటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్‌జీటీ ఛైర్మన్‌ ఆదర్శ్‌ కుమార్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ తీర్పు వెలువరించింది. 

పర్యావరణానికి జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు కాలుష్య నియంత్రణ మండలి, భారీ పరిశ్రమ మంత్రిత్వ శాఖ, పర్యావరణ మంత్రిత్వ శాఖకు చెందిన అధికారులు, ఆటోమోటివ్ రిసెర్చ్ అసోసియేషన్ ఆఫ్‌ ఇండియాతో కలిసి ఎన్‌జీటీ ఓ కమిటీని నియమించింది. నెలలోగా నివేదిక ఇవ్వాలని కమిటీకి సూచించింది. దానిపై ఏదైనా వివరణ ఇచ్చుకోవాలంటే వారంలో ధర్మాసనం ముందు హాజరుకావాలని వోక్స్‌ వ్యాగన్‌కు స్పష్టం చేసింది. 

టీచర్‌తోపాటు మరికొందరి పిటిషన్ పై ఎన్జీటీ ఇలా తీర్పు
ఉద్ఘారాల నిబంధనలను ఉల్లఘించిన ఫోక్స్ వ్యాగన్‌ కార్లను నిషేధించాలంటూ ఓ పాఠశాల టీచర్‌, మరికొందరు దాఖలు చేసిన పిటిషన్‌ను పరిశీలించిన ఎన్‌జీటీ ఈ తీర్పు వెలువరించింది. ఉద్ఘారాల పరీక్షలను తప్పించుకోవడానికి మోసపూరిత డీజిల్ పరికరాన్ని వాడిన 3.23 లక్షల కార్లను వెనక్కి పిలవడానికి కావాల్సిన రోడ్ మ్యాప్‌ను గతంలో ఆ కంపెనీ ఎన్‌జీటీకి సమర్పించింది.

click me!