జీప్ మొట్టమొదటి ఆల్-ఎలక్ట్రిక్ ఎస్‌యూ‌వి.. లేటెస్ట్ టెక్నాలజితో మరిన్ని ఫీచర్లు కూడా..

By asianet news telugu  |  First Published Mar 2, 2022, 1:56 PM IST

జీప్  మాతృ సంస్థ స్టెలాంటిస్ సి‌ఈ‌ఓ కార్లోస్ తవారెస్ మాట్లాడుతూ రానున్న ఆల్-ఎలక్ట్రిక్ ఎస్‌యూ‌వి లైఫ్‌స్టైల్ ఫ్యామిలీ వెహికల్‌గా ఉంటుందని తెలిపారు. అంటే ప్యూర్ ఆఫ్-రోడ్ జీప్ అవుతుందని కూడా  చెప్పారు.


ఎస్‌యూ‌విల తయారీకి ప్రసిద్ధి చెందిన ప్రముఖ అమెరికన్ ఆటోమొబైల్ తయారీ సంస్థ జీప్ మొట్టమొదటి ఆల్-ఎలక్ట్రిక్ ఎస్‌యూ‌విని పరిచయం చేసింది. అయితే కారు కంపెనీ సిగ్నేచర్ డిజైన్ అంశాలతో కనిపిస్తుంది. 2023 ప్రథమార్థంలో ఫుల్ ఎలక్ట్రిక్ జీప్ ఎస్‌యూవీని అంతర్జాతీయ మార్కెట్‌లో విడుదల చేస్తామని స్టెల్లాంటిస్ (stellantis) తెలిపింది. ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూ‌వి ఎస్‌టిఎల్ఏ ఆర్కిటెక్చర్‌పై ఆధారపడి ఉంటుందని తెలిపింది.

లైఫ్‌స్టైల్ ఫ్యామిలీ ఈ‌వి
జీప్  మాతృ సంస్థ స్టెలాంటిస్ సి‌ఈ‌ఓ కార్లోస్ తవారెస్ మాట్లాడుతూ రానున్న ఆల్-ఎలక్ట్రిక్ ఎస్‌యూ‌వి లైఫ్‌స్టైల్ ఫ్యామిలీ వెహికల్‌గా ఉంటుందని తెలిపారు. అంటే ప్యూర్ ఆఫ్-రోడ్ జీప్ అవుతుందని కూడా  చెప్పారు. అంతేకాకుండా 2024లో కంపెనీ పోర్ట్‌ఫోలియోలో మరో జీప్ ఈ‌వి కూడా చేరనుంది. అయితే ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ పేరును మాత్రం వెల్లడించలేదు.

Latest Videos

undefined

లుక్ అండ్ డిజైన్
జీప్ ఎలక్ట్రిక్ ఎస్‌యూ‌వి డిజైన్ ఇప్పటికే ఉన్న జీప్ కంపాస్‌ను పోలి ఉంటుంది. దీనికి ఎల్‌ఈ‌డి హెడ్‌ల్యాంప్‌లు, ఇంటిగ్రేటెడ్ ఎల్‌ఈ‌డి డేటైమ్ రన్నింగ్ లైట్లను పొందుతుంది. బంపర్‌లో బ్లాక్ మెష్ గ్రిల్ ఇచ్చారు, స్కిడ్ ప్లేట్ కూడా కనిపిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూ‌వి  సైడ్ ప్రొఫైల్ గురించి చెప్పాలంటే డ్యూయల్-టోన్ బాడీ పెయింట్, స్పోర్టీ అల్లాయ్ వీల్స్, మందపాటి బ్లాక్ క్లాడింగ్ పొందుతుంది. దీని  బోల్డ్ లుక్ మరింత ఆకర్షణీయంగా చేస్తాయి. వెనుక ప్రయాణీకుల కోసం డోర్ హ్యాండిల్‌బార్లు సి పిల్లర్‌పై ఉంటాయి.

క్యాబిన్ అండ్ ఫీచర్లు
ఎస్‌యూ‌వికి కనిపించే టెయిల్‌గేట్, రూఫ్ స్పాయిలర్, ర్యాప్‌రౌండ్ ఎల్‌ఈ‌డి టెయిల్‌లైట్లు, స్కిడ్ ప్లేట్‌లతో కూడిన ఆకర్షణీయమైన బ్లాక్ బంపర్ ఇచ్చారు. కార్ల తయారీ సంస్థ క్యాబిన్ గురించి ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. అయితే ఎన్నో ఫీచర్లు, అధునాతన టెక్నాలజితో వస్తుందని భావిస్తున్నారు.

గొప్ప పరిధి
రానున్న ఎలక్ట్రిక్ ఎస్‌యూ‌వి  టెక్నాలజి ఫీచర్స్ గురించి జీప్ ఇంకా చాలా వెల్లడించలేదు. అయితే ఈ ప్రీమియమ్ ఎలక్ట్రిక్ ఎస్‌యూ‌వి ఒకసారి ఫుల్ ఛార్జ్ చేసిన తర్వాత గొప్ప క్రూజింగ్ రేంజ్‌ను అందిస్తుందని భావిస్తున్నారు.
 

click me!