దక్షిణ కొరియా ఆటో మేజర్ కియా మోటార్స్ విపణిలో ఆవిష్కరించిన సెల్టోస్ మోడల్ కారు సేల్స్ ఇప్పట్లో బ్రేక్ అయ్యేలా కనిపించడం లేదు. ఆగస్టులో విడుదలైన ఈ కారు విక్రయాలు 26,840 యూనిట్లు నమోదు కావడం విశేషం.
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాల్లో దక్షిణ కొరియా ఆటోమొబైల్ మేజర్ హ్యుండాయ్ అనుబంధ సంస్థ కియా మోటార్స్ ఇటీవలే ‘సెల్టోస్’ మోడల్ కారును విపణిలో ఆవిష్కరించింది. అందుకు అనుగుణంగానే కియో సెల్టోస్ మోడల్ కారు విక్రయాల్లో దూసుకు వెళుతోంది.
also read ఫెస్టివ్ స్పార్క్ మిస్సింగ్.... బీఎస్6 ఎఫెక్టేనా?!
undefined
వివిధ వేరియంట్లలో ఈ మోడల్ కారును కియా మోటార్స్ వినియోగదారుల ముంగిట్లోకి తీసుకొచ్చింది. దీంతో ఈ కారుకు వినియోగదారుల్లో పెరిగిన క్రేజ్ అంతా ఇంతా కాదు. రికార్డు స్థాయిలో కియో సెల్టోస్ కార్ల విక్రయాలు జరిగాయి. ఆగస్టు 22వ తేదీన కియా మోటార్స్ తన సెల్టోస్ మోడల్ కారును విపణిలో ఆవిష్కరించింది. నాటి నుంచి ఇప్పటి వరకు ఇంతింతై వటుడింతై అన్నట్లు సెల్టోస్ కార్ల విక్రయాలు దూసుకెళ్తున్నాయి.
ఆగస్టు నెలలోనే కియా మోటార్స్ 6236 సెల్టోస్ కార్లను విక్రయించగా, సెప్టెంబర్ నెలలో 7754 కార్లు అమ్ముడు పోయాయి. ఇక అక్టోబర్ నెలలో పండుగల సీజన్ సందర్భంగా రికార్డు స్థాయిలో 12,800 కార్లు అమ్ముడు పోయాయని కియా మోటార్స్ తెలిపింది.
also read మహీంద్రా XUV 300 రీకాల్ : సస్పెన్షన్ భాగాలే కారణం
దేశమంతటా ఆటోమొబైల్ రంగం సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ప్రస్తుత తరుణంలో కార్ల విక్రయాలు రికార్డు స్థాయిలో జరుగుతుండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది. హ్యుండాయ్ క్రెటా, ఎంజీ హెక్టార్, టాటా హారియర్, మహీంద్రా ఎక్స్ యూవీ 500, జీప్ కంపాస్ వంటి ఎస్‌యూవీ మోడల్ కార్లు రికార్డు స్థాయిలో అమ్మకాలు జరుగుతున్నాయి. ఈ సంస్థల నుంచి వచ్చే సవాళ్లను అధిగమించి మరీ కియా మోటార్స్ సెల్టోస్ మోడల్ కార్లు 26,840 యూనిట్లు విక్రయించగలగడం విశేషం.