లైసెన్స్, రిజిస్ట్రేషన్ అవసరం లేకుండా హీరో సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌.. ఫీచర్లు, ధర తెలుసుకోండి

By asianet news telugu  |  First Published Mar 1, 2022, 5:01 PM IST

తక్కువ దూర ప్రయాణ అవసరాలను తీర్చేందుకు స్టైలిష్ రైడ్ ఆప్షన్ కోసం చూస్తున్న కస్టమర్ల కోసం కంపెనీ ప్రత్యేకంగా ఈ వాహనాన్ని రూపొందించింది. హీరో ఎడ్డీ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎక్స్-షోరూమ్ ధర రూ.72,000.


ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో ఎలక్ట్రిక్ (hero electric) కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ హీరో ఎడ్డీ (hero eddy)ని మంగళవారం విడుదల చేసింది. తక్కువ దూర ప్రయాణ అవసరాలను తీర్చేందుకు స్టైలిష్ రైడ్ ఆప్షన్ కోసం చూస్తున్న కస్టమర్ల కోసం కంపెనీ ప్రత్యేకంగా ఈ వాహనాన్ని రూపొందించింది. హీరో ఎడ్డీ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎక్స్-షోరూమ్ ధర రూ.72,000. సింపుల్ ఇంకా స్టైలిష్ బాడీ డిజైన్‌ ఫీచర్‌లతో నిండిన హీరో ఎడ్డీ ప్రయాణీకులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తుంది.

లైసెన్స్, రిజిస్ట్రేషన్ అవసరం లేదు
ప్రత్యేకమైన విషయం ఏమిటంటే హీరో ఎడ్డీ వాహనానికి రిజిస్ట్రేషన్ చేయవలసిన అవసరం లేదు. అలాగే డ్రైవింగ్ చేయడానికి డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేదు. ఎందుకంటే హీరో ఎడ్డీ అనేది లో-స్పీడ్ స్కూటర్. హీరో ఎడ్డీ ఎలక్ట్రిక్ స్కూటర్ రెండు కలర్ ఆప్షన్లలో అందుబాటులోకి వచ్చింది. వీటిలో పసుపు, లేత నీలం రంగు ఉన్నాయి.

Latest Videos

undefined

అందుబాటులో ఉన్న ఫీచర్లు
హీరో ఎడ్డీ తక్కువ దూరాలకు ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనం కావాలనుకునే కస్టమర్ల కోసం రూపొందించబడింది. అయితే, ఎలక్ట్రిక్ స్కూటర్ మైలేజ్ పరిధిని వెల్లడించలేదు. అయితే ఈ ఉత్పత్తి ఫైండ్ మై బైక్, ఈ-లాక్, లార్జ్ బూట్ స్పేస్, ఫాలో మీ హెడ్‌ల్యాంప్స్, రివర్స్ మోడ్ వంటి ఫీచర్లతో వస్తుందని కంపెనీ వెల్లడించింది. 

హీరో ఎలక్ట్రిక్ కాలుష్య నిరోధకంగా ఉత్పత్తి. హీరో ఎలక్ట్రిక్ ఎం‌డి నవీన్ ముంజాల్ మాట్లాడుతూ, “హీరో  ఉత్పత్తి హీరో ఎడ్డీ(Hero AD)ని ప్రకటించినందుకు మేము సంతోషిస్తున్నాము. ఈ స్కూటర్ అద్భుతమైన ఆన్-రోడ్ ఉనికిని అందిస్తుంది. ఈ స్కూటర్ కార్బన్ రహిత భవిష్యత్తుకు సహకరించే మా వ్యక్తిగత ప్రయత్నాలను దృష్టిలో ఉంచుకుని అనుభవపూర్వకంగా రూపొందించబడింది. సౌలభ్యం,  సౌకర్యాన్ని అందిస్తూనే హీరో  ఎడ్డీ సరైన ప్రత్యామ్నాయ చలనశీలత ఎంపిక అవుతుందని మేము విశ్వసిస్తున్నాము."అని అన్నారు.

హీరో ఎలక్ట్రిక్ భారతదేశంలోని ఎలక్ట్రిక్ టూ-వీలర్ స్పేస్‌లో పవర్ ప్లేయర్ అలాగే ఉత్పత్తులకు పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి లూథియానాలోని ప్లాంట్‌లో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుతున్నట్లు ఇటీవల ప్రకటించింది. హీరో కంపెనీకి దేశవ్యాప్తంగా 750కి పైగా సేల్స్ మరియు సర్వీస్ అవుట్‌లెట్‌లు ఉన్నాయి. ఇంకా వినియోగదారుల కోసం ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి కృషి చేస్తోంది. హీరో ఎలక్ట్రిక్ ఇప్పటివరకు దేశంలో దాదాపు 4.5 లక్షల యూనిట్ల వివిధ ఎలక్ట్రిక్ మోడళ్లను విక్రయించింది.

click me!