ఇండియాలో లాంచ్ అయిన రేంజ్ రోవర్ కొత్త మోడల్ కార్

By Sandra Ashok Kumar  |  First Published Jan 31, 2020, 3:54 PM IST

కొత్త జెనరేషన్ రేంజ్ రోవర్ ఎవోక్ దాని డిజైన్ ఇంకా మార్పులు వెలార్ కార్ మోడల్ లాగా ఉంటుంది. ఎక్కువ క్యాబిన్ స్థలం, కొత్త ఇంజిన్ ఆప్షన్స్, కొత్త టెక్నాలజితో వస్తుంది.
 


జాగ్వార్ ల్యాండ్ రోవర్ ఇండియా సెకండ్ జెనరేషన్ రేంజ్ రోవర్ ఎవోక్‌ను ఇండియాలో విడుదల చేసింది. దీని ప్రారంభ ధర 54.94 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా) నుండి ప్రారంభమవుతుంది.ఈ కారులో రెండు మోడళ్ళు ఎస్ ఇంకా ఎస్ఇ అనే రెండు వేరియంట్లు ఉన్నాయి.

also read అద్భుతమైన ఫీచర్లతో మెర్సిడెస్ బెంజ్‌ కొత్త ఎస్‌యూవీ కార్...

Latest Videos

undefined

సరికొత్త కారు ప్రస్తుత వెర్షన్ స్పోర్ట్స్ న్యూ టెక్నాలజి, కొత్త ఇంజన్ ఆప్షన్స్, కొత్త డిజైన్ లాంగ్వేజ్ ద్వారా పోపులరిటీ పెంచుతుంది.కొత్త రేంజ్ రోవర్ ఎవోక్ ప్రీమియం ట్రాన్స్వర్స్ ఆర్కిటెక్చర్ ఆధారంగా రూపొందించారు.లేన్ కీప్ అసిస్ట్, పార్క్ అసిస్ట్, ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్‌లతో పాటు ఆరు కలర్ ఆప్షన్లలో ఈ ఎస్‌యూవీని అందుబాటులోకి తెచ్చారు.

 
రేంజ్ రోవర్ ఎవోక్ లో బి‌ఎస్6  2.0-లీటర్ ఇంజెనియం పెట్రోల్, డీజిల్ ఇంజన్ తో వస్తుంది.  జగ్వార్ ఎక్స్‌ఈ కార్ డిసెంబర్ లో లాంచ్ చేశారు. దీనికి 2.0-లీటర్ ఇంజెనియం పెట్రోల్, డీజిల్ ఇంజన్ తో వస్తుంది. పెట్రోల్ వెర్షన్  247 బిహెచ్‌పి, పీక్ టార్క్ 365 ఎన్ఎమ్ ఉత్పత్తి చేస్తుంది.

also read హోండా అమేజ్‌ బిఎస్‌ 6 కార్ లాంచ్

డీజిల్ వెర్షన్ 178 బిహెచ్‌పి, 430 ఎన్ఎమ్ పీక్ టార్క్ అవుట్ అందిస్తుంది.రెండు ఇంజన్లు 9-స్పీడ్ ఆటోమేటిక్  గేర్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది. కార్గో స్థలం ఇప్పుడు 610 లీటర్లతో ఆరు శాతం ఎక్కువ స్పేస్ కల్పిస్తుంది.కొత్త ఎవోక్ ఇంటీరియర్ క్లియర్ డిజైన్ లాంగ్వేజ్ తో వస్తుంది. 


కొత్త ట్విన్ టచ్‌స్క్రీన్, ఇన్‌కంట్రోల్ టచ్ ప్రో డుయో ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఇందులో కొత్త వేగవంతమైన సాఫ్ట్‌వేర్, 16-వే సీట్ కంట్రోల్స్, క్యాబిన్ ఎయిర్ ఫీచర్స్ ఉన్నాయి.రేంజ్ రోవర్ ఎవోక్ 'క్లియర్‌సైట్ గ్రౌండ్ వ్యూ' టెక్నాలజీని కలిగిన మొట్టమొదటి వాహనం. 

click me!