చాలా వరకు ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్‌లలో రిమూవబుల్ బ్యాటరీ ఆప్షన్ లేదు. ఆటోమొబైల్ తయారీ సంస్థలు నాన్-రిమూవబుల్ బ్యాటరీలను అందించడానికి అనుకూలంగా వాదిస్తున్నారు, ఎందుకంటే ఛార్జింగ్ కోసం బ్యాటరీలను తీయాల్సిన అవాంతరాన్ని నివారిస్తాయి.
డ్రైవింగ్ పరిధికి సంబంధించిన పరిమితుల కారణంగా ఎలక్ట్రిక్ స్కూటర్లు హైవేపై డ్రైవింగ్ చేయడానికి అనువైనవిగా పరిగణించవు. కానీ సింపుల్ ఎనర్జీ మంగళవారం సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం అదనపు బ్యాటరీ ప్యాక్‌ను లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది, ఇప్పుడు దీని ఛార్జ్ రేంజ్ 300 కి.మీలకు పైగా ఉంటుంది.
అదనపు బ్యాటరీ ప్యాక్
సింపుల్ వన్ అనువైన పరిస్థితుల్లో 236 కి.మీల డ్రైవింగ్ పరిధిని అందించగలదని పేర్కొంది. కానీ ఈ అదనపు 1.6 kWh బ్యాటరీ ప్యాక్‌తో పాటు డ్రైవింగ్ పరిధిని మరింత పెంచుతుంది. ఈ బ్యాటరీని ఎలక్ట్రిక్ స్కూటర్ బూట్‌లో ఉంచవచ్చు అని కంపెనీ తెలిపింది.
undefined
బ్యాటరీ ఆప్షన్
చాలా వరకు ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్‌లలో రిమూవబుల్ బ్యాటరీ ఆప్షన్ లేదు. ఆటోమొబైల్ తయారీ సంస్థలు నాన్-రిమూవబుల్ బ్యాటరీలను అందించడానికి అనుకూలంగా వాదిస్తున్నారు, ఎందుకంటే ఛార్జింగ్ కోసం బ్యాటరీలను తీయాల్సిన అవాంతరాన్ని నివారిస్తాయి. అయితే ఇతర తయారీదారుల లాగానే సింపుల్ ఎనర్జీ ఎలక్ట్రిక్ స్కూటర్లలో రిమూవబుల్ బ్యాటరీ ఆప్షన్ అందిస్తుంది, వాటిని సౌలభ్యం ప్రకారం తీయవచ్చు ఇంకా ఛార్జ్ చేయవచ్చు.
మోటార్ అండ్ ఫీచర్లు
సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ 72 Nm టార్క్‌ను ఉత్పత్తి చేసే అప్‌గ్రేడ్ 8.5 kW మోటార్‌తో వస్తుంది. దీనికి ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్ కూడా అందించారు. అలాగే 30-లీటర్ బూట్ స్పేస్ అండ్ ఆన్-బోర్డ్ నావిగేషన్, రైడింగ్ మోడ్, ఫోన్ యాప్, కాల్ అండ్ మ్యూజిక్ కంట్రోల్ వంటి ఎన్నో స్మార్ట్ ఫీచర్లు ఉన్నాయి.
ధర
సింపుల్ వన్ ప్రైమరీ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 1.09 లక్షలు. కానీ అదనపు బ్యాటరీ ప్యాక్ ఉన్న వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ.1.45 లక్షలుగా నిర్ణయించారు. దీని బుకింగ్ చార్జ్ రూ.1,947. కంపెనీ ప్రకారం, సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ తమిళనాడులోని హోసూర్‌లోని కంపెనీ ప్లాంట్‌లో ఉత్పత్తి చేయనుంది. ప్లాంట్ వార్షిక ఉత్పత్తి సామర్థ్యాన్ని 1 మిలియన్ యూనిట్ల వరకు ఉంది. రాబోయే వారాల్లో ఉత్పత్తి కార్యకలాపాలు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉంది.
పోటీ
భారతదేశంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల డిమాండ్ ఇటీవలి కాలంలో గణనీయంగా పెరిగింది. దీని కారణంగా హీరో ఎలక్ట్రిక్ (hero electric), ఏథర్ ఎనర్జీ (ather energy), ఒకినావా ఆటోటెక్ (okinava automatic) వంటి వాటితో సింపుల్ ఎనర్జీ ఎలక్ట్రిక్ స్కూటర్ పోటీపడుతుంది.