జావా 42 బాబర్ బైక్ ని కొనాలనుకునే కస్టమర్‌లు టెస్ట్ రైడ్‌ని కూడా తీసుకోవచ్చు, అయితే వచ్చే వారం నుండి Jawa Yezdi డీలర్‌షిప్‌లలో అందుబాటులో ఉంటుంది.
జావా యెజ్డీ మోటార్‌సైకిల్స్ భారత మార్కెట్లో కొత్త జావా 42 బాబర్‌ను లాంచ్ చేసింది. జావా 42 బాబర్ బైక్ ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధర 2.06 లక్షలుగా నిర్ణయించగా, టాప్-ఎండ్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర 2.09 లక్షలు. ఈ బైక్ మూడు వేరియంట్‌లలో వస్తుంది, ఈ మూడింటి మధ్య తేడా పెయింట్ స్కీమ్ మాత్రమే. ఈ ధర వద్ద జావా 42 బాబర్ భారతీయ మార్కెట్లో అత్యంత బడ్జెట్ బాబర్-స్టైల్ బైక్. జావా 42 బాబర్ బైక్ ని కొనాలనుకునే కస్టమర్‌లు టెస్ట్ రైడ్‌ని కూడా తీసుకోవచ్చు, అయితే వచ్చే వారం నుండి Jawa Yezdi డీలర్‌షిప్‌లలో అందుబాటులో ఉంటుంది. అలాగే డెలివరీలు కూడా ప్రారంభమవుతాయని కంపెనీ తెలిపింది.
కలర్ ఆప్షన్స్
జావా 42 బాబర్ మూడు కలర్స్ ఆప్షన్స్ లో పరిచయం చేసింది. అందులో మిస్టిక్ కాపర్, మూన్‌స్టోన్ వైట్ అండ్ డ్యూయల్-టోన్ జాస్పర్ రెడ్ పెయింట్ స్కీమ్‌లు ఉన్నాయి. జావా 42 బాబర్ డిజైన్ ఇంకా స్టైలింగ్‌లో మార్పు లేదు, కానీ బైక్ ఎర్గోనామిక్ అండ్ టెక్నాలజి మెరుగుదలను చేసింది.
undefined
ధర ఎంత:
కలర్ ధర (రూ.)
మిస్టిక్ కాపర్ 2,06,500
మూన్‌స్టోన్ వైట్ 2,07,500
జాస్పర్ రెడ్ (డ్యూయల్ టోన్) 2,09,187
బాబర్ క్రేజ్
42 బాబర్ జావా లైనప్‌లో రెండవ బాబర్ స్టైల్ బైక్. అయితే ఇప్పటికే ఈ లైనప్‌లో జావా పెరాక్ కూడా ఉంది. ప్రాక్టికాలిటీ లేకపోవడంతో పెరక్ పెద్దగా విక్రయించలేదు. కానీ ఇప్పటికీ బాబర్ స్టయిల్ క్రేజ్ చెక్కుచెదరకుండా ఉంది. పెరాక్‌ని కొనడానికి బడ్జెట్ లేని వారికి లేదా అప్పుడప్పుడు వీకెండ్ రైడింగ్ కోసం బాబర్ బైక్‌ను కొనుగోలు చేయాలనుకునే వారికి 42 బాబర్ ఒక గొప్ప ఆప్షన్.
లుక్ అండ్ డిజైన్
Jawa 42 Bobber మినిమలిస్టిక్ బాడీవర్క్, చిన్న ఫెండర్లు, లో సింగిల్ సీట్, లావు టైర్లు, ప్రత్యేకమైన పెయింట్ స్కీమ్‌ను పొందుతుంది. బైక్ హెడ్‌ల్యాంప్ ఇప్పటికీ రౌండ్ యూనిట్‌గా ఉంది, ఇది మంచి విషయం. కొత్త హ్యాండిల్‌బార్, కొత్త ఫ్యూయెల్ ట్యాంక్, క్లాక్ కన్సోల్ ఇంకా కొత్త సీటు లభిస్తుంది.
కొత్త ఫ్యూయెల్ ట్యాంక్‌కి రెట్రో టచ్ కోసం ట్యాంక్ ప్యాడ్‌లు ఉంటుంది. ఇది ట్యాంక్‌పై పట్టును సృష్టించేందుకు రైడర్‌కు సహాయపడుతుంది. బైక్ పెయింట్ స్కీమ్ ప్రత్యేకంగా కనిపించేలా చేయడానికి ఫెండర్‌లు, సైడ్ ప్యానెల్‌లు గ్లోస్ బ్లాక్‌లో ఉంటాయి.
ఇంజిన్ పవర్
334cc ఇంజిన్ 42 బాబర్‌లో అందించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 30.64 PS శక్తిని, 32.74 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్‌కు 6-స్పీడ్ గేర్‌బాక్స్ ఇచ్చారు. జావా బాబర్ కోసం సస్పెన్షన్ సెటప్‌ను కూడా మార్చింది.