క్వాల్ కం ఫాస్టెస్ట్ ప్రాసెసర్‌తో ఐకూ కొత్త సిరీస్ స్మార్ట్ ఫోన్.. తక్కువ లైట్ లో కూడా బెస్ట్ ఫోటోలు తీయవచ్చు

By asianet news telugu  |  First Published Nov 23, 2022, 3:51 PM IST

ఐకూ 11 5జి చైనా తర్వాత లాంచ్ కానున్న మొదటి ఫోన్ ఇంకా Qualcomm ఫాస్టెస్ట్ అండ్ లేటెస్ట్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్‌తో వస్తుంది. 


స్మార్ట్‌ఫోన్ బ్రాండ్  ఐకూ త్వరలో  ఫ్లాగ్‌షిప్ ఫోన్ సిరీస్ ఐకూ 11 సిరీస్‌ను విస్తరిస్తూ కొత్త ఐకూ 11 5జిని పరిచయం చేయబోతోంది. ఈ ఫోన్ డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా లాంచ్ కానుంది. Qualcomm ఫాస్టెస్ట్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్‌తో ఈ ఫోన్ రవొచ్చు. ఈ ఫోన్‌తో Quad HD Plus రిజల్యూషన్‌తో డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీ అందించనుంది. అలాగే 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా  కూడా లభిస్తుంది.

 ధర 
అయితే ఈ ఫోన్ ధరను ఇంకా వెల్లడించలేదు. 50 వేల లోపు ధరకే ఈ ఫోన్‌ను అందించవచ్చని అంచనా. ఈ ఫోన్ iQOO 11 ప్రోతో పాటు 2023 ప్రారంభంలో పరిచయం చేయవచ్చని  చెబుతున్నారు.

Latest Videos

undefined

 ఐకూ 11 5జి చైనా తర్వాత లాంచ్ కానున్న మొదటి ఫోన్ ఇంకా Qualcomm ఫాస్టెస్ట్ అండ్ లేటెస్ట్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్‌తో వస్తుంది. ఈ ఫోన్ UFS 4.0 స్టోరేజ్ ఆప్షన్‌  128జి‌బి, 256జి‌బి, 512జి‌బి వరకు, LPDDR5x ర్యామ్ ఆప్షన్‌తో 8జి‌బి అండ్ 12 జి‌బి పొందుతుంది. ఫోన్ 6.78 అంగుళాల E6 AMOLED డిస్ ప్లే సపోర్ట్ పొందుతుంది. 

ఫోన్‌లో కెమెరా సెటప్ గురించి మాట్లాడితే iQOO 11 5Gలో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది, దీనిలో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, సెకండరీ 13-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా, 8-మెగాపిక్సెల్ పోర్ట్రెయిట్ కెమెరా సెన్సార్ ఉంటాయి. సెల్ఫీ అండ్ వీడియో కాల్స్ కోసం ఫోన్‌లో 16-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. కెమెరా ఫీచర్ల విషయానికొస్తే తక్కువ లైట్ అండ్ పోర్ట్రెయిట్ మోడ్‌లో కూడా అద్భుతమైన ఫోటోలు తీయవచ్చని పేర్కొంది. iQOO 11 5G 5000 mAh బ్యాటరీ పొందుతుంది, 120 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. ఫోన్ సెక్యూరిటి కోసం Android 13 బేస్డ్ Origin OS 3, ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ ఇచ్చారు. 
 

click me!