దేశంలో అత్యంత ప్రజాదరణ గల ఎస్ యూవీ మోడల్ కార్లలో కంపాస్ ఒకటి. ఇది టాటా హరియర్, ఎంజీ హెక్టార్ కార్లతో తలపడుతోంది.
న్యూఢిల్లీ: జీప్ న్యూ బ్రాండ్ కారు కంపాస్ కొనుగోలు చేసిన సెలబ్రిటీల జాబితాలో ఇండియా క్రికెట్ మాజీ సారథి కపిల్ దేవ్ కూడా చేరిపోయారు. ఈ మేరకు ఆయన ఎస్‌యూవీ వాహనాన్ని డెలివరీ తీసుకుంటున్న ఫొటోను జీప్ కంపాస్ సంస్థ తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో పోస్ట్ చేసింది.
రెడ్ పెయింట్ గల ఈ ఎస్‌యూవీ ఎంతో ఆకర్షణీయంగా ఉంది. ఇప్పటి వరకు జీప్ ఎస్‌యూవీ మోడల్ కంపాస్ కారును కొనుగోలు చేసిన ప్రముఖుల జాబితాలో తపసీ పన్ను, జాక్విలిన్ ఫెర్నాండేజ్, రెహియా చక్రవర్తి, అక్షయ్ కుమార్, రోహిత్ రాయ్ తదితరులు చేరిపోయారు.
undefined
aslo read విపణిలోకి ఒకినావా ఎలక్ట్రిక్ స్కూటర్...అతి తక్కువ ధరకే...
జీప్ రూపొందించిన అత్యంత ప్రజాదరణ గల ఎస్ యూవీ మోడల్ కారు ‘కంపాస్’ కారు టాటా హారియర్, ఎంజీ హెక్టార్ మోడల్ కార్లకు గట్టి పోటీనిస్తోంది. జీప్ కంపాస్ రెండు పవర్ ట్రైన్ వేరియంట్లలో లభించనున్నది.
1.4 లీటర్ల 4 సిలిండర్ ముల్టియార్ పెట్రో్ ఇంజిన్ 160 బీహెచ్పీ, 250 ఎన్ఎం టార్చ్, 2.0 లీటర్ల డీజిల్ ఇంజిన్ 173 బీహెచ్పీ, 230 ఎన్ఎం టార్చి విడుదల చేస్తుంది. పెట్రోల్ వేరియంట్ కారులో 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్సిమిషన్, ఆప్షనల్ 7-స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ అమర్చారు.
also read ఇండియన్లకు MVPపై మోజు.. 11 సెకన్లలో వీ-క్లాస్ ఎలైట్..రూ.1.10 కోట్లు
న్యూ జీప్ కంపాస్ కారులో 7.0- అంగుళాల యూ కనెక్ట్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ టచ్ రెస్పాన్సివ్‌గా ఉంటుంది. ఆండ్రాయిడ్ ఆటో అండ్ ఆపిల్ కార్ ప్లేతో ఇంటిగ్రేటెడ్ వాయిస్ కమాండ్ కూడా జత కలిపారు. కీ లెస్ ఎంట్రీతోపాటు పుష్ బటన్ స్టార్ట్, డ్యుయల్ జోన్ ఏసీ కలిగి ఉంటుంది.