ఎలక్ట్రిక్ బైక్‌లు, స్కూటర్లు, కార్లు చూశారు.. కానీ గాల్లో ఎగిరే ఎలక్ట్రిక్ ప్లేన్ చూసారా.. ?

By asianet news telugu  |  First Published Oct 1, 2022, 2:40 PM IST

30 నిమిషాల ఛార్జింగ్ తర్వాత ఎలిస్ విమానం తొమ్మిది మంది ప్రయాణికులతో గంట నుండి రెండు గంటల పాటు ప్రయాణించగలదు. సాధారణ విమానాలలో విమాన ఇంధనంతో పనిచేసే ఇంజన్లు ఉంటాయి. 


ప్రపంచంలోనే తొలి ఎలక్ట్రిక్ విమానం ఆకాశంలో విజయవంతంగా ఎగిరింది. ఈ జీరో ఎమిషన్ విమానం 3500 అడుగుల ఎత్తులో ఎనిమిది నిమిషాల పాటు ప్రయాణించింది.

సామర్థ్యం ఏమిటి
మీడియా నివేదికల ప్రకారం, విమానంలో 640 కిలోవాట్ల మోటారు అమర్చారు. ఈ మోటారును ఎలక్ట్రిక్ వెహికిల్ లేదా ఫోన్ వంటి బ్యాటరీ టెక్నాలజితో ఛార్జ్ చేయవచ్చు. 30 నిమిషాల ఛార్జింగ్ తర్వాత ఎలిస్ విమానం తొమ్మిది మంది ప్రయాణికులతో గంట నుండి రెండు గంటల పాటు ప్రయాణించగలదు. సాధారణ విమానాలలో విమాన ఇంధనంతో పనిచేసే ఇంజన్లు ఉంటాయి. విమానం నడుపుతున్నప్పుడు ఈ ఇంధనం మండుతుంది ఇంకా పర్యావరణం కలుషితం అవుతుంది. కానీ విద్యుత్తుతో ఛార్జ్ చేసిన తర్వాత ఈ విద్యుత్ విమానం ఎగురుతుంది ఇంకా కాలుష్యనికి హాని కలిగించదు.

Latest Videos

undefined

స్పీడ్
ఎలెక్ట్రిక్ ఎయిర్‌క్రాఫ్ట్ ఎలిస్ గరిష్టంగా 250 నాట్లు లేదా 287 mph క్రూయిజ్ స్పీడ్ ఉంటుంది. సాధారణ విమానాలలో ఒకటైన బోయింగ్ 737 టాప్ క్రూయిజ్ స్పీడ్ 588 mph.

ఎలక్ట్రిక్ విమానాన్ని తయారు చేసిన కంపెనీ?
ఏవియేషన్ అనే కంపెనీ ఎలక్ట్రిక్ ప్లేన్‌కి సంబంధించిన నమూనాను తయారు చేసింది. ఈ కంపెనీ ఇజ్రాయెల్‌కు చెందినది. అమెరికాలోని వాషింగ్టన్ గ్రాంట్ కంట్రీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ఈ విమానం టెస్ట్ ఫ్లైట్ జరిగింది.

ఫ్యూచర్ ప్లాన్ ఏమిటి
మీడియా నివేదికల ప్రకారం, కంపెనీ రాబోయే కొన్నేళ్లలో విమానాల డెలివరీలు ప్రారంభించవచ్చు. డెలివరీకి ముందు కంపెనీ టెస్ట్ ఫ్లైట్ సమాచారాన్ని ఉపయోగించి విమానాన్ని మెరుగుపరచడానికి ప్రయత్నిస్తుంది.

ఎన్ని వెర్షన్లు
ఎలక్ట్రిక్ విమానం ఎలిస్ మూడు వెర్షన్లలో రానుంది. వీటిలో మొదటి వెర్షన్‌లో తొమ్మిది మంది ప్రయాణికులు ప్రయాణించే సామర్థ్యం ఉంటుంది. రెండో వెర్షన్‌లో ఆరుగురు ప్రయాణించే సామర్థ్యం ఉంటుంది. మూడవ వెర్షన్ కార్గో కోసం తయారు చేసారు. ఈ అన్ని వెర్షన్లలో ఇద్దరు సిబ్బందికి కూడా స్థలం ఉంటుంది.
 

click me!