పెట్రోల్-డీజిల్‌ కార్లతో పోలిస్తే ఎలక్ట్రిక్ కార్ కొనడం ఎంత వరకు బెస్ట్.. సర్వీసింగ్, మెయింటైనాన్స్ ఎంతంటే?

By asianet news telugu  |  First Published Nov 25, 2022, 5:55 PM IST

ఇతర వాహనాలతో పోలిస్తే ఎలక్ట్రిక్ వాహనాలు ఖరీదైనవి కావచ్చు, కానీ అవి కాలుష్యం ఇత్పత్తి  చేయవు. దీంతో పాటు వాటి మెయింటైనాన్స్  ఖర్చు కూడా చాలా తక్కువ. ఈ ముఖ్య కారణాలను పరిశీలిస్తే ఇండియాలో వేలాది ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేస్తున్నారు.


ఇండియాలో ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య నిరంతరం పెరుగుతోంది. ప్రజలు పెద్ద  సంఖ్యలో ఎలక్ట్రిక్ వాహనాలను కొనేందుకు మొగ్గుచూపుతున్నారు. ఈ దృష్ట్యా కంపెనీలు ఎన్నో ఆప్షన్స్ కూడా అందిస్తున్నాయి. ప్రస్తుతం, పెట్రోల్ లేదా డీజిల్ కారు కొనడం కంటే ఎలక్ట్రిక్ కార్ కొనడం కాస్త ఖరీదైనదే. కానీ ఇప్పటికీ ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాల వైపు ఆకర్షితులవుతున్నారు ఎందుకంటే వాటిని కొన్న తర్వాత మెయింటైనాన్స్ చాలా తక్కువగా ఉంటుంది.

ఎలక్ట్రిక్ వాహనం ఎందుకు కొనడం బెటర్ అంటే 
ఇతర వాహనాలతో పోలిస్తే ఎలక్ట్రిక్ వాహనాలు ఖరీదైనవి కావచ్చు, కానీ అవి కాలుష్యం ఇత్పత్తి  చేయవు. దీంతో పాటు వాటి మెయింటైనాన్స్  ఖర్చు కూడా చాలా తక్కువ. ఈ ముఖ్య కారణాలను పరిశీలిస్తే ఇండియాలో వేలాది ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేస్తున్నారు.

Latest Videos

undefined

మీరు డబ్బు ఎక్కడ ఆదా చేయవచ్చాంటే 

పెట్రోల్, డీజిల్ వంటి కార్లను నడపడంలో ఇంజిన్ కీలక పాత్ర పోషిస్తుంది. ఇంజిన్‌ మెయింటైనాన్స్ కి కూడా చాలా ఖర్చు అవుతుంది. కానీ ఎలక్ట్రిక్ కార్లలో  ఇంధనంతో నడితే ఇంజన్ ఉండదు, కాబట్టి ఖరీదైన పార్ట్స్ మెయింటైనాన్స్ ఖర్చు  ఆదా అవుతుంది. ICE మెయింటైనాన్స్ లో ఎయిర్ ఫిల్టర్, ఆయిల్ ఫిల్టర్, ఇంజన్ ఆయిల్, స్పార్క్ ప్లగ్‌లు, రేడియేటర్, కూలెంట్ రీప్లేస్‌మెంట్ ఉంటుంది. ఇంకా వీటి ఖర్చు ఎక్కువ, కానీ ఒక మోటారు మాత్రమే ఎలక్ట్రిక్ కారును నడుపుతుంది,  EVలో అలాంటి మెయింటైనాన్స్ అవసరం లేదు.

సస్పెన్షన్
పెట్రోల్-డీజిల్ కార్లు చాలా బరువుగా ఉండే ఇంజన్‌తో పాటు చాలా ఇతర భాగాలు ఉంటాయి. కారులో అమర్చిన సస్పెన్షన్ ప్రయాణీకుల బరువుతో పాటు వారి బరువును భరించేలా తయారు చేయబడుతుంది. కానీ ఎలక్ట్రిక్ కారులో ఇంజిన్‌కు బదులుగా మోటారు మాత్రమే ఉంటుంది. అందుకే వీటి బరువు సాధారణ కార్ల కంటే తక్కువ. సస్పెన్షన్ బరువును తగ్గించే ప్రయోజనాన్ని పొందుతుంది ఇంకా సాధారణ కారుతో పోలిస్తే వాటి లైఫ్ పెరుగుతుంది.

వైబ్రేషన్ అండ్ సౌండ్ 
సాధారణ కార్లతో పోలిస్తే, ఎలక్ట్రిక్ కారులో వైబ్రేషన్, సౌండ్ ఉండదు. సాధారణ కార్లలో ఇంజిన్ కారణంగా వైబ్రేషన్ ఉంటుంది, ఇంజిన్ సౌండ్ క్యాబిన్‌లోకి కూడా వస్తుంది. కానీ ఎలక్ట్రిక్ వాహనల్లో ఇంజన్ లేకపోవడం వల్ల ఈ సమస్యలు ఉండవు.

బాడీ  అండ్ టైర్ లైఫ్ 
పెట్రోల్, డీజిల్ కార్లతో పోలిస్తే, ఎలక్ట్రిక్ వాహనాలు తక్కువ బరువు ఉంటాయి, కాబట్టి వాటి బాడీ అండ్ టైర్ లైఫ్ ఎక్కువ ఉంటుంది. అలాగే, EVలో స్టోరేజ్ స్పేస్ సాధారణ కార్ల కంటే ఎక్కువ.

ఇక్కడ ఖర్చు అవుతుంది
పెట్రోల్ కార్లలో  ఒక టైమ్ లో చాలా పార్ట్స్ కి సర్వీసింగ్ అవసరం, కొన్నిసార్లు వాటిని మార్చవలసి ఉంటుంది. కానీ ఎలక్ట్రిక్ కారులో అత్యంత ఖరీదైన భాగాలు దాని మోటార్ అండ్ బ్యాటరీ. EVలో ఇంజిన్ ఆయిల్, కూలెంట్, స్పార్క్ ప్లగ్, రేడియేటర్, ఆయిల్ ఫిల్టర్ వంటి వాటిని మార్చడానికి ఎటువంటి ఖర్చు లేనప్పటికీ గేర్ ఆయిల్, ఛార్జర్, బ్రేక్ ప్యాడ్, లైట్లు, వైపర్, ఏ‌సి వంటి భాగాల సర్వీస్ సమయంలో ఛార్జీ ఉంటుంది. 

click me!